ఒక్కోసారి అంతే. సినిమాలు సక్సెస్ అవుతున్నా లోపల ఏదో తెలియని బాధ ఉంటుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి పరిస్థితి కొంచెం అటూ ఇటూగా అలానే ఉంది. అనిల్ రావిపూడి దర్శకుడిగా సక్సెస్ఫుల్, ఇందులో ఎలాంటి సందేహం లేదు. పైగా సినిమా సినిమాకూ తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. కళ్యాణ్ రామ్ నుండి మొదలుపెట్టి రావిపూడి ఇప్పుడు మహేష్ ను చేరుకున్నాడు. అంటే దర్శకుడిగా తన స్థాయి బాగా పెరిగినట్లే. కెరీర్ లో ఎఫ్ 2 ద్వారా అత్యధిక హిట్ అందుకున్న రావిపూడి, దాన్ని మించిన విజయాన్ని సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా సాధించాడు. అయితే ఎఫ్2 సినిమా సక్సెస్ అప్పుడు రావిపూడి పేరు మార్మోగిపోయింది, కానీ మహేష్ సినిమా విషయంలో అలా జరగలేదు.
సరిలేరు నీకెవ్వరు సినిమా పెద్ద హిట్ అందులో ఎటువంటి సందేహం లేదు. నైజాంలో 30 కోట్ల పైన షేర్ రావడమంటే మాటలు కాదు. ఒక్క ఓవర్సీస్ లో తప్పితే మిగతా అన్ని ఏరియాల్లో బయ్యర్లు బానే వెనకేసుకున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ ను అల వైకుంఠపురములో గ్రాండ్ హిట్ కమ్మేసింది.
మొదటినుండి అల వైకుంఠపురములో వల్ల సరిలేరు నీకెవ్వరు ఇబ్బంది పడుతూనే ఉంది. ఆ సినిమా సరిలేరును మించి వసూళ్లు రాబట్టడంతో సరిలేరు చిత్రం రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. పైగా సరిలేరు సక్సెస్ క్రెడిట్ మొత్తం మహేష్ ఖాతాలోకే వెళ్ళింది. పుండు మీద కారం అన్నట్లు అల వైకుంఠపురములో సక్సెస్ క్రెడిట్ ఎక్కువగా త్రివిక్రమ్ ఖాతాలో చేరింది. తన సినిమాకు పోటీగా వచ్చిన సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడికి చెంది తన సినిమా సక్సెస్ క్రెడిట్ మాత్రం హీరో ఒక్కడికే పరిమితం కావడం అనిల్ ను సక్సెస్ ను ఆస్వాదించనీయకుండా చేస్తోంది.
అయితే దీన్నుండి బయటపడి మరో హిట్ అందిస్తే అనిల్ కు తిరుగుండదు.
929099 967752You may uncover effective specific development of any L . a . Weight loss program and each and every youre really important. To begin with level is an natural misplacing during the too significantly weight. lose belly fat 263472
291169 101406I want looking at and I believe this website got some truly valuable stuff on it! . 483207
575898 111903I dugg some of you post as I thought they were handy quite valuable 129347
402134 990097Thanks for helping out, superb info. 961489