Switch to English

ఓటిటి రివ్యూ: మా వింత గాధ వినుమా – ఈ లవ్ స్టోరీ పరమ బోరింగ్.!

Critic Rating
( 1.50 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow
Movie మా వింత గాధ వినుమా
Star Cast సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్
Director ఆదిత్య మండల
Producer సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, సునీత, కిర్తీ చిలుకూరి
Music శ్రీ చరణ్ పాకాల, రోహిత్ - జాయ్
Run Time 1 గంట 41 నిముషాలు
Release నవంబర్ 13, 2020

తెలుగులో మొట్ట మొదటి ఓటిటి రిలీజ్ అయిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’తో అందరి దృష్టిని ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ – సీరత్ కపూర్ ల జంట మరోసారి జంటగా చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మా వింత గాధ వినుమా’. థియేటర్స్ ని స్కిప్ చేసి డైరెక్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా ద్వారా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ ముందు గొడవ చేస్తూ పోలీసులకి దొరుకుతాడు మన హీరో సిద్దు(సిద్ధు జొన్నలగడ్డ). పోలీస్ ఆఫీసర్ భరణి(తనికెళ్ళ భరణి) అసలేం జరిగిందని అడగగా.. సిద్దు తన కథ మొదలు పెడతాడు.. తన కాలేజ్ డేస్ లో రెండేళ్లు సైట్ కొట్టి, 6 నెలలు ఎలా ప్రపోజ్ చేయాలా అని అలోచించి, ఫైనల్ గా సిద్దు వినీత వేణుగోపాల్(సీరత్ కపూర్)కి ప్రపోజ్ చేస్తాడు. మొదట్లో వినీత ఎస్ చెప్పకపోయినా, ఆ తర్వాత ఆ రిలేషన్ షిప్ సీరియస్ అవుతుంది. వినీత బ్రదర్ కార్తీక్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం అందరూ గోవా వెళ్తారు. అక్కడ జరిగే హఠాత్పరిణామం వల్ల సిద్దు – వినీత పెళ్లి చేసేసుకోవడం, తాగిన మత్తులో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. దాంతో సిద్దు – వినీతల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి? వారి ఇరువురు ఫ్యామిలీస్ ఎలా సఫర్ అయ్యాయనేదే మిగిలిన కథ.

తెర మీద స్టార్స్..

సిద్ధు జొన్నలగడ్డ మరోసారి పక్కింటి కుర్రాడి పాత్రలో బాగానే చేసాడని చెప్పాలి. లవర్ బాయ్ గా లవ్ సీన్స్ లో చాలా బాగా చేసాడు. కానీ ఎమోషనల్ సీన్స్ లో ఏదో మిస్సింగ్.. సీరియస్ గానే ఏడుస్తుంటాడు కానీ పెద్దగా కనెక్ట్ నటన, అలాగే సీన్ లోని కంటెంట్ అంతగా కనెక్ట్ అవ్వదు. ఇకపోతే సీరత్ కపూర్ ని మొదటి సినిమా ‘రన్ రాజా రన్’ తర్వాత అంత బాగా ప్రెజంట్ చేసిన సినిమా ఇదే అని చెప్పాలి. సూపర్ క్లాసీ గా చూపించారు. తను కూడా వినీతగా బాగా చేసింది. ఇకపోతే చెప్పుకోవాల్సింది తనికెళ్ళ భరణి గారు, తెలంగాణ యాసలో ఆయన డైలాగ్స్ తో యువతని ఆకట్టుకుంటాడు. ఫిష్ వెంకట్ కూడా రెండు మూడు పంచ్ లతో నవ్విస్తాడు. మంచు లక్ష్మీ గెస్ట్ అప్పియరెన్స్ కూడా సిల్లీగా ఉంది. మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ కూడా వారి వారి పాత్రలకి న్యాయం చేశారు.

తెర వెనుక టాలెంట్..

