Switch to English

రక్షిత్ ‘పలాస 1978’ మూవీ రివ్యూ 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5

నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, లక్ష్మణ్, శృతి, జగదీష్
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
దర్శకత్వం: కరుణ కుమార్
సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్
మ్యూజిక్: రఘు కుంచె
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
రన్ టైం: 2 గంటల 24 నిముషాలు
విడుదల తేదీ: మార్చి 06, 2020

యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు ఈ మధ్య ఊపందుకున్నాయి. అందులో భాగంగానే 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురి ప్రముఖుల ప్రశంశలు అందుకున్న ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. మరి హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

‘పలాస 1978’ సినిమా కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఉన్నత కులాల వారికి, బడుగు బలహీన వర్గాలకి మధ్య ఉన్న విభేదాలను చెప్పే కథ.. కథలోకి వెళితే 1978.. పలాస ఊరిలో ఉన్నత కులాలకు చెందిన వారు ఉంటారు.. ఆ ఊరి చివరన అంబుసోలిలో బడుగు కులాల వారు ఉంటారు. పలాసలో షావుకారు, అతని తమ్ముడు చిన్న షావుకారు(రఘు కుంచె) మధ్య పదవీ పోరు నడుస్తూ ఉంటుంది. చిన్న షావుకారు పదవి కోసం అన్ననే చంపాలనుకుంటాడు. కానీ షావుకారి భైరాగి అనే బలం ఉండడం వలన ప్రతి ప్రయత్నంలో ఓడిపోతుంటాడు. అదే టైంలో షావుకారుపై బడుగు జాతికి చెందిన జానపద పాటగాళ్ళైన మోహన రావు(మోహన్ రావు) – రంగ రావు(తిరువీర్) అనే అన్నదమ్ములు ఎదురు తిరిగి భైరాగిని చంపేస్తారు. దాంతో చిన్న షావుకారు వాళ్ళ సపోర్ట్ తో అన్నపై మొదటి విజయం సాధిస్తాడు. ఇక అక్కడి నుంచీ చిన్న షావుకారు ఆ అన్నదమ్ములను రౌడీలుగా ఎలా మార్చాడు? మార్చి ఎలా వాడుకున్నాడు? రౌడీలుగా మారిన ఆ అన్నదమ్ముల జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఉన్నత కులం – బడుగు కులాల మధ్య సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరికింది? అనేదే కథ.

తెర మీద స్టార్స్.. 

పలాస 1978′ సినిమాలో కొందరు నూతన నటీనటులు కూడా నటించారు క్వాను సినిమాలోని అందరి నటీనటుల పెర్ఫార్మన్స్ సూపర్బ్. ఇక హీరోగా చేసిన రక్షిత్ కి డి రెండవ సినిమా ఇది.. చాలా వెయిట్ ఉన్న పాత్రలో మంచి నటనని కనబరిచాడు. ఎమోషన్స్ బాగా పలికించాడు. తన అన్నగా చేసిన తిరువీర్ అయితే ఫెంటాస్టిక్ అనిపించాడు. హీరోయిన్ నక్షత్రకి ఉన్నది కాసేపే అయినప్పటికీ ఉన్నంతలో ఓకే అనిపించింది. తెరపై మొదటిసారి నెగటివ్ షేడ్స్ లో కనిపించిన రఘు కుంచే స్క్రీన్ ప్రెజన్స్, పాత్రలో వేరియేషన్స్ బాగా పలికించాడు. సెబాస్టియన్ పాత్ర చేసిన పోలీస్ ఆఫీసర్ కూడా బాగా చేసాడు. లక్ష్మణ్ అక్కడక్కడా నవ్వులతో పాటు అక్కడక్కడా ఎమోషనల్ అయ్యేలా చేసాడు. మిగిలిన పాత్రలు చేసిన అందరూ వారి వారి పాత్రల్లో రాణించారు.

తెర వెనుక టాలెంట్.. 

ప్రతి సినిమాని థియేటర్ వరకూ తీసుకొచ్చేది కథ.. కావున అక్కడి నుంచే మొదలు పెడితే.. కొత్త కథేం కాదు, పాత కథే అలా అని కొత్తగా ఏం చెప్పలేదు.. చాలా మంది చాలాసార్లు చెప్పినట్టే చాలా రొటీన్ గా చెప్పారు. ఉన్నత – తక్కువ కులం అనే కాన్సెప్ట్ ఎప్పుడూ చూస్తూ వచ్చిందే.. కానీ ఇప్పటి వరకూ, తెలంగాణ, రాయలసీమ రీసెంట్ గా ‘రంగస్థలం’తో గోదావరి స్లాంగ్ లో కూడా చెప్పేసారు. అందుకే వేళ్ళు కొత్తదనం కోసమని పలాసని ఎంచుకున్నారు. కథ కోసం రాసుకున్న హీరో పాత్రలో పెద్దగా క్లారిటీ ఉండదు.. కథ మొదలైనప్పుడు పాత్రలో ఉన్న క్లారిటీ రాను రాను ఎటెటో వెళ్ళిపోతుంది. అలాగే చివరికి కథ ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ క్లారిటీగా ఉండదు, చెప్పింది కూడా క్లియర్ గా చెప్పలేదు. కథ రొటీన్ అయినప్పుడు కథనం అన్నా ఆసక్తికరంగా ఉండాలి, కానీ డైరెక్టర్ కరుణ కుమార్  చిన్న పిల్లాడు కూడా ముందే ఊహించేలా కూసింత కూడా సస్పెన్స్ ఉండేలా రాసుకోలేదు. ఈ రెండు బిగ్గెస్ట్ మైనస్ అయితే కరుణ కుమార్ రాసుకున్న సూపర్బ్ డైలాగ్స్ చాలా చోట్ల సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. కొన్ని నవ్విస్తే, కొన్ని షాకిస్తే(బీప్ లేని భూతు డైలాగ్స్), కొన్ని ఆలోచింపజేస్తాయి. ఇక దర్శకుడిగా చుస్తే ఆడియన్స్ ని రేకెత్తించేలా హీరోయిక్ ఎలివేషన్ సీన్స్ ని చాలా బాగా తీశారు. పెర్ఫార్మన్స్, కొన్ని ఎమోషన్స్ ని కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ గా ఫస్ట్ క్లాస్ గా సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా కరుణ కుమార్ నూతన దర్శకుడిగా 50 మార్క్స్ తెచ్చుకున్నాడు కానీ మంచి కథ కథనం రాసుకోగలిగితే డిస్టింక్షన్ తెచ్చుకోగలడు.

