Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: నిశ్శబ్దం – ఓటిటిలో చూడడం కూడా కష్టమే సుమీ.!

Critic Rating
( 2.00 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie నిశ్శబ్దం
Star Cast అనుష్క శెట్టి, మాధవన్, అంజలి, షాలిని పాండే
Director హేమంత్ మధుకర్
Producer టిజి విశ్వప్రసాద్
Music గోపి సుందర్ అండ్ గిరీష్.జి
Run Time 2 గంటల 5 నిముషాలు
Release అక్టోబర్ 2, 2020

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. తెలుగు, తమిళ్, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన ఈ సినిమా థియేటర్ రిలీజ్ కి ఆలస్యం అవుతుండడంతో ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజయ్యింది. మరి పాన్ వరల్డ్ సినిమాగా చేసిన ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..

కథ:

సాక్షి(అనుష్క) చెవిటి, మూగ అయిన ఒక పెయింటర్ అండ్ ఆంథోనీ(మాధవన్) ఓ ఫేమస్ మ్యుజిషియన్. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అవుతుంది.. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక చిన్న ట్రిప్ కి వెళ్తారు. అందులో భాగంగా 1972లో హాంటెడ్ హౌస్ గా మూసి వేసిన వుడ్ సైడ్ విల్లాలో ఉన్న సాక్షికి కావాల్సిన ఓ పెయింటింగ్ ఉందని ఆంథోనీ సాక్షిని అక్కడికి తీసుకువెళ్తాడు. ఆ హాంటెడ్ హౌస్ లో ఆంథోనీ అనుమానాస్పదంగా చంపబడతాడు. అందరూ ఆ హాంటెడ్ హౌస్ లో ఉన్న జోసెఫిన్ వుడ్ ఆత్మే చంపింది అనుకుంటారు. కానీ ఆ కేసు టేకప్ చేసిన క్రైమ్ డిటెక్టివ్ మహా(అంజలి) అందులోని కొత్త లూప్ హొల్స్ ని కనుక్కోవడం మొదలు పెడుతుంది. అలా మొదలు పెట్టిన ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన నిజానిజాలు ఏమిటి? చాలా రోజులుగా సియాటెల్ లో కనిపించకుండా పోతున్న అమ్మాయిలకి ఆంథోనీ కేసుకు ఏమన్నా సంబంధం ఉందా? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

తెరపై కనిపించిన అందరు నటీనటులు అద్భుతంగా నటించారని చెప్పాలి. అందుకే సినిమా సాగదీసినట్లున్న ఉన్నా కొంత వరకు చూడగలం. ఇక నటీనటుల విషయానికి వస్తే.. అనుష్క మరోసారి తన అభినయంతో మరోసారి సూపర్ స్టార్ అనిపించుకుంది. మ్యూట్ ఆర్టిస్ట్ గా తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక కీలక పాత్రలో కనిపించిన మాధవన్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో చాలా బాగా చేసాడు. మైఖేల్ మాడ్సన్, అంజలి లు క్రైమ్ డిటెక్టివ్ ఆఫీసర్స్ గా తమ వంతు పాత్ర పర్ఫెక్ట్ గా చేశారు. షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ వారి వారి పాత్రలకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.

తెర వెనుక టాలెంట్..

కథ పరంగా చూసుకుంటే అనుష్క చేసిన మ్యూట్ ఆర్టిస్ట్ పాత్ర తప్ప కొత్తగా ఏమీ అనిపించదు. ఒక క్రైమ్ థ్రిల్లర్ కథకి కావాల్సినట్టే ఒక నలుగురు సస్పెక్ట్స్, ఫైనల్ గా ఇంకో యాంగిల్ లో ట్విస్ట్ ని రివీల్ చెయ్యడం ఇవన్నీ కామన్ గా ఉన్నాయి. ఇక కథనం విషయానికి వస్తే.. కోన వెంకట్ అటు ఇటు కథని మలుపులు తిప్పాలని ట్రై చేసాడు.. కానీ అన్నీ క్లియర్ గా ముందే తెలిసిపోతుండడం వలన ఒక్క ట్విస్ట్ కూడా పెద్దగా కిక్ ఇవ్వదు. ఇక డైరెక్టర్ గా హేమంత్ మధుకర్ నటీనటుల నుంచి నటనని రాబట్టుకోవడంలో బెస్ట్ అనిపించుకున్నాడు, కానీ చూసే ఆడియన్స్ కి కథని ఎంగేజ్ చేయడంలో మాత్రం నిశ్శబ్దాన్ని పాటించాడని చెప్పాలి.

