Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: ఒరేయ్ బుజ్జిగా – ఈ బుజ్జిగాడు బాగా బోరింగ్.!

Critic Rating
( 1.50 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow
Movie ఒరేయ్ బుజ్జిగా
Star Cast రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హేభ పటేల్
Director విజయ్ కుమార్ కొండ
Producer కెకె రాధామోహన్
Music అనూప్ రూబెన్స్
Run Time 2 గంటల 28 నిముషాలు
Release అక్టోబర్ 2, 2020

వరుసగా 6 ప్లాప్స్ తో డిజాస్టర్స్ లో ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సారి కంప్లీట్ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టాలని చేసిన సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’. మాళవిక నాయర్ హీరోయిన్ గా, హేభ పటేల్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి విజయ్ కుమార్ కొండ. మార్చ్ 25న థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన సినిమా కోవిడ్ పాండెమిక్ వలన ఆగిపోయింది. ఇప్పుడప్పుడే థియేటర్స్ తెరుచుకునే పరిస్థితులు లేనందు వలన డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా ద్వారా నేడు విడుదలైంది. మరి రాజ్ తరుణ్ కి హిట్ ఇచ్చేలా సినిమా ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

శ్రీను అలియాస్ బుజ్జి (రాజ్ తరుణ్) ఇంట్లో సెట్ చేసిన పెళ్లి సంబంధం నచ్చక తాను ప్రేమించిన అమ్మాయి సృజన(హేభ పటేల్)ని కలుసుకోవడానికి హైదరాబాద్ బయలు దేరుతాడు. అదే టైంలో అదే ఊరిలో ఉన్న కృష్ణవేణి(మాళవిక నాయర్) తన బావతో పెళ్లితో ఇష్టం లేక పారిపోతుంది. అలా ఇద్దరూ ఒకే ట్రైన్ ఎక్కుతారు. కానీ ఊరంతా ఇద్దరూ కలిసి లేచిపోయారు అని ఊరంతా పుకారు పుడుతుంది. ఆ పురాకు బుజ్జి మరియు కృష్ణవేణి లైఫ్ లో తీసుకొచ్చిన మార్పులు ఏమిటి? వాళ్ళ ఇద్దరూ ఎన్ని తిప్పలు పడ్డారు అనేదే మిగిలిన కథ..

తెర మీద స్టార్స్..

రాజ్ తరుణ్ ఎప్పటిలానే మంచి ఈజ్ తో నటించాడు. హీరోగా తన వంతు పాత్ర తాను పర్ఫెక్ట్ గా చేసాడు. పలు చోట్ల తన డైలాగ్ డెలివరీ కాస్త నవ్వు తెప్పిస్తుంది.. మాళవిక నాయర్ మొదటి సారి ఫుల్ ఫన్ ఉన్న పాత్రలో బాగానే చేసింది. చివర్లో ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంది. ఇక హేభ పటేల్ కి సినెమాలో పెద్ద ప్రాధాన్యత లేదు. ఏదో గ్లామర్ కోసం మాత్రమే సినిమాలో పెట్టారు. ఇక సప్తగిరి, సత్య, మధు లాంటి కమెడియన్స్ ఉన్నప్పటికీ వారు నవ్వించడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. పవర్ఫుల్ లేడీ పాత్రలో వాణి విశ్వనాథ్ మరోసారి మెప్పించారు. సీనియర్ నటులైన నరేష్, పోసాని కృష్ణమురళిలు ఉన్నంతలో బాగానే చేశారు.

తెర వెనుక టాలెంట్..

సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుంటే.. డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ తనకి హిట్ ఇచ్చిన మొదటి సినిమా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కథని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ తీశారు.. అందులో కథ రొటీన్ అయినా కథనం, కామెడీ వర్కౌట్ అయ్యి సినిమా హిట్ అయ్యింది. కానీ ఇక్కడ అవేమీ వర్కౌట్ కాకపోవడంతో చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కథ, కథనం, డైరెక్షన్ ఇలా ఈ మూడు విషయాల్లోనూ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బాగుంది. కామెడీ లేకపోయినా తన మ్యూజిక్ తో ఫన్ తీసుకురావడానికి ట్రై చేసాడు, కానీ కంటెంట్ వీక్ గా ఉండడం వలన సేవ్ చేయలేకపోయాడు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ మరియు టి. రాజ్ కుమార్ ఆర్ట్ వర్క్ కి ది బెస్ట్ అని చెప్పచ్చు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ లో చాలా లాగ్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అలాగే ఓటిటి రిలీజ్ వలన నష్టాలు మిస్ అయ్యాయి.

విజిల్ మోమెంట్స్:

– నటీనటుల నటన
– సందర్భానుసారంగా వచ్చే ఒకటి రెండు కామెడీ సీన్స్

బోరింగ్ మోమెంట్స్:

– వర్కౌట్ కాని కామెడీ
– రొటీన్ కథ
– అంతా తెలిసిన కథనం
– ఎమోషన్ కనెక్ట్ కాలేదు
– బాబోయ్ అనిపించే రన్ టైం
– వీక్ డైరెక్షన్

విశ్లేషణ:

అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫన్ రైడ్ అని చెప్పుకుంటూ ప్రమోట్ చేసిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా చూసాక రెస్పాన్స్ ఏంటంటే ‘మోస్ట్ బోరింగ్ రైడ్’ అనిపించడమే కాకుండా బోనస్ గా రెండున్నర గంటల పాటు టైం వేస్ట్ అయ్యిందనే ఫీలింగ్ కూడా పక్కాగా వస్తుంది. కావున మీ విలువైన సమయం వృధా చేసుకుంటారా? లేదా? అనేది మీ ఛాయస్. ఫైనల్ గా తెలుగు నుంచి రిలీజైన మరో ఓటిటి డిజప్పాయింటెడ్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’.

చూడాలా? వద్దా?: మీ విలువైన సమయాన్ని వృధా చేసుకొని, లేని బోరింగ్ ని తెచ్చుకోవాలంటే చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...