Switch to English

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా స్పష్టత ఇస్తారా.? ప్రస్తుత లాక్‌ డౌన్‌కి సంబంధించి వెసులుబాట్లు కల్పిస్తారా.? లాక్‌ డౌన్‌ కారణంగా నష్టపోయిన ఆయా రంగాలకు చేయూతనిచ్చే కార్యక్రమం ఏదైనా ప్రకటిస్తారా.? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు దేశ ప్రజానీకం మదిలో మెదిలాయి. కానీ, వాటికి నరేంద్ర మోడీ వీడియో ప్రసంగంలో సమాధానాలు దొరకలేదు.

ఈ నెల 5వ తేదీన.. అంటే ఆదివారం రాత్రి 9 గంటలకు దేశంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళల్లో విద్యుత్‌ దీపాల్ని ఆపేయాలని మాత్రమే విజ్ఞప్తి చేశారు నరేంద్ర మోడీ. తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్‌ దీపాలు ఆపేసి, ఆ 9 నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలనీ, అవి లేకపోతే టార్చి లైట్లు.. మొబైల్‌ ఫోన్లలోని ఫ్లాష్‌ లైట్లు వెలిగించాలనీ, కరోనాని తరిమేయడంలో దేశంలో ఒకరికొకరు సాయంగా వున్నామనే సంకేతాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వాలనీ, ఈ సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలనీ నరేంద్ర మోడీ సూచించారు.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. దేశమంతా ఎప్పుడూ ఒకే తాటిపై వుంటూ వస్తోంది. అదే మన బలం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం.. ఇది మనకు గుర్వకారణం. దేశానికి సంబంధించిన ఏ ముఖ్య విషయంలో అయినా దేశమంతా ఒకే తాటిపైకి వస్తోంది. పదే పదే పరీక్షలు మనకి మనమే పెట్టుకోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో వుంది. కానీ, కేంద్రం ఏం చేస్తోంది.? పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందా.! అంటే, ఔనని చెప్పక తప్పదేమో. లోన్లపై మారటోరియాన్ని ఘనకార్యంగా చెప్పుకుంది కేంద్రం. ఆ మారటోరియంని వినియోగించుకుంటే జనం జేబులకు చిల్లులు పడతాయి. మరి, అలాంటప్పుడు మారటోరియంతో ఉపయోగమేంటి.? ఈ ప్రశ్నకు కేంద్రం వద్ద సమాధానం లేదు.

లాక్‌ డౌన్‌ ఎత్తివేత కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తారో లేదో ఇంకా స్పష్టత రావడంలేదు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితి ఎక్కడిదాకా వెళుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. జాతిని ఉద్దేశించి ప్రసంగించే క్రమంలో, సగటు భారతీయుడికి కనసీ ఊరట ఇచ్చే విషయం కూడా చెప్పని నరేంద్ర మోడీ, దేశ ప్రజల్ని పూర్తిగా నిరాశకు గురిచేశారన్నది నిర్వివాదాంశం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...