Switch to English

హోమ్ సినిమా సమంత - శర్వానంద్ ల 'జాను' మూవీ రివ్యూ 

సమంత – శర్వానంద్ ల ‘జాను’ మూవీ రివ్యూ 

నటీనటులు: సమంత, శర్వానంద్
నిర్మాత: దిల్ రాజు – శిరీష్
దర్శకత్వం: ప్రేమ్ కుమార్
సినిమాటోగ్రఫీ: మహేందిరన్ జయరాజ్
మ్యూజిక్: గోవింద్ వసంత
ఎడిటర్‌: ప్రవీణ్ కెఎల్
రన్ టైం: 2 గంటల 30 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 7, 2020

గత ఏడాది విజయ్ సేతుపతి – త్రిష హీరో హీరోయిన్లుగా తమిళనాట బ్లాక్ బస్టర్ నిలిచిన సినిమా ’96’. చూసిన వెంటనే తెగ నచ్చేయడంతో సాహసం అని తెలిసినా స్టార్ ప్రొడ్యూసర్ దీనిని తెలుగులో రీమేక్ చేయడానికి శ్రీకారం చుట్టి, సమంత – శర్వానంద్ లాంటి స్టార్స్ ని ఒప్పించి తెలుగులో రీమేక్ చేసి, నేడు(ఫిబ్రవరి 7న) ‘జాను’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సమంత – శర్వానంద్ ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా తమిళంలో లానే తెలుగులో కూడా మేజిక్ క్రియేట్ చేస్తుందో లేదో? తెలియాలంటే మా తెలుగుబుల్లెటిన్.కామ్ రివ్యూ చదివి తెలుసుకోండి..

కథ:

స్కూల్ డేస్ లో ప్రతి ఒక్కరికీ ఓ ప్రేమ కథ ఉంటుంది.. కొంతమంది ధైర్యం చేసి చెప్పి ఉంటారు, కొంతమంది చెప్పి ఉండరు.. అలా స్కూల్ డేస్ లో ఇష్టపడి ఒకరికి ఒకరు చెప్పుకోకుండా విడిపోయిన రామ్(శర్వానంద్) – జాను(సమంత)లు దాదాపు 17 ఏళ్ళ తర్వాత స్కూల్ గెట్ టుగెదర్ లో కలుసుకున్నప్పుడు ఆ కొద్దీ గంటలు వారి మధ్య ఎదురయ్యే సన్నివేశాలు, సంఘటనల సమూహారమే ఈ ‘జాను’. అసలు కూల్ డేస్ లో రామ్ – జనులు ఎందుకు తమ ప్రేమకి చెప్పుకోలేకపోయారు? ఎలా విడిపోయారు? 17 ఏళ్ళ తర్వాత కలిసినప్పుడు రామ్ – జానుల పొజిషన్ ఏమిటి? వారిద్దరూ కలిసున్న కొద్ది గంటలు వారి మధ్య జరిగిన మోమెంట్స్ ఏంటి అనేది తెలియాలంటే మీరు ‘జాను’ చూడాల్సిందే..

తెర మీద స్టార్స్..   

టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమాకి కీలకం జాను పాత్రే అని.. చైల్డ్ హుడ్ జానుగా గౌరీ గీత కిషన్ చేస్తే, యంగ్ జానుగా సమంత చేసింది. స్కూల్ ఎపిసోడ్స్ లో ఒరిజినల్ వెర్షన్ లానే తెలుగులో కూడా గౌరీ సూపర్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కథని ఆడియన్స్ కి కనెక్ట్ చేసింది. చైల్డ్ ఎపిసోడ్ ని పక్కన పెడితే మిగతా అంతా సమంత సోలోగా క్రెడిట్ కొట్టేసింది. సమంత చుట్టూ తిరిగే కథ కావడంతో ప్రతి సీన్ లో అద్భుతమైన నటనతో ఆడియన్స్ తన నుంచి చూపు పక్కకి తిప్పుకోకుండా చేసింది. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ ఎమోషనల్ ఎపిసోడ్, చూస్తున్న అందరి కళ్ళు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి. ఆ కన్నీటికి సగం కారణం సమంత అయితే, సగం కారణం మీ గుండె లోతుల్లో దాగిఉన్న తొలిప్రేమ అనుభూతుల్ని గుర్తొచ్చేలా చేయడమే. ఓవరాల్ జాను పాత్ర, జానుగా సమంత మనల్ని కట్టి పడేస్తారు.

