Switch to English

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్: నిజమా.? అచ్చెన్నకేమీ తెలీదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్ లో అరెస్టయిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. నిన్ననే ఆయన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్ కి సంబంధించి విచారించారు.. అచ్చెన్నపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆసుపత్రిలో వుంచి విచారణ చేయాలని న్యాయస్థానం ఆదేశించిన దరిమిలా, ఆ ఆదేశాలకు లోబడి విచారణ జరుగుతోంది. కాగా, విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో, తనకేమీ సంబంధం లేదని అచ్చెన్నాయుడు అంటున్నారట.

‘ఆ సమయంలో నేను ఆ శాఖకు సంబంధించి మంత్రిగా లేను..’ అని అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారట. ‘తెలంగాణ మోడల్‌ని పరిశీలించమని మాత్రమే చెప్పాను.. అంతకు మించి ఆ కేసుతో నాకు సంబంధం లేదు.. కొనుగోళ్ళకు సంబంధించిన పత్రాలు కూడా నా వద్దకు రాలేదు.. నేను వాటి మీద సంతకం పెట్టలేదు’ అని అచ్చెన్నాయుడు చెప్పారట.

అయితే, అచ్చెన్నాయుడు, ఓ సంస్థకు అప్పనంగా కాంట్రాక్ట్‌ కట్టబెట్టారనీ, దీనికి సంబంధించి మంత్రి హోదాలో అధికారులను ఆదేశిస్తూ తన లెటర్‌ హెడ్‌ మీదనే లేఖ రాశారనీ అభియోగాలు మోపబడ్డ విషయం విదితమే. అచ్చెన్నాయుడు ఆస్తుల విషయాలు, టీడీపీ అధినేత చంద్రబాబుతో అచ్చెన్నాయుడికి వున్న సన్నిహిత సంబంధాలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీశారంటూ మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఇదిలా వుంటే, అచ్చెన్నాయుడిని నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు సుమారు 4 గంటల పాటు విచారణ చేయడం పట్ల అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉదయం పూట విచారణ చేయాలి..’ అంటున్నారు న్యాయవాదులు. మరోపక్క, అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై భిన్న కథనాలు వస్తున్నాయి మీడియాలో. అరెస్టుకు ముందు ఆయన సర్జరీ చేయించుకోవడం, అరెస్టు తర్వాత ఆయన్ని సుదీర్ఘ సమయం పాటు వాహనంలో సుదూర ప్రాంతం రోడ్డుమార్గాన తరలించడంతో గాయం తిరగబెట్టడం, మళ్ళీ ఆ గాయానికి చికిత్స చేయాల్సి రావడం జరుగుతోంది. గాయం తిరగబెట్టడంతో అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.

కాగా, అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే చంద్రబాబుతోపాటు లోకేష్‌ కూడా జైలుకు వెళతారంటూ అధికార పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్న దరిమిలా.. అచ్చెన్న వ్యవహారం ముందు ముందు మరెన్ని కొత్త మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...