Switch to English

చైనాకు సెగ గట్టిగానే తగిలినట్టుంది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాలూకు సెగ చైనాకు గట్టిగానే తగిలింది. తాము ఎంతటి దుస్సాహసానికి తెగబడినా ఇండియా ఏమీ చేయలేదని, బాయ్ కాట్ చైనా కూడా సాధ్యం కాదని భావించిన డ్రాగన్ కు డిజిటల్ స్ట్రైక్ రూపంలో షాక్ ఇవ్వడంతో కక్కలేక మింగలేక కొట్టుమిట్టాడుతోంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న మర్నాడే చైనా రాయబారి స్పందించిన తీరు చూస్తుంటే.. ఈ విషయంలో ఆ దేశం ఎంతగా ఆందోళన చెందుతుందో తెలుస్తుంది.

మన భద్రత దృష్ట్యా యాప్స్ నిషేధిస్తే.. అది అంతర్జాతీయ, వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమేనని కొత్త రాగం అందుకుంది. అంతేకాకుండా మన ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమేనని తెగ బాధపడిపోతోంది. మరి గల్వాన్ లోయలో అన్ని ఒప్పందాలను పాతిపెట్టి మన సైనికులను దొంగ దెబ్బ తీసినప్పుడు పాత ఒప్పందాలు చైనాకు గుర్తుకురాలేదా అన్న ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం.

పైగా చైనాలో ఏం జరుగుతుందో బయటివాళ్లు ఎవరూ చూడకూడదు. ప్రపంచం మొత్తం వాడుతున్న ఫేస్ బుక్, ట్విటర్ లు చైనాలో ఉండవు. తమ దేశ పౌరుల విషయాలు ఎవరికీ తెలియకూడదు. కానీ తాను మాత్రం ఇతర దేశాల భూభాగాల్లోకి చొచ్చుకెళ్లిపోతుంది. ఆయా దేశాల పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తుంది. ఇదీ దాని ధోరణి. మీ యాప్స్ నిషేధిస్తే ఇంత బాధపడిపోతున్నారు? మరి దీని సంగతేంటి అని అడిగితే డ్రాగన్ దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు.

ఏ విషయంలోనైనా తప్పంతా ఇతరులతే అని ఎదురుదాడి చేయడం తప్ప పొరుగు దేశాలతో సజావుగా, సక్రమంగా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం కాసింత కూడా లేదు. నిజానికి చైనా యాప్స్ విషయంలోనే కాదు.. వాణిజ్యపరంగా ఆ దేశానికి భారత్ చాలా పెద్ద మార్కెట్. అలాంటిది మనతో సంబంధాలు ఎంత స్నేహపూర్వకంగా ఉండాలి? కానీ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది. కరోనా వైరస్ విషయంలో ప్రపంచం మొత్తం చైనాను దోషిగా చూస్తున్న తరుణంలో అంతకంటే పెద్ద సంఘటనతో అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చాలి. తనకు ఎప్పటికైనా పోటీగా ఉండే భారత్ ను ఆక్రమించుకుంటే ఇక తిరుగు ఉండదు అనే దుర్బుద్ధితో గల్వాన్ లోయలో దుస్సాహసానికి తెగబడింది.

గతంలో కూడా చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు అప్పటి పాలకులు సరైన విధంగా స్పందించలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని భావించి ఆ దిశగా పావులు కదిపింది. కానీ మన సైనికుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో బిత్తరపోయింది. అయినప్పటికీ వెనక్కి తగ్గితే ఈగో హర్ట్ అవుతుంది. అందుకే మరింతగా మోహరింపులు చేపట్టింది. దీంతో చైనా యాప్స్ నిషేధానికి భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆర్థికంగా ఆయా కంపెనీలపై గట్టిగానే పడుతుంది. దీంతో చైనాకు సెగ తగిలి ఒప్పందాలకు తూట్లు అంటూ కొత్త పల్లవి అందుకుంది.

వాస్తవానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పినట్టు యాప్స్ నిషేధం ఒక్కటే సరిపోదు. చీటికీమాటికీ మనకు ఇబ్బందిగా పరిణమించిన చైనాకు ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. ఈ క్రయంలో యాప్స్ నిషేధం మొదటి అడుగు మాత్రమే. ఇప్పటికే పలు రాష్ట్రాలు చైనా ప్రాజెక్టులను రద్దు చేసుకోగా.. బీఎస్ఎన్ఎల్ లో చైనాకు చెందిన 5జీ ఎక్విప్ మెంట్ వినియోగించకూడదని కేంద్రం నిర్ణయించింది. బాయ్ కాట్ చైనా ఉద్యమం కూడా క్రమంగా ఊపందుకుంటోంది. చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టడమే కాదు.. అంతర్జాతీయంగానూ ఏకాకి చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే ఇది సాకారం కావాలని ఆశిద్దాం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...