Switch to English

టీఆర్‌ఎస్‌ నైతిక ఓటమి.. బీజేపీ నైతిక గెలుపు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. గ్రేటర్‌ ఓటరు, హంగ్‌ తీర్పునిచ్చారు. ఏ పార్టీకీ గ్రేటర్‌ మేయర్‌గిరీ దక్కించుకునే స్పష్టమైన మెజార్టీ రాలేదు. సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరించింది. ఆ తర్వాతి స్థానం భారతీయ జనతా పార్టీదే. మజ్లిస్‌ పార్టీ తన స్థానాల్ని దాదాపు నిలబెట్టుకుంది.. ఒకటి రెండు స్థానాల్ని కోల్పోయింది. ఎలా చూసినా, గ్రేటర్‌ ఎన్నికల్లో నైతిక గెలుపు మాత్రం భారతీయ జనతా పార్టీదే. అదే సమయంలో నైతిక ఓటమిని చవిచూసింది తెలంగాణ రాష్ట్ర సమితి. గత ఎన్నికల్లో 99 డివిజన్లను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌, ఈసారి వాటిల్లో చాలా డివిజన్లను కోల్పోవడం గమనార్హం.

అధికారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి టీఆర్‌ఎస్‌ గెల్చుకున్న స్థానాల సంఖ్య 60కి చేరలేకపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో నాలుగైదు రోజులు ఎన్నికల ప్రచారం కోసం సమయం వుండి వుంటే.. టీఆర్‌ఎస్‌ని బీజేపీ ఇంకా దారుణంగా ఓడించేదేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది.? గ్రేటర్‌ మేయర్‌ పీఠం ఎలా ఎక్కుతుంది.? అన్న విషయమై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ‘నిస్సిగ్గుగా ఎక్స్‌ అఫీషియో ఓట్లను టీఆర్‌ఎస్‌ వినియోగించుకోబోతోంది..’ అన్నది బీజేపీ విమర్శ. నిజానికి, ఇప్పుడే టీఆర్‌ఎస్‌.. నైతికతను చాటుకోవాల్సి వుంది.

ఎక్స్‌ అఫీషియో ఓట్లతో మేయర్‌గిరీని టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అలాగని మజ్లిస్‌ పార్టీ సహకారం తీసుకోలేదు. ఇక, ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. గ్రేటర్‌ మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే.. కానీ, టీఆర్‌ఎస్‌కి అటు మజ్లిస్‌ వైపు నుంచీ, ఇటు బీజేపీ వైపునుంచీ చుక్కలు కనిపిస్తాయి ఇకపై. ప్రధానంగా పాతబస్తీపై బీజేపీ చేసే రాజకీయాల్ని సమర్థించలేక, తిప్పికొట్టలేక టీఆర్‌ఎస్‌ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంకోపక్క, ‘నెల రోజుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..’ అని ఎన్నికల ప్రచారంలో నినదించిన మజ్లిస్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌ని మేయర్‌ పీఠం నుంచి కిందకి లాగేయడానికి రోజుల సమయమే తీసుకోవచ్చు కూడా. ఏమో, తెలంగాణ రాజకీయాల్లో ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు. బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కితే.. ఆ ఫలితాలెలా వుంటాయో టీఆర్‌ఎస్‌కే బాగా తెలుసు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...