ముందుగా సిద్ధు సినిమాకి హీరోగానే కాకుండా కథ, డైలాగ్స్, ఎడిటింగ్ మరియు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా చాలా బాధ్యతలే తీసుకున్నాడు. కానీ అన్నింటిలోనూ సగం సగం పనే కనిపిస్తుంది, అందుకే సినిమాకూడా అలానే వచ్చింది. హీరోగా ఎలా చేసాడో చెప్పేశాం కాబట్టి, కథ విషయానికి వస్తే.. చాలా కాలంగా తిప్పి తిప్పి తీస్తూ, చూపిస్తున్న ప్రేమకథే ఇది కూడా.. కానీ మొదటి 40 నిమిషాలు ఎప్పటిలానే పలు లవ్ సీన్స్, డైలాగ్స్ తో అలా అలా నడిపించేసారు. కానీ ప్రతి ప్రేమ కథలో బ్రేకప్ తర్వాత కథ గమనం మారిపోయి గందరగోళం అయిపోతుంది. ఇక్కడా అదే జరిగింది.. సినిమా స్లో అయిపోయి, బోరింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి, చూసిన సన్నివేశాలే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ చూస్తున్న వారికి చిరాకు తెప్పించి చివరికి హీరో హీరోయిన్ ని కలిపేయడం. కథ పరంగా చాలా వీక్ అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ కథల్లో ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా ముఖ్యం. కానీ ఇక్కడ అదే మిస్సింగ్. ఇకపోతే ఎడిటింగ్ లో కూడా పెద్ద ఎఫెక్ట్ కనిపించలేదు. ఇక ఆదిత్య మండల, మారుతీ రావు, నరసింహరాజు ఇలా ముగ్గురు కలిసి అడిషనల్ కథ, స్క్రీన్ ప్లే రాసినప్పటికీ సినిమాని సేవ్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. డైరెక్టర్ గా ఆదిత్య కొన్ని టెక్నికల్ విషయాల్లో గుడ్ అనిపించుకున్నా సినిమాని కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు.

శ్రీ చరణ్ పాకాల అందించిన ఒక పాట బాగుంది. అలాగే రోహిత్ – జాయ్ ల నేపధ్య సంగీతం చాలా బాగుంది. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. ప్రతి సీన్ లో విజువల్స్ తో మూడ్ క్రియేట్ చెయ్యడానికి ట్రై చేసాడు. కానీ నటీనటుల నటన అంతగా లేని చోట తన విజువల్స్ వేస్ట్ అయిపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– మొదటి 40 నిమిషాలు అండ్ డైలాగ్స్
– సిద్ధు – తనికెళ్ళ భరణి సీన్స్
– సాయి ప్రకాష్ విజువల్స్

బోరింగ్ మోమెంట్స్:

– పాత చింతకాయపచ్చడి లవ్ స్టోరీ
– బోరింగ్ కథనం
– వీక్ డైరెక్షన్
– ఎమోషన్ అస్సలు కనెక్ట్ కాకపోవడం
– కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడం

విశ్లేషణ:

ఆహా నుంచి వచ్చిన ‘మా వింత గాధ వినుమా’ సినిమాలో నైస్ కామెడీ, లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని మన హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రమోట్ చేశారు. కానీ ఇందులో ఎంటర్టైన్మెంట్ తక్కువ, బోరింగ్ తో చిరాకు తెప్పించే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. మొదట ఆసక్తికరంగా స్టార్ట్ చేసినా, ఆ తర్వాత అనుకున్న ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా రీచ్ చేయలేక చతికిలబడిపోవడమే కాకుండా గంటా 41 నిమిషాల సినిమాని కూడా నాలుగుగంటల సినిమా చూసాం అనే ఫీలింగ్ ని క్రియేట్ చేశారు. ఓవరాల్ గా ‘మా వింత గాధ వినుమా’ సినిమా చూసినవారు ‘తలనొప్పి బాబోయ్’ అనేలా ఉంది.

చూడాలా? వద్దా?: ఏదైనా మీకు నచ్చిన సూపర్ హిట్ లవ్ స్టోరీ చూడచ్చు, కానీ ఇది వద్దు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 1.5/5

5 COMMENTS

  1. 532491 900278The the next occasion Someone said a weblog, Hopefully so it doesnt disappoint me approximately this. What im saying is, I know it was my choice to read, but I really thought youd have something intriguing to express. All I hear is often numerous whining about something which you could fix in case you werent too busy looking for attention. 311710

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...