Switch to English

పవన్ సంచలన నిర్ణయం – వైకాపా గుండెల్లో మొదలైన భయం… 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో తన ముద్రను వేసుకుంటున్నారు.  గత ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయినా, వచ్చే ఎన్నికల నాటికి బలపడేందుకు సిద్ధం అవుతున్నారు.  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు గెలుచుకోవడానికి పవన్ పావులు కదుపుతున్నారు.  పవన్ ఎక్కువగా ప్రజల మధ్య ఉండేదుకు ఆసక్తి చూపుతున్నారు.
మూడు రాజధానుల విషయంలో ఒకవైపు పోరాటం పోరాటం చేస్తున్నారు.  రాజధానుల వ్యవహారం ఆ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.  గత ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేసింది.  కానీ గెజిట్ నోటిఫికేషన్ చేయించుకోవడంలో విఫలం అయింది.  దానిని ఆసరాగా చేసుకొని జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.
మూడు వద్దు ఒక్కటే ముద్దు అని పవన్ పోరాటం చేస్తున్నారు.  ఇదిలా ఉంటె, ఇప్పుడు మరో సమస్యను పవన్ తన భుజాలమీదకు ఎత్తుకున్నారు.  2017, ఆగష్టు 19 న సుగాలి ప్రీతి అనే 14 ఏళ్ల చిన్నారి కర్నూలులోని ఓ స్కూల్ లో రేప్ కు గురయ్యి హత్య చేయబడింది.  చిన్నారిపై రేప్ జరిగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా, నిందితులను పట్టుకున్నా 23 రోజుల్లోనే వారు బెయిల్ పై బయటకు వచ్చారు.  ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు.
ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు పవన్ ముందుకు వచ్చారు.  చిన్నారికి న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 12 న కర్నూలు భారీ ర్యాలీ చేయబోతున్నారు.  కర్నూలు పవన్ ర్యాలీ విజయవంతమైతే అది జగన్ సర్కార్ కు కొంత ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది.  ఎందుకంటే, మూడు రాజధానుల్లో కర్నూలు కూడా ఒకటిగా ఉన్నది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వలన ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.  న్యాయ రాజధానిలో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని, న్యాయం జరగాలి అని కోరుతూ పవన్ ఈర్యాలీ చేయబోతున్నారు.  ఇది సున్నితమైన అంశం కాబట్టి తప్పకుండా మద్దతు లభిస్తుంది. ఇది ప్రభుత్వాన్ని, వైకాపా పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...