Switch to English

జనసేనాని ప్రశ్న: ‘కరోనా’ సాధారణ జ్వరమా.? ఇదెక్కడి నిర్లక్ష్యం.!

‘కరోనా వైరస్‌ని సాధారణ జ్వరంతో పోల్చుతారా.? జ్వరం వస్తుంది, తగ్గిపోతుంది.. అంటూ కరోనా వైరస్‌ పట్ల చులకనగా మాట్లాడతారా.? ప్రభుత్వంలో వున్నవారు ఇలా మాట్లాడటం వల్లే.. రాష్ట్రంలో ఇప్పుడు ఇంతటి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.

‘కరోనా కష్ట కాలంలో ప్రభుత్వానికి మద్దతుగా వుండాలనుకున్నాం. రాజకీయ విమర్శలకు దూరంగా వున్నాం. కానీ, ప్రభుత్వం తరఫున రెచ్చగొట్టే చర్యలు ఎక్కువవుతున్నాయ్‌. ప్రజల తరఫున అండగా జనసైనికులు నిలబడాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి..’ అంటూ అనంతపురం జిల్లాకి చెందిన జనసైనికులు, జనసేన నేతలతో టెలికాన్ఫరెన్స్‌ సందర్భంగా జనసేన అధినేత పలు కీలక సూచనలు చేశారు.

‘కరోనా వైరస్‌కి సంబంధించి అతి క్లిష్టమైన పరిస్థితుల్లోకి అడుగు పెడుతున్నాం. గ్రీన్‌ జోన్లు ఆరెంజ్‌ జోన్లుగానూ, రెడ్‌ జోన్లుగానూ మారకుండా చూసుకోవాలి. కానీ, దురదృష్టం, ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడంలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వాస్తవ పరిస్థితుల్ని తెలియజేస్తోన్న అధికారుల్ని ప్రభుత్వం సరిగా పనిచేయనివ్వడంలేదు. వారిపై వేటు వేయడానికీ వెనుకాడ్డంలేదు. నిజాల్ని దాస్తే చాలా నష్టపోతాం..’ అని జనసేన అధినేత అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌ – లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ రంగ కార్మికుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన జనసేనాని, తెరవెనుక ఇసుకాసురులు రెచ్చిపోతున్నారనీ, అధికార పార్టీ నేతలపైనే ‘ఇసుక దోపిడీ’ ఆరోపణలు వస్తున్నాయని విమర్శించారు. పటిష్టమైన చర్యలు తీసుకుని వుండకపోతే, తమ పరిస్థితి కర్నూలు, గుంటూరులా అయిపోతుందని తెలంగాణ మంత్రి అనడం, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిని చెప్పకనే చెప్పిందని జనసేనాని వ్యాఖ్యానించారు.

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరా ఇసుకాసురులు.. ఏమా కథ.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ, ఇసుక కుంభకోణాలకీ విడదీయరాని బంధం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఇసుక కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైంది ఈ ఇసుక కుంభకోణాల కథ. చంద్రబాబు హయాంలో...

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఎక్కువ చదివినవి

కరోనా టెస్టింగ్‌ కిట్‌ మింగేసిన కోతులు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన వారిని కోతులు మరింతగా భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మీరట్‌లో కరోనా అనుమానితుల నుండి స్వీకరించిన శాంపిల్స్‌ను కొన్ని కోతులు మింగేయడంతో...

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరా ఇసుకాసురులు.. ఏమా కథ.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ, ఇసుక కుంభకోణాలకీ విడదీయరాని బంధం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఇసుక కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైంది ఈ ఇసుక కుంభకోణాల కథ. చంద్రబాబు హయాంలో...

శానిటైజ్ చేసేప్పుడు ఇంజిన్ ఆన్ లో ఉంటే ఇలానే పేలిపోద్ది.!

జాగ్రత్త సుమీ: వెహికల్ శానిటైజేషన్ అనేది తప్పనిసరి అయిన ఈ కరోనా టైంలో బైక్ ఇంజిన్ ఆన్ లో ఉండగా శానిటైజ్ చేయించవద్దు. అలా చేస్తే ఇలానే మంటలు చెలరేగి ప్రాణాలు పోగొట్టుకునే...

క్రైమ్ న్యూస్: 9 ఏళ్ళ బాలికపై 14 ఏళ్ళ బాలుడి అఘాయిత్యం.. ప్రతిఘటించడంతో ఏం చేశాడంటే

సినిమాల ప్రభావమో లేదా సోషల్‌ మీడియా ప్రభావమో కాని 15 యేళ్లు కూడా నిండకుండానే అబ్బాయిలు అత్యంత కఠినంగా నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల బాలుడు తాను చదువుకునే...

తెలంగాణలో భయపెడ్తున్న ‘కరోనా’ మరణాలు

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువే వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూసినప్పుడు తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తుండడంపై...