Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: బీజేపీ గాలి టీడీపీ వైపు మళ్ళుతోందట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేశాయి. అటు కేంద్రంలో బీజేపీ, టీడీపీకి తమ మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తే, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి టీడీపీ మంత్రి వర్గంలో అవకాశం దక్కింది. నాలుగేళ్ళు ఈ రెండు పార్టీల ‘సంసారం’ సజావుగానే సాగినా, చివర్లో తేడా కొట్టేసిన విషయం విదితమే. ప్రస్తుతానికి టీడీపీ – బీజేపీ మధ్య వైరం చాలా గట్టిగానే వుంది.

నిజానికి, టీడీపీని బీజేపీ అస్సలేమాత్రం దగ్గరకు చేరనివ్వడంలేదు. అదీ అసలు విషయం. కానీ, టీడీపీ మాత్రం బీజేపీతో కలిసిపోవడానికే ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు ఇకపై మరింత గట్టిగా జరగబోతున్నాయట. అదే జరిగితే, జనసేన పార్టీ బీజేపీకి దూరమవడం ఖాయమేనట. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారనున్నాయనీ, అతి త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఢిల్లీ బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది.

అయితే, ఇది టీడీపీ నేతలు తమంతట తాముగా చేసుకుంటున్న ప్రచారమా.? లేదంటే, ఢిల్లీ నుంచే లీకులు వస్తున్నాయా.? అన్నది తేలాల్సి వుంది. ఈ మొత్తం వ్యవహారానికి ‘కమ్మ లాబీయింగ్‌’ కారణమని రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ‘అబ్బే, అదేం లేదు. టీడీపీతో కలిసి నడిచే ప్రసక్తే లేదు. గతంలో మాకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. జనసేనతో కలిసి వెళ్ళబోతున్నాం గనుక ఓట్ల శాతం ఖచ్చితంగా పెరుగుతుంది. సీట్లు కూడా వచ్చి తీరతాయ్‌. టీడీపీతో ఇంకోసారి కలిసి నాశనమవ్వాలని అనుకోవడంలేదు.

అసలు టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లో లిఫ్ట్‌ ఇవ్వాలనే ఆలోచనే మాకు లేదు..’ అని బీజేపీ నేతలు న్యూస్‌ ఛానల్స్‌ డిబేట్స్‌లో ఘంటాపథంగా చెబుతున్నా, తెరవెనుక వ్యవహారాలు చకచకా మారిపోతున్నాయట. టీడీపీ అధినేత చంద్రబాబుకి, బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలే వున్నాయి. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. చంద్రబాబు విషయంలో అంత సానుకూలంగా కన్పించడంలేదట. ఆ ఇద్దర్నీ ఒప్పించే బాధ్యతని పార్టీలో కొందరు సీనియర్లతోపాటు, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన కొందరు నేతలు కూడా తీసుకున్నారని సమాచారం. మరోపక్క, ఈ మొత్తం వ్యవహారంపై జనసేన ఆచి తూచి స్పందిస్తోంది. టీడీపీ విషయంలో తమ స్టాండ్‌ మారలేదనీ, బీజేపీ తమతోనే కలిసి నడుస్తుందనే ఆశాభావంతో వున్నామని జనసేన నేతలు చెబుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...