Switch to English

మంత్రి నాని హిందువే కాదు: పరిపూర్ణానంద ఫైర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,451FansLike
57,764FollowersFollow

తిరుమల డిక్లరేషన్ వివాదం అంతకంతకూ ముదురుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్తులు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అధికార వైసీపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అటు భజరంగ్ దళ్ కార్యకర్తలతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా స్పందించారు. తిరుమలపై మంత్రి కొడాలి నాని చేసిన విపరీత వ్యాఖ్యలను తప్పుబట్టారు. హిందూ ఆలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.

తిరుమలపై గతంలో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఏదైనా వివాదం తలెత్తితే దానిని పరిష్కరించాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుందని.. కానీ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. పవిత్ర తిరుమలపై విపరీత వ్యాఖ్యలు చేసిన నాని అసలు హిందువే కాడని పేర్కొన్నారు. ఒకవేళ నాని తిరుమల వచ్చినా ఆయన కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆయన హిందూ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినా సరే.. దేవుళ్లపై విపరీత వ్యాఖ్యలు చేసినందున హిందువు కాడన్నారు.

తిరుపతి ఎవడబ్బ సొమ్మని అనడం దారుణమైన అంశమని.. తిరుమల డిక్లరేషన్ పై ప్రశ్నించడం అహంకారమే అవుతుందని పరిపూర్ణానంద స్పష్టంచేశారు. మంత్రి భ్రమల్లో నుంచి బయటకు రావాలన్నారు. తిరుమల కొండతో పెట్టుకున్నవారి బూడిద కూడా దొరకలేదనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చరిత్ర చూస్తే అవన్నీ తెలుస్తాయన్నారు. సీఎం జగన్ వెంటనే దీనిపై స్పందించకపోతే ఆయనే ఈ మాటలు మాట్లాడించారని అనుకోవాల్సి వస్తుందని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు.

వైసీపీకి మొన్న వచ్చిన 151 సీట్లలో 149 సీట్లు హిందువులు ఓట్లు వేస్తేనే వచ్చాయన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో కొందరు ఈ దురాగతాలకు పాల్పడుతున్నారని.. ఇందులో మంత్రి నాని వంటి వాళ్లు భాగస్వాములయ్యారని స్వామి ఆరోపించారు. మరోవైపు డిక్లరేషర్ విషయంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు.

సీఎం హోదాలో ఉన్నవారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గతంలో సోనియాగాంధీ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. అలాగే వైఎస్ కూడా డిక్లరేషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. జగన్ కనీసం 20 నుంచి 25 ఏళ్లపాటు సీఎం హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...