Switch to English

వైసీపీ రాజకీయం: ప్రకటనలు సరే.. పైసలెవరివి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎటు చూసినా ఆర్థిక సంక్షోభమే కన్పిస్తోంది. మీడియా కూడా గట్టిగానే సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మెయిన్‌ ఎడిషన్స్‌లో పేజీలు తగ్గిపోయాయి. లోకల్‌ ఎడిషన్స్‌ని మొత్తంగా ఎత్తేసి, మెయిన్‌ ఎడిషన్‌లో కలిపేశారు. ప్రకటనలు వచ్చే పరిస్థితే కన్పించడంలేదు. ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుంది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ, అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ‘పత్రిక’కు మాత్రం ప్రకటనలు వచ్చేస్తున్నాయి. ఆ ప్రకటనలు కూడా వైసీపీ ముఖ్య నేతలనుంచీ.. అందునా మంత్రుల నుంచి ప్రకటనలు వచ్చి పడుతున్నాయి. ఇవి అధికారిక ప్రకటనలా.? అనధికారిక ప్రకటనలా.? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ములు వెచ్చించి ఈ ప్రకటనలు ఇప్పించుకుంటున్నారా.? అన్న చర్చ సాధారణ ప్రజానీకంలో జరుగుతుండడాన్ని ఎలా తప్పు పట్టగలం.? అయితే, ఎక్కడా ‘అధికారిక ప్రకటన’ అన్న ప్రస్తావన కన్పించడంలేదు. నిజానికి, తెరవెనుక బాగోతాలు చాలానే నడుస్తుంటాయి ఇలాంటి ప్రకటనలకు సంబంధించి. ఇక్కడా అదే జరుగుతోందా.? అంటే, ‘కాదు’ అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ‘ముఖ్యమంత్రికి అండగా వుందాం’ అనేది ఆ ప్రకటనల సారాంశం.

చిత్రమేంటంటే, కంటెంట్‌ ఒకటే.. ఆ ప్రకటనలు ఇచ్చిన వ్యక్తులే మారుతున్నారు. ఆ ప్రకటనల్లో మెజార్టీ వ్యక్తులు మంత్రులే. అన్నట్టు, ఓ ప్రముఖ జ్యుయెలరీ సంస్థ కూడా ఈ తరహా ప్రకటనే ఇచ్చింది. సదరు జ్యుయెలరీ సంస్థ మీద అధికార పార్టీ నేతల ఒత్తిడి నేపథ్యంలోనే ఈ ప్రకటన వచ్చిందనే గుసగుసలు ఓ పక్క విన్పిస్తుండగా.. అదేమీ లేదు, సదరు సంస్థ స్వచ్చందంగానే ప్రకటన ఇచ్చిందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది.

మరోపక్క, అధికార పార్టీకి చెందిన మీడియా ఛానల్‌లో వస్తున్న ప్రకటనల విషయంలోనూ జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో ప్రధాన మీడియాని పరిగణనలోకి తీసుకుంటే, ఒక్క వైసీపీ అనుకూల మీడియా తప్ప, ఇంక దేనికీ ప్రకటనలు పెద్దగా రావడంలేదంటే.. తెరవెనుక ఏదో ‘మతలబు’ జరుగుతోందనే కదా అర్థం.? అన్నది మెజార్టీ అభిప్రాయం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...