శర్వానంద్ కూడా రామ్ పాత్రని చాలా బాగా చేసాడు. సెటిల్ పెర్ఫార్మన్స్ తో, డైలాగ్స్ తక్కువైనప్పటికీ హావా భావాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గెట్ టుగెదర్ ఎపిసోడ్ లో సమంత శర్వాని కలిసే సీన్స్ లో సూపర్బ్ అనిపించే పెర్ఫార్మన్స్ చేసాడు. చైల్డ్ రామ్ గా చేసి సాయి కిరణ్ కూడా ఫెంటాస్టిక్ అనేలా చేసాడు. ముఖ్యంగా చైల్డ్ హుడ్ ఎపిసోడ్ చేసిన నటులు గౌరీ – సాయి కిరణ్ లు లీడ్ పెయిర్ అయిన సమంత – శర్వానంద్ లు దగ్గరగా ఉండడం వలన తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. 90% సినిమా ఈ నలుగురి మీదే ఉంటుంది. మిగతా నటీనటుల్లో వెన్నెల కిషోర్, శరణ్య ప్రదీప్, రఘుబాబులు కూసింత నవ్వులు పంచారు. అలాగే వర్ష బొల్లమ్మ ఉన్న సీన్స్ రెండు మూడైనా నటనతో మెప్పించింది.  ఆన్ స్క్రీన్ పరంగా కనపడిన ప్రతి ఒక్కరూ నటన పరంగా ది బెస్ట్ ఇచ్చారు.

తెర వెనుక టాలెంట్..

దర్శకుడు ప్రేమ్ కుమార్ ‘జాను’ కోసం చాలా సెన్సిబుల్ పాయింట్ ని ఓ అందమైన కావ్యంలా రాసాడు. ఆ కావ్యాన్ని దృశ్య కావ్యంలా మార్చింది మాత్రం సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజ్ అనే చెప్పాలి. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ లో ఓ ఫీల్ కనపడేలా, అదేదేమో మనకు చెబుతుంది అనే ఫీల్ ని క్రియేట్ చేశాయి. ఇక ఈయన విజువల్స్ కి మనసుకు హత్తుకొని, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఫీలింగ్ కలుగ జేసింది మాత్రం గోవింద్ వసంత మ్యూజిక్ అని చెప్పాలి. పాటలతో పాటు ప్రతి సీన్, ప్రతి షాట్ లో ఎమోషనల్ టచ్ తో నేపధ్య సంగీతం అందించి మెప్పించాడు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ కూడా చెప్పుకోదగిన విధముగానే ఉంది. సినిమా స్లోగా ఉంది కట్ చేయచ్చు కదా అనిపించచ్చు కానీ ఇలాంటి ఫీల్ గుడ్ కథల్లో మధ్య మధ్యలో కట్ చేసేస్తే ఫీల్ మిస్ అయిపోతాం. కావున స్లో అనిపించినా ఎడిట్ గుడ్ అనే చెప్పాలి.

