Switch to English

'గ్రేటర్‌' ఎస్కేప్‌: నిప్పు నారా చంద్రుడి జాడెక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘సైబరాబాద్‌ నిర్మాతని నేనే.. హైద్రాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేసింది నేనే..’ అని చెప్పుకునే నిప్పు నారా చంద్రబాబునాయుడి ఆచూకీ గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో కనిపించడంలేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో, అప్పట్లో జరిగిన గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల కోసం బీభత్సమైన వ్యూహం రచించేశారు. కానీ, ఏమయ్యింది.? టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది గ్రేటర్‌ ఎన్నికల్లో.

ఏమో, ఆ ఎఫెక్ట్‌తోనేనేమో.. ఈసారి గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఆచూకీ ఎక్కడా కనిపించడంలేదు. ఎన్టీఆర్‌ ఘాట్‌ విషయమై మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ‘కూల్చివేత’ వ్యాఖ్యలు చేయడంతో, చంద్రబాబు సహా నారా లోకేష్‌ సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ వేసి సరిపెట్టేశారు. టీడీపీ కొన్ని చోట్ల గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, ఆయా అభ్యర్థుల తరఫున చంద్రబాబుగానీ, లోకేష్‌గానీ ప్రచారం చేయకపోవడం తెలుగు తమ్ముళ్ళను షాక్‌కి గురిచేస్తోంది.

చాలా చోట్ల తెలుగు తమ్ముళ్ళు, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా లైట్‌ తీసుకున్నారు. కొన్ని చోట్ల మాత్రం కష్టపడుతున్నారు. చంద్రబాబు, సైబరాబాద్‌ నిర్మాత అనీ.. ఇంకోటనీ కీర్తనలతో కూడిన ప్రచార వాహనాలు చాలా అరుదుగానే గ్రేటర్‌ ఎన్నికల్లో దర్శనమిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు, పాపం ఇలా గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటర్లకు మొహం చూపించలేని పరిస్థితి రావడమంటే ఆశ్చర్యకరమే కదా.!

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధికి సంబంధించినంతవరకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. చంద్రబాబుకి ఒకప్పుడు అత్యంత నమ్మకస్తులైన నేతలు, ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చక్రం తిప్పుతున్నారు. నిజానికి, వాళ్ళందర్నీ చంద్రబాబు తనంతట తానుగా దూరం చేసుకున్నారు. లేకపోతే, టీడీపీకి, చంద్రబాబుకీ ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నాక, సెటిలర్ల ఓటు బ్యాంకుపైనా అనుమానాలొచ్చాయేమో.. చంద్రబాబు తెలివిగా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారాన్ని ‘స్కిప్‌’ చేసేశారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...