మేడ్చల్ జిల్లాలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. చిన్నారి తల్లి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం చిన్నారిని హత్య చేసిన వ్యక్తి తానూ కత్తితో గొంతు కోసుకున్నాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పోచారంలో నివసించే అనూషకు మూడు నెలల క్రితం ఫేస్ బుక్ లో కరుణాకర్ పరిచయమయ్యాడు. ఇతని స్వస్థలం సికింద్రాబాద్ లోని భవానీనగర్. అయితే.. అనూష రమేశ్ అనే మరో వ్యక్తితో కూడా సన్నిహితంగా ఉంటోంది. దీంతో కరుణాకర్ సహించలేకపోయాడు. ఈరోజు మధ్యాహ్నం అనూష ఇంటికి కరుణాకర్ వచ్చిన సమయంలో రమేశ్ అక్కడే ఉండటంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.
అనూష వెంటనే రమేశ్ ను బాత్ రూమ్ లో దాచింది. బయటకు రావాలంటూ రమేశ్ ను బెదిరించాడు కరుణాకర్. రమేశ్ ఎంతకీ రాకపోవటంతో అక్కడే ఉన్న చిన్నారి ఆద్యను గమనించాడు. ఆద్యను చంపేస్తానని బెదిరించాడు. అయినా రమేశ్ రాకపోవటంతో చిన్నారిని కిరాతకంగా కత్తితో గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటనకు రమేశ్ బయటకు రావడంతో అతనిపైనా దాడికి ప్రయత్నించడంతో రమేశ్ తప్పించుకుని పారిపోయాడు.
వెంటనే కరుణాకర్ కూడా అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. సమాచారం అందుకున్న ఘట్ కేసర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కరుణాకర్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై చిన్నారి తండ్రికి పోలీసులు సమాచారం అందించారు.
254456 684095You ought to join in a tournament first with the greatest blogs on the web. I will recommend this web site! 159026
711009 856598An intriguing discussion will be worth comment. I believe that you can write read far more about this subject, might nicely certainly be a taboo subject but generally folks are inadequate to chat on such topics. To a higher. Cheers 183701