ఇక డైరెక్టర్ ప్రేమ్ కుమార్ విషయానికి వస్తే.. ఆయన చెప్పాలనుకుంది, మనం లైఫ్ లో మిస్ అయిపోయే ఫస్ట్ లవ్ తో కొద్దీ గంటలు గడిపే సమయం దొరికితే ఆ ఎమోషన్స్ అండ్ మోమెంట్స్ ఎలా ఉంటాయనేది చెప్పాలనుకున్నాడు. దాని కోసం రాసుకున్న సీన్స్ తో ప్రేక్షకులు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతూనే ఉంటారు. కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు బాగా స్లోగా నేరేషన్ సాగడం వలన ప్రేక్షకులకి కాస్త బోర్ కోరుతుంది. అలాగే తమిళంలో కూడా ఇదే స్టైల్ నేరేషన్ ఉంటది కానీ అక్కడ లీడ్ పెయిర్ తో మొదటి 10 నిమిషాల్లోనే కనెక్ట్ అయిపోయే మేజిక్ ని జెనరేట్ చేసాడు. అందుకే అక్కడ నేరేషన్ ప్రాబ్లమ్ కాలేదు. కానీ ఇక్కడ దాదాపు ఫ్లాష్ బ్యాక్ ఎండింగ్ మరియు ఇంటర్వల్ దగ్గర మేజిక్ వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో కూడా కంటిన్యూగా ఆ మ్యాజిక్ జరగలేదు.. అక్కడక్కడా మాత్రమే మ్యాజిక్ జరిగినట్టు అనిపిస్తుంది. దానికి కారణం సెకండాఫ్ 90% సమంత – శర్వానంద్ మాత్రమే ఉంటారు. అక్కడ కొన్ని సీన్స్ లో ఒరిజినల్ వెర్షన్ లో లాగా ఫీల్ వర్కౌట్ అవ్వలేదు, అలాగే పెర్ఫార్మన్స్ లు కూడా డ్రాప్ అవుతాయి. కానీ క్లైమాక్స్ లో మాత్రం ఎమోషన్ వర్కౌట్ అయ్యింది. ఓవరాల్ గా ప్రేమ్ కుమార్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ సంపాదించుకున్నాడు కానీ తన కథే అయినా ఒరిజినల్ వెర్షన్ రేంజ్ లో వండర్ అనిపించలేకపోయాడు. అలాగే నటీనటుల ఎంపిక విషయంలో, తీసుకున్న లైన్ ని అటుగానీ ఇటు గానీ క్రాస్ చేయకుండా చాలా సెన్సిటివ్ గా కథని చెప్పిన తీరుకి ప్రేమ్ కుమార్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. అలాగే తెలుగులో డైలాగ్స్ ఇంకా బెటర్ గా ఉంది ఉంటే ఫీల్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. దిల్ రాజు – శిరీష్ ల నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:  

– సమంత అద్భుతమైన నటన, స్పెషల్ గా కంటతడి పెట్టించే ప్రీ క్లైమాక్స్ లో సింప్లీ సూపర్బ్..
– ఫస్ట్ లవ్ ని గుర్తు చేసే బ్యూటిఫుల్ చైల్డ్ హుడ్ లవ్ స్టోరీ
– గీత – సాయి కిరణ్ ల పెర్ఫార్మన్స్
– ప్రేక్షకులు మ్యాజిక్ లా ఫీలయ్యేలా చేసిన సమంత – శర్వానంద్ ల సీన్స్
– హార్ట్ టచింగ్ ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్
– అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ లైన్
– దృశ్య కావ్యంలా అనిపించే మహేందిరన్ జయరాజ్ విజువల్స్
– మనసుకు హత్తుకునే గోవింద్ వసంత మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:  

– స్లో నేరేషన్
– కొన్ని బోరింగ్ సీన్స్
– ఒరిజినల్ వెర్షన్ రేంజ్ లో మ్యాజిక్ రీ క్రియేట్ అవ్వకపోవడం.

విశ్లేషణ:  

‘జాను’ – రెండున్నర గంటలపాటు మిమ్మల్ని మీ 15వ సంవత్సరానికి తీసుకెళ్లి, మీ హృదయాంతరాల్లో భద్రపరుచుకున్న తొలిప్రేమని గుర్తు చేసి, అందులోని ఆనందాన్ని పెదవులపై నవ్వుగా, కలుసుకోలేక విడిపోయిన బాధని కళ్ళు చెమ్మగిల్లేలా చేసే ఎమోషనల్ లవ్ డ్రామానే ఈ ‘జాను’.. ఇలాంటి పూర్తి ఎమోషనల్ ప్రేమ కథా చిత్రాలు తెలుగులో వచ్చి చాలా కాలమైంది. సమంత, శర్వానంద్, దిల్ రాజు లు అందరూ రిస్క్ అన్నా సరే అద్భుతంగా నటించి, మెప్పించి, రిస్క్ లోనే సక్సెస్ ఉందని మరోసారి రుజువు చేశారు. టైటిల్ రోల్ చేసిన గౌరీ మరియు సమంతలు నటనతో సినిమాని నిలబెట్టేసారు. అలాగే శర్వానంద్, సాయి కిరణ్ లు కూడా అబెస్ట్ అనిపించుకున్నారు. కంప్లీట్ లవ్ డ్రామా అవ్వడం, స్లో నేరేషన్ కావడం వలన, రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ లాంటివి లేకపోవడం వలన కొంతమందికి బోర్ కొడుతోంది. కానీ ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ చూసి, మన మెమొరీస్ ని కూడా గుర్తు చేసుకొని ఎంజాయ్ చేయాలనుకునేవాళ్ళు తప్పక చూడచ్చు..