శనియిల్ డియో సినిమాటోగ్రఫీ ఓ హాలీవుడ్ ఫిలిం చూసిన ఫీల్ ని ఇస్తుంది. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, కానీ కథలో మ్యాటర్ లేకపోవడం వలన వృధా అయిపొయింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా థ్రిల్లర్ కి తగ్గట్టు ఇంకాస్త స్పీడ్ గా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా అనిపిస్తాయి.

విజిల్ మోమెంట్స్:

– అనుష్క క్యారక్టరైజేషన్ అండ్ పెర్ఫార్మన్స్
– సపోర్టింగ్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్
– సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– కథ
– థ్రిల్లింగ్ గా లేని కథనం
– హుక్ చేయలేకపోయిన డైరెక్షన్
– ఓపెనింగ్ సీన్ కి సినిమాకి సంబంధం లేకపోవడం
– 125 నిమిషాలైనా చాలా సాగదీయడం
– వెరీ బాడ్ క్లైమాక్స్

విశ్లేషణ:

‘నిశ్శబ్దం’ ఓ థ్రిల్లర్ సినిమా.. ఓపెనింగ్ హార్రర్ థ్రిల్లర్లా ఓపెన్ చేసి, ఆడియన్స్ కి ఎదో చూపించబోతున్నాం అని ఫీల్ జెనరేట్ చేసి అక్కడి నుంచి ఎంత డల్ గా చెప్పాచ్చో అంత డల్ గా చెప్పిన సినిమా ‘నిశ్శబ్దం’. ఈ మధ్య తెలుగు సీరియల్స్ ఈ థ్రిల్లర్ కన్నా ఆసక్తిగా ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అనుష్క అనే ఒక్క టాగ్ వల్ల ఈ సినిమా ఆడియన్స్ కి అట్రాక్షన్ ని కలిగిస్తుంది, కానీ చూసాక అనుష్క నటన బాగున్నా ఎందుకు ఇలాంటి వీక్ కంటెంట్ ఉన్న సినిమాని సెలక్ట్ చేసుకుందనిపిస్తుంది. అయినా ఇలాంటి కథలు ఇప్పటికే చేసేసింది కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఫైనల్ గా తెలుగు నుంచి ఓటిటిలో రిలీజైన మరో బోరింగ్ మూవీ ‘నిశ్శబ్దం’.

చూడాలా? వద్దా?: నిశ్శబ్దంగా స్కిప్ చేసేయచ్చు.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5 

4 COMMENTS

  1. 897283 362704Aw, it was a very excellent post. In notion I would like to devote writing such as this furthermore,?C spending time and specific function to produce an excellent article?- nonetheless so what can I say?- I waste time alot and never at all seem to obtain 1 thing completed. 715757

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

వైనాట్ 175 అటకెక్కింది.! ఓన్లీ పిఠాపురం చుట్టూ వైసీపీ గింగరాలు తిరుగుతోంది.!

అదేంటీ, వైనాట్ 175 అన్నారు కదా.. ఇప్పుడేంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ అంతా, పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరగడం.? ఔను, వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పిఠాపురం మీదనే...

Lokesh Kanagaraj: రొమాంటిక్ సాంగ్ లో లోకేశ్ కనగరాజ్.. వీడియో వైరల్

Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ప్రస్తుతం ఆయన నటుడిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...