Switch to English

అమరావతి ఉద్యమానికి ‘కమ్మటి వెన్నుపోటు’ తప్పట్లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఎక్కడ.? అన్న చర్చ మొదలయ్యాక, కొందరు విశాఖ పేరు చెబితే మరికొందరు కర్నూలు పేరు చెప్పారు. అయితే, మెజార్టీ మాత్రం ‘రాష్ట్రానికి మధ్యలో వుండాలి’ అనే అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుత అమరావతి ప్రాంతంతోపాటు, ప్రకాశం జిల్లాలోని దోనకొండ ప్రాంతం కూడా వార్తల్లోకెక్కింది. అయితే, చివరికి అమరావతిని రాష్ట్ర రాజధానిగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించేశారు.

అమరావతి చుట్టూ గతంలోనూ నానా యాగీ జరిగింది.. ఇప్పుడూ జరుగుతూనే వుంది. అమరావతితోపాటు మరో రెండు రాజధానులంటూ కొత్త వాదనను ప్రస్తుత వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తెరపైకి తెచ్చింది. ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతి మాత్రమే ముద్దు’ అంటూ అమరావతి కోసం భూములిచ్చిన రైతులు నినదిస్తున్నారు. నిజానికి, అమరావతి విషయంలో తొలుత రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా చాలామంది నినదించారు. దాంతో, ఆ ఉద్యమాన్ని పొలిటికల్‌గా వాడుకునేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘అత్యుత్సాహం’ చూపారు. అక్కడే, వ్యవహారం తేడా కొట్టేసింది.

‘కమ్మరావతి’ అంటూ వైసీపీ నేతలు చేసిన వాదనకు బలం చేకూరింది. క్రమంగా ‘అమరావతి ఉద్యమం’ నీరుగారుతూ వచ్చింది. అది జస్ట్‌ ఓ పబ్లిసిటీ స్టంట్‌లా మారింది. అయితే, అమరావతి కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నవారూ లేకపోలేదు. కానీ, వారిని ‘కమ్మ’గా సైడ్‌లైన్‌ చేసేసి, కొన్ని ‘పచ్చ చొక్కాలు’ డ్రైవింగ్‌ సీట్‌లోకి వచ్చేశాయి. అమరావతి కేవలం ఇప్పుడు కొన్ని గ్రామాల సమస్యగా మాత్రమే మారిపోయిందంటే.. దానికి పూర్తి బాధ్యత టీడీపీనే వహించాల్సి వుంటుంది.

బీజేపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్‌ కూడా తొలుత ఈ ఉద్యమంలో కన్పించాయి. ఒక్కొక్కర్నీ తెలివిగా తప్పించి, ఇప్పుడు పూర్తిగా దాన్ని ‘పచ్చ ఉద్యమం’గా టీడీపీ మార్చేసింది. పైగా, ప్రస్తుత పరిణామాలపై బీజేపీ, జనసేన సమాధానం చెప్పాలంటూ ‘పచ్చ చొక్కాలు’ కొత్త పల్లవి అందుకున్నాయి. ‘అమరావతి రైతుల తరఫున నిలబడ్తాం..’ అని బీజేపీ, జనసేన చెబుతున్నప్పుడు, ఆ రెండు పార్టీల్ని టీడీపీ ఎందుకు నిలదీయాలి.? చిత్రమేంటంటే వైసీపీ మీద కన్నా బీజేపీ, జనసేనల మీదనే టీడీపీ నేతలు, మద్దతుదారులు ఎక్కువగా విరుచుకుపడుతున్నారు. ఇది టీడీపీ – వైసీపీ మధ్య కొనసాగుతున్న 60-40 ఒప్పందాల్లో భాగమనుకోవాలా.? అదే నిజమైతే, ఇదీ అసలు సిసలు ‘కమ్మటి వెన్నుపోటు’ అన్న మాట.!

9 COMMENTS

  1. 303361 115045As far as me being a member here, I wasnt aware that I was a member for any days, really. When the post was published I received a notification, so that I could participate in the discussion with the post, That would explain me stumbuling upon this post. But were undoubtedly all members in the world of concepts. 56200

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....