ఇంటర్వల్ మోమెంట్: వాహ్.. నటీనటుల పెర్ఫార్మన్స్ అదిరింది, ఎమోషన్ బాగుంది, సెకండాఫ్ వేసేయండి త్వరగా..

ఎండ్ మోమెంట్: సమంత కన్నీళ్లు పెట్టించి ఎమోషనల్ గా టచ్ చేసేసిందిగా..

చూడాలా? వద్దా?: ఫీల్ గుడ్ మూవీ కావాలనుకునే అన్ని వర్గాల వారు తప్పక చూడచ్చు..

బాక్స్ ఆఫీస్ రేంజ్:

మనల్ని చైల్డ్ హుడ్ కి తీసుకెళ్లే ‘జాను’ లాంటి కంప్లీట్ ఎమోషనల్ డ్రామా సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. స్లో నేరేషన్ కారణంగా అక్కడక్కడా బోర్ అనిపించినా ఓవరాల్ గా చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కో రేంజ్ లో కనెక్ట్ అయ్యే సినిమా ‘జాను’. ఓవరాల్ గా మల్టీ ప్లెక్స్, ఏ సెంటర్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. సో మిగతా ఆడియన్స్ కి ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే దాన్ని బట్టి ఈ సినిమా ఫైనల్ రెసుల్త్ ఉంటుంది. గుడ్ ఎమోషనల్ ఫిల్మ్ కావడం, సమంత, శర్వానంద్, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ఉండడం వలన సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 3/5

Click Here for Live Updates

<<<  సమంత – శర్వానంద్ ల ‘జాను’ యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్  >>>

సమంత – శర్వానంద్ ల ‘జాను’ యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ ఫిబ్రవరి 7 వ తేదీ ఉదయం 4 గంటల 30 నిమిషాలకి మొదలు కానున్నాయి. ప్రత్యేకంగా తెలుగులో అందించే అప్డేట్స్ కోసం తప్పక తెలుగుబుల్లెటిన్.కామ్ పేజీని విజిట్ చెయ్యండి..

07:05 AM: ఎమోషనల్ క్లైమాక్స్.. సమంత తన పెర్ఫార్మన్స్ తో అందరి కళ్ళు చెమర్చేలా చేసింది. ఊహించినట్టే హ్యాపీ ఎండింగ్ అయితే కాదు కానీ ఆ ఎమోషన్ మనతో అలానే ఉండిపోతుంది.. దానికి కారణం ప్రతి ఒక్కటి లైఫ్ లో ఇలా జరిగి ఉంటుంది..

06:55 AM:సెకండాఫ్ మొత్తం రామ్ – జానుల ఎమోషనల్ జర్నీ.. స్లో నేరేషన్ వలన కొన్ని చోట్ల సాగదీసినట్టు అనిపిస్తుంది..

06:42 AM: రామ్ ఫొటోగ్రఫీ స్టూడెంట్స్ తో జాను తమ లవ్ స్టోరీ గురించి చెప్పే సీన్స్ తో ఊహలే ఊహలే పాట మొదలైంది. సాంగ్ ని కూడా ఫుల్ మోంటేజస్ తో బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు..

06:34 AM: ‘జాను’ అనేది బ్యూటిఫుల్ మోమెంట్స్ తో తయారు చేసిన మ్యాజికల్ లవ్ స్టోరీ.. సమంత – శర్వానంద్ లు తమ పెర్ఫార్మన్స్ తో ఆ మ్యాజిక్ ని ఆడియన్స్ ఫీలయ్యేలా చేస్తున్నారు. సెకండాఫ్ లో ప్రతి సీన్ లోనూ ఇద్దరు అద్భుతమైన నటన కనబరుస్తున్నారు.