రఘు కుంచే నటుడిగానే తెరపైనే కాకుండా తెరవెనుక మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ప్రాణం పోసాడు. జానపద పాటలన్నీ బాగున్నాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా బిగ్ ప్లస్ అయ్యింది. అరుల్ విన్సెంట్ విజువల్స్ లో రియలిస్టిక్ ఫీల్ తీసుకురావడంలో బెస్ట్ అనిపించుకున్నాడు. కానీ చాలా షాట్స్ లో ఫోకస్ అస్సలు లేదు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సీనియర్ ఎడిటర్ అయినా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ లో పెద్దగా కేర్ తీసుకోలేదని స్పష్టంగా ఆతెలుస్తుంది. చాలా చోట్ల లాగ్ ఉంటుంది, స్లో ఉంటుంది అలాగే ఎడిట్ లో కూడా షార్ప్ అండ్ స్పెషల్ గా ఏం అనిపించదు. ఎడిటింగ్ సేకడ్నాఫ్ లో చాలా మైనస్ అయ్యింది. ఇకపోతే రామ్ సుంకర కంపోజ్ చేసిన రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కథకి తగ్గట్టుగా అన్నీ సమకూర్చడంలో, అవుట్ ఫుట్ విషయంలో నిర్మాణ విలువలు మెచ్చుకునేలా ఉన్నాయి.

విజిల్ మోమెంట్స్:

– వండర్ఫుల్ డైలాగ్స్
– పలాస బ్యాక్ డ్రాప్ అండ్ రియలిస్టిక్ విజువల్స్
– నటీనటుల సూపర్బ్ పెర్ఫార్మన్స్
– హీరోయిజం ఎలివేషన్ సీన్స్
– పోస్ట్ ఇంటర్వల్ బ్లాక్
– నేపధ్య సంగీతం

బోరింగ్ మోమెంట్స్:   

– వెరీ రొటీన్ 1978 కథ
– ఊహాజనిత కథనం
– స్లోగా సాగదీసిన సెకండాఫ్
– ఎడిటింగ్
– వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:  

రిలీజ్ కి ముందే ఇండస్ట్రీలో చాలా మంది ప్రశంశలు అందుకొని టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిన ‘పలాస 1978’ సినిమా స్టార్స్ అందరూ చెప్పినట్లు అద్భుతంగా అయితే లేదు, కానీ బాగుందని చెప్పచ్చు. చాలా మంది యంగ్ టీం తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. యదార్థ సంఘటనల స్పూర్తితో రూపొందిన కథ అని చెప్పుకున్న ఈ బొమ్మ ఫస్ట్ హాఫ్ లో మిమ్మల్ని మెప్పిస్తుంది. కానీ సెకండాఫ్ లో ఆ ఫీల్ ని తగ్గించుకుంటూ వచ్చేస్తుంది. ముఖ్యంగా సరైన జస్టిఫికేషన్ లేని క్లైమాక్స్ చాలా వీక్ గా ఉండడం బాగా నిరుత్సాహపరుస్తుంది. ఓవరాల్ గా అక్కడక్కడా మంచి ఫీల్ ఇస్తూ, అక్కడక్కడా బోర్ కొట్టిస్తూ, సాగదీసునిట్టు ఉండే ఈ ‘పలాస 1978’ సినిమా మాస్ అండ్ రియలిస్టిక్ సినిమాలు కోరుకునే వారికి నచ్చుతుంది.

ఇంటర్వల్ మోమెంట్: చాలా బాగా డీల్ చేశారు.. సెకండాఫ్ కూడా ఇదే రేంజ్ లో ఉంటదా.??

ఎండ్ మోమెంట్: సెకండాఫ్ ని రాను రాను చెడగొట్టేసారుగా..!

చూడాలా? వద్దా?: రియలిస్టిక్ అండ్ ఒక మాస్ సినిమా కావాలనుకునే వారు తప్పక చూడచ్చు.. ఫస్ట్ హాఫ్ లో విజిల్ కొట్టే మోమెంట్స్ కూడా బానే ఉంటాయి.

బాక్స్ ఆఫీస్ రేంజ్:

ఇప్పటికే సెలబ్రిటీస్ చాలా మంది సినిమా అద్భుతం అని ప్రమోట్ చేయడం, భారీ పబ్లిసిటీ, బెటర్ రిలీజ్ మరియు యూత్ కి కనెక్ట్ అయ్యే కొన్ని సెన్సార్ కాని డైలాగ్స్ లాంటి అట్రాక్టివ్ పాయింట్స్ ఉండడం వలన వెరీ డీసెంట్ కలెక్షన్స్ ఊహించవచ్చు. దీనితో పాటు రేపు రిలీజ్ కానున్న మరో 3 సినిమాల రిజల్ట్ కూడా ఎఫెక్ట్ చూపుతుంది.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...