Switch to English

బీజేపీతో టీడీపీ దోస్తీ.. ఇంకా ఛాన్స్‌ వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతమవడం అనేది ఇప్పట్లో జరిగేందుకు ఆస్కారం లేదు. ప్రత్యేక హోదా సహా, రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాల్లో ‘మాకేంటి సంబంధం.?’ అని చేతులెత్తేయడమే ఇందుకు కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రత్యేక హోదా మినహా, మిగతా అన్ని అంశాల్నీ తాము నెరవేరుస్తున్నామని కమలదళం చెబుతోంది. రాష్ట్రంలో బీజేపీకి తగిన ఓటు బ్యాంకు లేకపోవడంతోనే, ఏపీని బీజేపీ పట్టించుకోవడంలేదన్న భావనతోనే రాష్ట్ర ప్రాజీనకం వున్నారన్నది నిర్వివాదాంశం. మరి, ఈ అపప్రధను బీజేపీ ఎలా పోగొట్టుకుని, ప్రజలకు దగ్గరవుతుంది.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ పొత్తు నడుస్తోంది. ముందు ముందు బీజేపీ, టీడీపీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయన్న చర్చ చాన్నాళ్ళుగా సాగుతోంది. టీడీపీని తూలనాడే క్రమంలో, వైసీపీకి అదనపు బలాన్నిస్తోన్న బీజేపీ.. మరింతగా రాష్ట్ర ప్రజలకు దూరమవుతోందన్నది నిర్వివాదాంశం. జనసేనతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తోన్న బీజేపీ, ఆ దిశగానే రాష్ట్ర ప్రజలకు చేరువయితే.. ఈ పాటికే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేది. రాజధాని అమరావతి విషయంలో బీజేపీ గందరగోళం ఆ పార్టీకే కాదు, బీజేపీ మిత్రపక్షం జనసేనకూ ఇబ్బందికరంగా మారింది. 2024 ఎన్నికలకు ఇంకా సమయం వుంది. కానీ, ఈలోగా రాష్ట్రంలో పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ బాగానే మారుతున్నాయి. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అన్న ధోరణిలో రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ పట్టు బిగించాల్సి వుంది. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో జనసేన – బీజేపీ మధ్య ‘సఖ్యత’ అంతగా కనిపించడంలేదు.

ఏదన్నా విషయమ్మీద జనసేన గట్టిగా నిలబడితే, బీజేపీ నేతలు తమ నోటి దురదతో పరిస్థితిని ప్రత్యర్థులకు అనుకూలంగా మార్చేస్తున్నారు. ఇలాంటి చాలా విషయాల్లో బీజేపీ ‘సెట్‌ రైట్‌’ కావాల్సి వుంది. కాగా, బీజేపీకి, జనసేన కంటే టీడీపీతోనే అడ్వాంటేజ్‌.. అన్న దిశగా బీజేపీలో కొందరు నేతలు అధిష్టానానికి రిపోర్ట్స్‌ ఇస్తున్నారట. దానికి వ్యతిరేకంగా వైసీపీ ‘కోవర్టులూ’ తమ పని తాము చేసుకుపోతున్నారట. ‘పొత్తుల విషయం అధిష్టానం తేలుస్తుంది..’ అంటూ బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన భువనేశ్వరి, టీడీపీతో పొత్తు విషయమై నర్మగర్భంగా వ్యాఖ్యానించడం కొసమెరుపు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...