జబర్దస్త్‌ను బీట్ చేయడమే లక్ష్యంగా ప్రారంభం అయిన అదిరింది కామెడీ షో నిలదొక్కుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. జబర్దస్త్‌ను బీట్ చేయడం ఏమో కాని కనీసం ప్రొడక్షన్ కాస్ట్ వచ్చే పరిస్థితి కూడా లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. నాగబాబు ఈ కామెడీ షోను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే పది ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. కాని ఇప్పటి వరకు కూడా ఆశించిన స్థాయిలో రీచ్ మాత్రం రాలేదు అనేది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన సత్యం.
అదిరింది కామెడీ షో అదరకపోవడంకు కారణం ఏంటీ అంటే పలువురు పలు కారణాలు చెబుతున్నారు. కాని ఎక్కువ మంది చెప్పే కారణం మాత్రం యాంకర్. యాంకర్‌గా సమీరా సెట్ అవ్వలేదు అంటున్నారు. రష్మి, అనసూయల రేంజ్లో సమీరా సెట్ కాలేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాంతో 11వ ఎపిసోడ్‌కు రవి మరియు భానులను రంగంలోకి దించారు. వీరిద్దరు కూడా పటాస్ నుండి డౌన్లోడ్ అయిన వారే. వీరిద్దరిని చూసి చూసి ఉన్న ప్రేక్షకులకు బోర్ కొట్టింది.
యాంకర్ విషయంలో మళ్లీ మొదట చేసిన తప్పునే అదిరింది టీం చేసినట్లుగా అనిపిస్తుంది. ఒక మంచి హాట్ లేడీ యాంకర్‌ను రంగంలోకి దించితే షోకు కామెడీతో పాటు గ్లామర్ అద్దినట్లవుతుందని అంతా భావిస్తున్నారు. కాని రవి మరియు భానులను యాంకర్లుగా పెట్టడం వల్ల ప్లస్ కంటే మైనస్ ఎక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా మళ్లీ యాంకర్స్‌ను మార్చి ఈసారి అయినా కాస్త హాట్ గ్లామర్ యాంకర్‌ను పెట్టాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.