Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘లాక్‌ డౌన్‌’ ముగింపు దిశగా మోడీ సంకేతాలు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఏప్రిల్‌ 14వ తేదీతో దేశంలో లాక్‌ డౌన్‌ ముగుస్తుందా.? ఒక్కసారిగా లాక్‌ డౌన్‌ ముగిస్తే, రోడ్ల మీదకు వచ్చే జనాన్ని అదుపు చేయడం ఎలా.? 21 రోజులపాటు ఇళ్ళలోనే బందీలుగా వుండిపోయిన జనానికి.. ఏప్రిల్‌ 15న స్వేచ్ఛ లభిస్తే.. దాన్ని జనం ఎలా వినియోగించుకుంటారు.? ఈలోగా దేశం నుంచి కరోనా మహమ్మారిని పారద్రోలగలమా.? ఇలా సవాలక్ష సందేహాలు తెరపైకొస్తున్నాయి.

తాజాగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా, ‘లాక్‌ డౌన్‌’ ఎత్తివేతపై సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. లాక్‌ డౌన్‌ ఎత్తివేశాక పరిస్థితులపై ముందే ఓ అవగాహనకు వచ్చి, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలనీ, ఈలోగా కేంద్రానికి సూచనలు చేయాలనీ ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారట.

నిజానికి, ఏప్రిల్‌ 7వ తేదీతో తెలంగాణలో కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి వస్తుందనీ, ఆ తర్వాత కొత్తగా కేసులు వుండకపోవచ్చనీ ఈ మధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా ముందుకొచ్చి, రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన విషయం విదితమే. ‘మన తెలంగాణలో పరిస్థితి అదుపులోకి వచ్చినా.. కేంద్రం విధించిన లాక్‌ డౌన్‌కి భిన్నంగా మనం వెళ్ళలేం..’ అని అప్పుడే ఆయన ఓ క్లారిటీ ఇచ్చేశారు.

అయితే, గత నాలుగైదు రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పరుగులు పెట్టేస్తోంది. దాంతో, ఏప్రిల్‌ 7 నాటికి కాదు కదా.. ఏప్రిల్‌ 14 నాటికి అయినా పరిస్థితి అదుపులోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అయినాగానీ, ఎక్కువ కాలం లాక్‌ డౌన్‌ని కొనసాగిస్తే.. ప్రజల్లో అశాంతి, అసహనం పెరిగిపోతాయి. తొమ్మిది పదిరోజుల లాక్‌ డౌన్‌కే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

ఈ నేపథ్యంలో లాక్‌ డౌన్‌ని ఎత్తివేయడం తప్ప, కేంద్రం వద్ద ఇంకో ఆప్షన్‌ లేనట్లే కన్పిస్తోంది. ఈలోగా కరోనా పూర్తిగా అదుపులోకి రావాలనే ఆశిద్దాం. అదే సమయంలో, లాక్‌ డౌన్‌ తర్వాత కూడా కొన్ని ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలైతే లేకపోలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...