Switch to English

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో సినిమాలు తీయడం చట్టవిరుద్ధమైనపుడు ఎలా తీయగలిగారు.? సారీ చెప్పాలి అని కొందరు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘కొవిడ్ 19 విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ పరిమిత సిబ్బందితో సినిమా తీసాను.

కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన అన్ని రూల్స్ పాటించి సినిమాలు తీసినపుడు నేనెందుకు సారీ చెప్పాలి’ అని లాజిక్కుతో కొట్టాడు. ‘ఊరంతా ఒకవైపు ..నేనొక్కడినీ ఒక వైపు’ అనే ఆర్జీవీ సినిమా తీయడానికి వంద మంది అక్కర్లేదు అని బలంగా నమ్ముతాడు. భారీ పారితోషికాలు ఇచ్చి యూనియన్ నిబంధనల్ని పాటించాలన్న రూల్ తో పనేంటి అన్నట్లుగా తనకు నచ్చిన సిబ్బందితో సినిమాలు తీసేస్తూ ఉంటాడు. తన ఆఫీసులో బోయ్ అయినా సరే కొంచెం కామన్ సెన్స్ ఉందని అనిపిస్తే చాలు దర్శకుడిని చేసేస్తాడు వర్మ. అందుకే తోచింది చేయటానికి అనుకున్నది బహిరంగంగా చెప్పటానికి వర్మ అసలు వెనకాడడు.

ఇక శృంగార తార మియా మల్కొవాతో తీసిన రసభరిత చిత్రం ‘క్లైమాక్స్’ను ఓటీతీ వేదికగా జూన్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. దానితో వర్మ ఇకపై ఓటీటీ కోసం మాత్రమే సినిమాలు తీస్తాడంటూ మీడియాలో రకరకాల స్పెక్యులేషన్లు మొదలయ్యాయి.

వాటిపై స్పందించిన వర్మ ‘ఇకపై డిజిటల్ మార్కెట్ కోసమే సినిమాలు తీస్తానని తప్పుడు వార్తలు రాస్తున్నారు. నేను నా ఓటీటీ వేదిక శ్రేయాస్ఈటీ/ఆర్జీవీ వరల్డ్ తో పాటు, ఇతర అన్ని ఓటీటీలు మరియు థియేటర్ల కోసం కూడా సినిమాలు తీస్తాను. ఏ సినిమాను ఏ వేదికపై విడుదల చేయాలనే నిర్ణయం వెనక పలు కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ‘క్లైమాక్స్’ చిత్రాన్ని మా యాప్ ‘శ్రేయాస్ఈటీ/ఆర్జీవీ’లో విడుదల చేస్తున్నట్లే ‘కరోనా వైరస్’ చిత్రాన్ని మరో ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఇక నా చైనీస్ కో ప్రొడక్షన్ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ థియేటర్లలో విడుదల చేస్తాం’ అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

మరో ట్వీట్ లో ప్రస్తుతం దేశంపై దండెత్తుకు వచ్చిన మిడతల దండు వీడియోలను పోస్ట్ చేస్తూ “ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉంటే మిడతలు మాత్రం ప్రపంచ యాత్ర చేస్తున్నాయి. వైరస్ తరువాత ‘మిడతలు’ తర్వాత ఏంటి..ఏలియన్ దాడులా.?” అని వ్యాఖ్యానించాడు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...