ఏప్రిల్ 14వ తేదీతో దేశంలో లాక్ డౌన్ ముగుస్తుందా.? ఒక్కసారిగా లాక్ డౌన్ ముగిస్తే, రోడ్ల మీదకు వచ్చే జనాన్ని అదుపు చేయడం ఎలా.? 21 రోజులపాటు ఇళ్ళలోనే బందీలుగా వుండిపోయిన జనానికి.. ఏప్రిల్ 15న స్వేచ్ఛ లభిస్తే.. దాన్ని జనం ఎలా వినియోగించుకుంటారు.? ఈలోగా దేశం నుంచి కరోనా మహమ్మారిని పారద్రోలగలమా.? ఇలా సవాలక్ష సందేహాలు తెరపైకొస్తున్నాయి.
తాజాగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ ద్వారా, ‘లాక్ డౌన్’ ఎత్తివేతపై సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ ఎత్తివేశాక పరిస్థితులపై ముందే ఓ అవగాహనకు వచ్చి, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలనీ, ఈలోగా కేంద్రానికి సూచనలు చేయాలనీ ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారట.
నిజానికి, ఏప్రిల్ 7వ తేదీతో తెలంగాణలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తుందనీ, ఆ తర్వాత కొత్తగా కేసులు వుండకపోవచ్చనీ ఈ మధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకొచ్చి, రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన విషయం విదితమే. ‘మన తెలంగాణలో పరిస్థితి అదుపులోకి వచ్చినా.. కేంద్రం విధించిన లాక్ డౌన్‌కి భిన్నంగా మనం వెళ్ళలేం..’ అని అప్పుడే ఆయన ఓ క్లారిటీ ఇచ్చేశారు.
అయితే, గత నాలుగైదు రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పరుగులు పెట్టేస్తోంది. దాంతో, ఏప్రిల్ 7 నాటికి కాదు కదా.. ఏప్రిల్ 14 నాటికి అయినా పరిస్థితి అదుపులోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అయినాగానీ, ఎక్కువ కాలం లాక్ డౌన్‌ని కొనసాగిస్తే.. ప్రజల్లో అశాంతి, అసహనం పెరిగిపోతాయి. తొమ్మిది పదిరోజుల లాక్ డౌన్‌కే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
ఈ నేపథ్యంలో లాక్ డౌన్‌ని ఎత్తివేయడం తప్ప, కేంద్రం వద్ద ఇంకో ఆప్షన్ లేనట్లే కన్పిస్తోంది. ఈలోగా కరోనా పూర్తిగా అదుపులోకి రావాలనే ఆశిద్దాం. అదే సమయంలో, లాక్ డౌన్ తర్వాత కూడా కొన్ని ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలైతే లేకపోలేదు.
262649 162462I added this article to my favorites and plan to return to digest far more soon. Its easy to read and realize as well as intelligent. I truly enjoyed my very first read by means of of this write-up. 405211
578421 955476Some genuinely fantastic info , Gladiola I detected this. 314736
775596 607338As soon as I discovered this internet internet site I went on reddit to share some with the adore with them. 832280
324479 708846I like this website so much, saved to favorites . 100884
910543 198213Spot on with this write-up, I ought to say i believe this exceptional website needs much far more consideration. Ill probably be once once again to learn a terrific deal a lot more, several thanks that data. 306303