Switch to English

నోటు తీసుకుని ఓటేసిన మీకు ఆ హక్కులేదు: నాగబాబు సంచలనం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

నిజం ఎప్పుడూ నిష్టూరంలానే వుంటుంది.! జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికరమైన ట్వీటేశారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వమని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు..’ అన్నది ఆ ట్వీట్‌ సారాంశం. ఓటర్లను ఉద్దేశించి జనసేన ముఖ్య నేత నాగబాబు చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

చాలామంది నాగబాబు ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ఏ స్థాయిలో నోట్లు పంచాయో చూశాం. ఈ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ క్రమంలో టీడీపీ కాస్త వెనుకబడింది.. వైసీపీ మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించింది. 2 వేల నుంచి 10 వేల దాకా ఓటు కోసం వైసీపీ వెచ్చించిన దాఖలాలున్నాయంటూ మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలొచ్చాయి.

‘ఒక మధ్య తరగతి ట్యాక్స్‌ పేయర్‌ ప్రభుత్వానికి టాక్స్‌ కడుతూనే వున్నాడు.. కానీ, ప్రభుత్వం ఆ టాక్స్‌ని జనాలకి పంచుతోంది. ఓ రోజు మధ్యతరగతి టాక్స్‌ పేయర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోయి నిరుపేదగా మారాడు.. జబ్బు చేసి ఆసుపత్రికి వెళదామంటే గవర్నమెంట్‌ హాస్పిటల్‌ లేదు. తన కుమారుడికి ప్రైవేట్‌ స్కూల్‌లో ఫీజు కట్టలేక గవర్నమెంట్‌ స్కూల్‌లో జాయిన్‌ చేద్దామంటే స్కూల్‌ లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆ టాక్స్‌ డబ్బులతో స్కూళ్ళు సరిగా కట్టలేదు.. ఆ టాక్స్‌ డబ్బుల్ని నిరుపేదల అకౌంట్‌లో వేసేశారు. డబ్బులు పంచడం వలన పేదరిక నిర్మూలన జరగలేదు. మధ్యతరగతి టాక్స్‌ పేకర్‌కి కూడా లాభం లేదు. ప్రభుత్వమంటే ఎవరో కాదు, మనమే. రాబోయే తరాలవారికి మనం ఖాళీ చేతుల్ని చూపిస్తున్నాం. ప్రజలు డబ్బు పంచే విధానాన్ని తిరస్కరించాలి..’ అంటూ ఓ నెటిజన్‌, నాగబాబు ట్వీట్‌కి రిప్లయ్‌ ఇచ్చాడు.

నిజమే, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా అభివృద్ధి అదఃపాతాళానికి వెళ్ళిపోతోంది. పబ్లిసిటీ స్టంట్స్‌ మీద వున్న యావ, ప్రజా రంజక పాలన మీద పాలకులకు లేకపోవడంతోనే ఈ దుస్థితి. అంతిమంగా ప్రజలకు అప్పులు మిగులుతున్నాయి.. రాజకీయ నాయకుల వ్యాపారాలు మాత్రం దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఈ వ్యవస్థ మారేదెన్నడు.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...