Switch to English

బిగ్‌ స్టోరీ: హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటోంది సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌పై పోరులో తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేస్తోందా.? అంటే, అవుననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. న్యాయస్థానం పదే పదే హెచ్చరిస్తున్నా, తెలంగాణలో జరగాల్సిన స్థాయిలో కరోనా టెస్టులు జరగడంలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సగటున 20 వేల కంటే ఎక్కువ టెస్టులు రోజువారీగా జరుగుతున్నాయి. తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా వుంది.

ఈ విషయమై తాజాగా హైకోర్టు ఇంకోసారి తెలంగాణ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘టెస్టుల సంఖ్య పెరిగి, ల్యాబుల్లో శాంపిల్స్‌ పోగయిపోవడం’ అనే విషయాన్ని సాకుగా చూపి, కొద్ది రోజులు శాంపిల్స్‌ సేకరణను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసిన విషయం విదితమే. దాంతో పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యిందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న వేళ న్యాయస్థానం కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

ఇదిలా వుంటే, ‘హైద్రాబాద్‌లో ఇక బతకలేం..’ అంటూ కొందరు సొంతూళ్ళకు వెళ్ళిపోతున్నారు. ‘కరోనా వైరస్‌ కారణంగా హైద్రాబాద్‌లో పనులు దొరకడంలేదు.. ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాం.. ప్రస్తుతానికి ఊరికి వెళ్ళిపోతున్నాం.. మళ్ళీ పరిస్థితులు బాగుంటే తిరిగొస్తాం..’ అని సొంతూళ్ళకు పయనమవుతున్న జనం చెబుతున్నారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో సామాన్యుడి పరిస్థితి ఎంత దయనీయంగా వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్ళాలంటే ప్రత్యేక అనుమతులు అవసరమని అక్కడి ప్రభుత్వం చెబుతున్నా, అన్నిటికీ సిద్ధపడే.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోతున్నారు చాలామంది. తెలంగాణలో అనూహ్యంగా కేసులు పెరగడం, ఆ స్థాయిలో కరోనా టెస్టులు జరగకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు ఊళ్ళకు వెళ్ళిపోతున్నవాళ్ళంతా.

ఇవన్నీ ఓ ఎత్తు, ఛెస్ట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఇద్దరు యువకులు, చనిపోవడానికి కొద్ది సేపటి ముందు అక్కడ తమకు సరైన వైద్యం అందడంలేదని ఆరోపిస్తూ సెల్పీ వీడియో తీసుకోవడం.. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడం కూడా హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బ తీసినట్లుగా చెప్పుకోవచ్చేమో. పరిస్థితి ఇంత తీవ్రంగా వున్నా, పొరుగు రాష్ట్రాలతో పోటీ పడి తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు చేయకపోవడం, సమస్యల్ని చక్కదిద్దకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...