Switch to English

మహేష్‌ బర్త్‌ డే: చంద్రబాబుని ఏకి పారేస్తున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి పెద్ద కష్టమే వచ్చి పడింది. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు పుట్టినరోజునాడు శుభాకాంక్షలు చెప్పడమే చంద్రబాబు చేసిన పెద్ద నేరంగా మారిపోయింది. ఏమిటీ వైపరీత్యం.? అనుకుంటున్నారా.! అసలు కథలోకి వెళితే, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజుని చంద్రబాబు లైట్‌ తీసుకున్నారు.

2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున యంగ్‌ టైగర్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన విషయం విదితమే. ఆ ప్రచారం సందర్భంగానే రోడ్డు ప్రమాదం జరిగి, జూ.ఎన్టీఆర్‌ తీవ్రంగా గాయపడ్డాడు కూడా. అయినాగానీ, కదల్లేని స్థితిలో మంచం మీద నుంచే ఎన్నికల ప్రసంగాలు దంచేశాడు.. అవి టీవీల్లో ప్రసారమయ్యాయి.. టీడీపీ శ్రేణుల్ని ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత యంగ్‌ టైగర్‌తో అవసరం తీరిపోయిందో ఏమో.. చంద్రబాబు, తనదైన రాజకీయం షురూ చేశారు.. యంగ్‌ టైగర్‌ని పక్కన పడేశారు.

ఆనాటి ఆ విషయాల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారిప్పుడు యంగ్‌ టైగర్‌ అభిమానులు. ‘ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ వేయడం చేతకాలేదుగానీ.. ఇప్పుడు మహేష్‌ కోసం వచ్చేశావా.?’ అంటూ విరుచుకుపడుతున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు. ‘కుటుంబ సభ్యులు కదా.. డైరెక్ట్‌గా చెప్పి వుంటార్లే..’ అంటూ చంద్రబాబు మద్దతుదారులు బుకాయించేందుకు నానా తంటాలూ పడుతున్నారు సోషల్‌ మీడియాలో.

‘తారక్‌ అన్న డేటా ప్యాక్‌ అయిపోయిందా పెద్దాయనా.?’ అంటూ ఓ నెటిజన్‌ సెటైరికల్‌గా ప్రశ్నించాడు. ‘తెలుగుదేశం పార్టీలోకి రానివ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ, ఒక మావయ్యగా ఆశీర్వదిస్తే పోయేది ఏం వుంది సర్‌..’ అంటూ మరో ఎన్టీఆర్‌ అభిమాని, చంద్రబాబుపై మండిపడ్డాడు.

‘వున్నపళంగా టీడీపీ పగ్గాలు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి అప్పగించడం తప్ప టీడీపీ బాగుపడటానికి ఇంకో మార్గం లేదు..’ అంటూ టీడీపీలో కొందరు సీనియర్‌ నేతలు తేల్చి చెబుతున్న వేళ, చంద్రబాబు.. వీలైనంతగా ఎన్టీఆర్‌ని టీడీపీకి దూరం పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు చాలాకాలంగా. అంతలా ఎన్టీఆర్‌ నుంచి తన కుమారుడు నారా లోకేష్‌కి రాజకీయంగా థ్రెట్‌ వుందని భావిస్తున్న చంద్రబాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌కి మొహమాటానికైనా శుభాకాంక్షలు చెబుతారని ఎలా ఆశించగలం.? అన్నది మెజార్టీ ఎన్టీఆర్‌ అభిమానుల ప్రశ్న.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...