06:22AM: జాను రామ్ ని ఎంతగా ఇష్టపడిందో, ఎంతగా రామ్ కోసం ఎదురు చూసిందో అనే ఫీలింగ్స్ ని రామ్ కి చెప్పే సీన్ లో సమంత నటన సింప్లీ సూపర్బ్.. రామ్ – జానుల కెమిస్ట్రీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే సీన్ ఇది..

06:15AM: రామ్ గా చేసిన సాయి కిరణ్ అండ్ శర్వానంద్ లు మరియు జానుగా చేసిన గౌరీ మరియు సమంతలు వారి వారి పాత్రల్లో అద్భుతమైన నటనని కనబరుస్తున్నారు. అందుకే స్లోగా ఉన్నా వారి పెర్ఫార్మన్స్ తో సినిమా అలా వెళ్ళిపోతోంది.

06:10AM: జాను రామ్ ని ఆ ఓల్డ్ అండ్ గడ్డం లుక్ నుంచి యంగ్ లుక్ లోకి మార్చే సీన్ బాగుంది..

06:05AM: గెట్ టుగెదర్ తర్వాత రామ్ – జాను ల మధ్య వారి జ్ఞాపకాల్ని పంచుకునే కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ జరుగుతున్నాయి.

05:55AM:  జాను ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: జాను సినిమా కాస్త స్లోగా మొదలైనప్పటికీ స్కూల్ ఎపిసోడ్ నుంచి ఆడియన్స్ ని రామ్ – జాను ల మేజిక్ కి కనెక్ట్ చేసి మంచి ఫీల్ తో ఇంటర్వల్ వరకూ తీసుకొచ్చాడు. స్కూల్ ఎపిసోడ్ సీన్స్, గెట్ టుగెదర్ఎపిసోడ్, సమంత – శర్వానంద్ ల ఇంటర్వల్ సీన్స్ మంచి ఫీల్ ని క్రియేట్ చేసి ఆడియన్స్ కి వాళ్ళ మెమొరీస్ ని గుర్తు చేశాయి. సెకండాఫ్ లో ఇదీ ఫీల్ కొనసాగుతుందేమో చూడాలి..

05:50AM: రామ్ గురించి తెలిసిన ఓ చిన్న షాకింగ్ విషయం జానుకి తెలియడంతో ఇంటర్వెల్..

05:45AM: గెట్ టుగెదర్ లో జాను స్పీచ్ అండ్ సాంగ్ చూస్తున్న అందరి హృదయాల్ని టచ్ చేసి మన లైఫ్ లోని ఫీల్ గుడ్ మోమెంట్స్ ని గుర్తు చేస్తుంది.

05:40AM: జాను సినిమాకి ప్రాణం లాంటి సీన్.. గెట్ టుగెదర్ లో దాదాపు 17 ఏళ్ళ తర్వాత రామ్ – జనులు కలిసే సీన్ డైరెక్టర్ ప్రేమ్ మరోసారి ఫెంటాస్టిక్ అనిపించేలా తీశారు. చూసే అందరూ ఓ హై ఫీలవుతారు..

05:35AM: అలా అందరినీ చూసాక జాను ఊహల్లో నుంచి ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ మొదలైంది..

05:32AM: ఫైనల్లీ,, అందరూ ఎదురు చూస్తున్న జానుగా సమంత ఎంట్రీ ఇచ్చింది.. చాలా సింపుల్ లుక్ లో క్లాస్ గా ఎంట్రీ ఇచ్చింది. తన ఎంట్రీలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి ఫీల్ లోకి తీసుకెళ్లారు.

05:27AM: ఫ్లాష్ బ్యాక్ ఓవర్ అండ్ రామ్ అండ్ జానుల టెన్త్ బ్యాచ్ గెట్ టుగెదర్ మొదలైంది. రామ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా వెన్నెల కిషోర్ అండ్ శరణ్య ప్రదీప్ లు ఎంట్రీ ఇచ్చారు.

05:22AM: జాను – రామ్ ల స్కూల్ డేస్ లవ్ చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తున్నారు.. జాను స్కూల్ కి రానప్పుడు రామ్ టెన్షన్ పడే సీన్స్ ని చాలా బాగా తీశారు. ఫీల్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది..

