స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించడానికి ఇంకా తనకు టైమ్ పడుతుందని అంటోంది రష్మిక మండన్న. లేటెస్ట్గా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బంపర్ విక్టరీ అందుకున్న రష్మిక, టాలీవుడ్లో హీరోయిన్గా నెంబర్ వన్ రేసులో కీలకమైన ముందడుగు వేసిన విషయం విదితమే.
అయితే, ఈ నంబర్ గేమ్ మీద తనకు ఏమాత్రం ఆసక్తి లేదని చెబుతోంది రష్మిక. సినిమా సినిమాకీ ఈక్వేషన్స్ మారిపోతుంటాయనీ, హిట్టు సినిమాతో ఆకాశానికెత్తేసి, ఫ్లాప్ సినిమాతో కింద పడేసే ఈక్వేషన్స్‌ని తాను నమ్మబోనని ఈ కన్నడ బ్యూటీ తేల్చి చెప్పేసింది. ” ‘గీత గోవిందం’ సినిమా టైమ్‌లోనే నన్ను ఆకాశానికేత్తేశారు. కానీ, ఆ సినిమా విజయం తర్వాత కూడా అంతకు ముందు వున్నట్లే వున్నాను. ఇప్పుడు కూడా అంతే.
సినిమా కోసం కష్టపడే విధానంలో మార్పులుండవు. సినిమా సక్సెస్ అయితే, తదుపరి సినిమాకి రెమ్యునరేషన్ పెరగొచ్చు. అలాగని అది అన్ని సందర్భాల్లోనూ జరగదు. రెమ్యునరేషన్ అనేది నిర్మాత డిసైడ్ చేస్తారు.. మేం అడిగినంత రెమ్యునరేషన్ నిర్మాత ఇచ్చేస్తారని ఎలా అనుకోగలం.?” అని రష్మిక ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండబ్దలుగొట్టేసింది.
సూపర్ స్టార్ మహేష్‌బాబుతో నటించడాన్ని ఎంజాయ్ చేశాననీ, ఆయనతో డాన్స్ చేయడం, ఆయనతో కామెడీ సీన్స్‌లో నటించడం చాలా ఆనందంగా వుందని రష్మిక చెప్పింది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత రష్మిక నుంచి ‘భీష్మ’ సినిమా రాబోతోంది. దీంతోపాటుగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్. ఇవి కాక తమిళంలో రెండు సినిమాలు, కన్నడలో ఓ సినిమాలోనూ నటిస్తోంది రష్మిక. బాలీవుడ్ నుంచీ రష్మికకి ఓ ఆఫర్ వున్నా, ఆ ఆఫర్ విషయమై ఆచి తూచి వ్యవహరిస్తోందీ బ్యూటీ.
677260 716315What a outstanding viewpoint, nonetheless is just not produce every sence by any indicates discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an concern inside your blogging is it possible you need to recheck this. thank you just as before. 177759
685836 756745Glad to be 1 of several visitants on this awful internet site : D. 533695
463569 551617I truly prize your piece of work, Fantastic post. 301885
152707 907587Can I just say what a relief to search out somebody who genuinely is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a dilemma to light and make it critical. Extra folks want to learn this and perceive this facet of the story. I cant consider youre no far more common because you positively have the gift. 477215