టాలీవుడ్లో స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా, వదినగా, అక్కగా నటించి మెప్పించిన ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సినిమాల్లో పద్దతిగా హుందాగా కనిపించినా కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈ అమ్మడి మాస్ యాంగిల్ చూపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్, మీటూపై స్పందించింది. తనను ఒక కమెడియన్ ఇబ్బంది పెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఒక సినిమా షూటింగ్ సందర్బంగా అదే సినిమాలో నటిస్తున్న స్టార్ కమెడియన్ ఒకరు నాతో మిస్ బిహేవ్ చేశారు. ఆయన పదే పదే నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, నన్ను తాకేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో నాకు చాలా చిరాకుగా అనిపించింది. అతడిపై చాలా కోపం కూడా వచ్చింది. నా కోపంను నేను అణచుకోలేక పోయాను.
షూటింగ్ పూర్తి అయిన తర్వాత అతడితో మాట్లాడాను. మీ ప్రవర్తన అస్సలు బాగాలేదు. మీరు ఇలా ప్రవర్తిస్తే గౌరవంగా ఉండదంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. దాంతో ఆయన మళ్లీ నా జోలికి రాలేదు. అతడు నాపట్ల ప్రవర్తించిన తీరు నాకు ఇప్పటికి ఆశ్చర్యంగానే ఉంటుంది. అతడు ఎంతగా నన్ను ఇబ్బంది పెట్టినా కూడా ఒకానొక సమయంలో ఓర్చుకున్నా. కాని అతడి తీరు శృతిమించడంతో వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రగతి చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టార్ కమెడియన్ ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రగతి చెప్పలేదు. అలా అ్లరి మాటలు, చిలిపి పనులు చేసే స్టార్ కమెడియన్ ఎవరో మీ ఊహకే వదిలేస్తున్నాం.
806982 760375I need to admit that this really is one excellent insight. It surely gives a company the opportunity to get in on the ground floor and genuinely take part in creating something particular and tailored to their needs. 936131
329251 393626I just now discovered your weblog post and now Im remember to start with followers. 926949