05:15AM: స్కూల్ డే లో రామ్ గా సాయి కిరణ్ , జాను గా గౌరీ గీత కిషన్ లు ఎంట్రీ ఇచ్చారు.. స్కూల్ లో వీరిద్దరి మధ్యా జరిగే సీన్స్ చాలా బాగున్నాయ్. చూసే వారందరికీ వారి స్కూల్ డేస్ అండ్ ఫస్ట్ లవ్ ని గుర్తు చేస్తాయి..

05:08AM: ఆ గెట్ టుగెదర్ కి జాను అలుసా సమంతని కూడా పిలిచారు అని తెలియడంతో రామ్ ఊహల్లో నుంచి కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ కి వెళ్ళింది అండ్ రామ్ – జాను ప్రేమ కథ స్కూల్ లో మొదలైంది..

05:00AM: స్కూల్ ని చూస్తూ ఆనాటి రోజులు గుర్తు చేసుకున్న రామ్ అలియాస్ శర్వానంద్ కి అదే టైంలో తన టెన్త్ క్లాస్ మేట్స్ గెట్ టుగెదర్ ప్లాం చేసి చెప్తారు..

04:50AM: శర్వానంద్ తన హోమ్ టౌన్ కి వెళ్లే దారిలో తాను చదివిన స్కూల్ చూసి ఆగిపోయి. జ్ఞాపకాలు నెమరు వేసుకునే సీన్స్ జరుగుతున్నాయి..

04:45AM: శర్వానంద్ తన స్టూడెంట్స్ కి ఫొటోగ్రఫీ నేర్పించే సీన్స్ లో వర్ష బొల్లమ్మ ఎంట్రీ జరిగింది..

04:40AM: వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా శర్వానంద్ ఎంట్రీ.. లైఫ్ అఫ్ రామ్ సాంగ్ తో సినిమా మొదలైంది.. అందమైన ప్రకృతిని చూపించిన విధానం సూపర్బ్. సిరివెన్నెల గారి సాహిత్యానికి విజువల్స్ తో పర్ఫెక్ట్ జస్టిఫై చేశారు.

04:30AM: సమంత – శర్వానంద్ ల మ్యాజికల్ లవ్ స్టోరీ క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ తో ‘జాను’ 2 గంటల 30 నిమిషాల 59 సెకన్ల నిడివితో మొదలైంది..

 

 

గత ఏడాది విజయ్ సేతుపతి – త్రిష హీరో హీరోయిన్లుగా తమిళనాట బ్లాక్ బస్టర్ నిలిచిన సినిమా ’96’. చూసిన వెంటనే తెగ నచ్చేయడంతో సాహసం అని తెలిసినా స్టార్ ప్రొడ్యూసర్ దీనిని తెలుగులో రీమేక్ చేయడానికి శ్రీకారం చుట్టి, సమంత – శర్వానంద్ లాంటి స్టార్స్ ని ఒప్పించి తెలుగులో రీమేక్ చేసి, నేడు(ఫిబ్రవరి 7న) ‘జాను’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సమంత – శర్వానంద్ ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా తమిళంలో లానే తెలుగులో కూడా మేజిక్ క్రియేట్ చేస్తుందో లేదో? తెలియాలంటే మా తెలుగుబుల్లెటిన్.కామ్ ఫస్ట్ ఆన్ నెట్ యుఎస్ ప్రీమియర్స్ లైవ్ అప్డేట్స్ అండ్ రివ్యూ చూడాల్సిందే..

సినిమా

నితిన్ సినిమా బిజినెస్ అదరహో

ప్లాపుల్లో ఉన్నా కూడా నితిన్ తన మార్కెట్ ను కోల్పోలేదు. వరసగా 12 సినిమాలు హిట్ అవ్వకపోయినా నితిన్ కెరీర్ కు ఢోకా లేకుండా పోయింది....

ఆర్జీవీ కరోనా పాట : వైరస్ కంటే భయంకరం

పబ్లిసిటీ, అటెంషన్ సీకింగ్ అనేవి వైరస్ కంటే భయానకమైనవి. ఈ మత్తులో పడిపోతే ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అందుకే...

పవన్ కళ్యాణ్ సరసన శ్రీదేవి ఖరారైనట్టేనా!

కరోనా అనే మహమ్మారి వలన దేశమంతా లాక్ డౌన్.. దాంతో షూటింగ్స్, సినేమానా ఆఫీస్ లు బంద్ అయ్యాయి. కానీ రచయితలూ, దర్శకులు మాత్రం ఇంట్లో...

