Switch to English

వాళ్ళందర్నీ క్లీన్‌ బౌల్డ్‌ చేసేస్తోన్న సోము వీర్రాజు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,451FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీలో వుంటూ, ఇతర పార్టీలకు సహకరిస్తున్నవారిపై ఏపీ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సోము వీర్రాజు, తాజాగా వెలగపూడి గోపాలకృష్ణను బీజేపీ నుంచి బయటకు పంపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని – కేంద్రం పాత్ర’ అనే అంశం చుట్టూ భారతీయ జనతా పార్టీలో భిన్న స్వరాలు విన్పిస్తున్నాయి. ఎంపీ సుజనా చౌదరి, రాజధాని విషయంలో కేంద్రం తగిన సమయంలో జోక్యం చేసుకుంటుందని చెబితే, బీజేపీ సోషల్‌ మీడియా విభాగం సాక్షిగా ఆ వాదనను కొట్టి పారేశారు కమలనాథులు.

మరోపక్క, రాజధాని అమరావతి విషయమై కోర్టును ఆశ్రయించిన లంకా దినకర్‌ విషయంలోనూ పార్టీ అధిష్టానం గుస్సా అవుతోంది. సుజనా చౌదరి, లంకా దినకర్‌.. తదితరులంతా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన విషయం విదితమే. మరోపక్క, బీజేపీలోని వైసీపీ మద్దతుదారుల విషయంలో కూడా సోము వీర్రాజు గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది. ‘బీజేపీలో.. బీజేపీ వాదులు మాత్రమే వుండాలి.. వేరే పార్టీల తరఫున వకాల్తా పుచ్చుకుంటే చర్యలు తప్పవు..’ అంటూ ఇప్పటికే సోము వీర్రాజు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

పార్టీలో తనకంటూ ఓ స్ట్రాంగ్‌ టీమ్ ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ‘స్క్రాప్‌’ అని భావిస్తోన్న నేతలందర్నీ బయటకు పంపేందుకు సోము వీర్రాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న చర్చ ఏపీ బీజేపీలోని నిఖార్సయిన కమలనాథుల నుంచి వ్యక్తమవుతోంది. మరోపక్క, ‘ఏం చూసుకుని ఈ అహంకారం.. గట్టిగా ఒక శాతం ఓటు బ్యాంకు అయినా కాపాడుకోగలమా.? బీజేపీ ఇంత దారుణ పరిస్థితుల్లో ఏపీలో వున్నప్పుడు.. ఇలా నేతల్ని బయటకు పంపి ఏం సాధిస్తారు.? అన్న వాదన కూడా లేకపోలేదు.

ఏదిఏమైనా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికవుతూనే సంచలన నిర్ణయాలకు తెరలేపారు సోము వీర్రాజు. ఆయన వచ్చాక, పార్టీలో భిన్న స్వరాలు తగ్గిన మాట వాస్తవం. అయితే, ఇదెంత కాలం.? అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...