Switch to English

డాక్టర్‌ రమేష్‌’బాబు’కి షాకిచ్చిన ఏపీ హైకోర్టు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అగ్ని ప్రమాదానికి గురై ఆ మంటల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ని రమేష్‌ ఆసుపత్రి నిర్వహించింది అప్పట్లో. స్వర్ణ ప్యాలెస్‌ అనే హోటల్‌ని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా నిర్వహించిన రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యం, అక్కడ ఫైర్‌ సేఫ్టీ నిబంధనల్ని పట్టించుకోలేదు. ఫలితంగా అంత పెద్ద ప్రమాదం సంభవించింది.

ఈ కేసు విషయమై పెద్దయెత్తున రాజకీయ రచ్చ జరిగింది. టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. మాటల యుద్ధం జరిగింది. కులాల కుంపటి తెరపైకొచ్చింది. సినీ నటుడు రామ్‌ కూడా సీన్‌లోకి వచ్చాడు. రమేష్‌ ఆసుపత్రి అధినేత, హీరో రామ్‌కి బంధువు కావడం గమనార్హం. ఆ తర్వాత, పోలీసుల వార్నింగ్‌తో రామ్‌ తన ట్వీట్ల యుద్ధానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాడనుకోండి.. అది వేరే సంగతి. కోర్టును ఆశ్రయించి అరెస్ట్‌ నుంచి రమేష్‌బాబు తప్పించుకోవడం, అంతకు ముందు రమేష్‌బాబు ఆచూకీ కోసం పోలీసులు ‘నజరానా’ ప్రకటించడం పెను సంచలనాలుగా మారాయి.

ఇప్పుడు ఈ కేసులో రమేష్‌బాబుకి షాక్‌ తగిలింది. మూడు రోజుల కస్టడీ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. దాంతో, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం పైచేయి సాధించినట్లయ్యింది. ఘటన అత్యంత బాధాకరం. ఇందులో ఆసుపత్రి నిర్లక్ష్యం సుస్పష్టం. అదే సమయంలో, స్వర్ణ ప్యాలెస్‌కి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా అనుమతులిచ్చిన అధికార యంత్రాంగం వైఫల్యం కూడా ఇందులో వుంది. జరిగిన ఘటనకు సంబంధించి దోషులకు శిక్ష పడాల్సిందే. కానీ, ఈ కేసులో రాజకీయ కోణం, కులం కోణం తెరపైకి రావడంతోనే.. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షం.. రెండూ ప్రజల్లో చులకనయ్యాయి.. ప్రభుత్వానికీ చెడ్డపేరు వచ్చిందనుకోండి.. అది వేరే విషయం.

ఇప్పుడిక రమేష్‌బాబుని పోలీసులు విచారించనున్న దరిమిలా, ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. న్యాయవాది సమక్షంలో డాక్టర్‌ రమేష్‌ని విచారించాలన్నది న్యాయస్థానం స్పష్టం చేసిన అంశం. రోజులు గడిచిపోయాయ్‌.. నెలలూ గడిచిపోయాయ్‌.. పోయిన ప్రాణాలకు సమాధానం చెప్పేదెవరు.? బాధ్యులకు శిక్ష పడేదెప్పుడు.? అంటూ బాధిత కుటుంబాలు వాపోతున్న దరిమిలా, కేసు విచారణ ఇప్పుడెలాంటి మలుపులు తిరుగుతుందన్నది వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...