చిరు ఇన్వాల్వ్‌ అవ్వడం వల్ల బాలయ్య, మోహన్‌బాబులు సైలెంట్‌ అయ్యారా?

ఈ కరోనా విపత్తు సమయంలో టాలీవుడ్‌ నుండి పలువురు స్టార్స్‌ తమ మంచి మనసును చాటుకుని భారీ విరాళాలను ప్రకటించిన విషయం తెల్సిందే. సీఎం పీఎం...

లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఈనెలలో రామంటున్న హీరోలు

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. లాక్‌డౌన్‌కు ముందు నుండే థియేటర్లు బంద్‌ అయ్యాయి. షూటింగ్స్‌ ఆగిపోవడంతో పాటు సినిమాల విడుదల...

రాజకీయం

వెనుదిరిగిన హోం మినిస్టర్‌: అసలేం జరిగింది.?

తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసేందుకు ప్రగతి భవన్‌కి వెళ్ళేందుకు ప్రయత్నించారుగానీ, ప్రగతి భవన్‌ గేటు నుంచే వెనుదిరగాల్సి వచ్చింది. ‘ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ లేకపోవడంతోనే మొహమూద్‌ అలీ వెనుదిరిగారు’...

తెలుగు రాష్ట్రాల్లో డబుల్‌ సెంచరీ: కరోనా విలయమిది.!

‘ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు.. అదే సమయంలో అప్రమత్తంగా వుండాల్సిందే.. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు భరోసా ఇస్తూనే, కరోనా పట్ల స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తోంటే,...

కరోనా వైరస్‌: చిన్న విషయమా వైఎస్‌ జగన్‌.?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 10 లక్షలకు చేరువవుతోంది.. ఈ మహమ్మారి దెబ్బకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 50 వేలకు చేరుకుంటోంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ దెబ్బకి...

‘లాక్‌డౌన్‌’ని లెక్కచేయని జనం.. మోడీ నెక్స్‌ట్‌ స్టెప్‌ ఏంటి.?

క్రమక్రమంగా దేశంలో లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌ తగ్గుతూ వస్తోంది. జనం రోడ్ల మీదకు చాలా ఎక్కువగానే వచ్చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎంతలా హెచ్చరిస్తున్నా, జనంలో మార్పు రావడంలేదు. ఓ పక్క కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.....

జీతాల కోత: రెండు రాష్ట్రాలు.. రెండు కోణాలు

కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న వేళ తెలుగు రాష్ట్రాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టాయి. తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. మరుసటి...

ఎక్కువ చదివినవి

జీతాల కోత: రెండు రాష్ట్రాలు.. రెండు కోణాలు

కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న వేళ తెలుగు రాష్ట్రాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టాయి. తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. మరుసటి...

మహానుభావుడు సోషల్‌ మీడియా ఎంట్రీ

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించడం జరిగింది. దాంతో సినిమా పరిశ్రమకు చెందిన అన్ని షూటింగ్స్‌ ఆగిపోయాయి. తారలు అంతా కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో...

చిరు సర్ప్రైస్ కి రెడీగా ఉన్నారా.?

ప్రపంచాన్ని, మన దేశాన్ని కరోనా వైరస్ షేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. దేశం మొత్తం లాక్ డౌన్ జరుగుతోంది.. అందులో భాగంగానే సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ అయ్యింది. దాంతో...

జనసేనాని పవన్‌ ‘వర్క్‌ ఫ్రమ్ హోమ్’ అదిరింది.!

నిన్న తమిళనాడు ప్రభుత్వం.. ఇప్పుడేమో మహారాష్ట్ర ప్రభుత్వం.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రం విధించిన ‘లాక్‌ డౌన్‌’ కారణంగా ఆయా రాష్ట్రాల్లో...

లాక్‌ డౌన్‌ని లెక్క చేయట్లేదు: వీళ్ళసలు మనుషులేనా.?

‘లాక్‌ డౌన్‌’ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది.. తగ్గిపోవడమేంటి, అసలు రావడమే లేదిప్పుడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందంటూ, దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ముందు వరుసలో వున్న తెలంగాణ గురించి తెలంగాణ...