Switch to English

చంద్రన్నకే అర్ధం కాలేదు.. జగనన్నకు ఏం అర్ధం అవుతాడు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తెలుగు రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ అర్ధం కాదు. ఆకాశంలో ఉండే మబ్బుల్లా రాజకీయాలు ఉంటాయి. ఒకప్పుడు రాజకీయాలకు విజయవాడ, గుంటూరు ప్రసిద్ధి. ఇక్కడి నుంచే కన్నింగ్ రాజకీయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈరోజు ఇక్కడ ఒకలా మాట్లాడిన నేతలు… సాయంత్రం అయ్యే సరికి పార్టీ మారిపోయి మరొక చోట వేరేలా మాట్లాడుతుంటారు.

ఒక్కోసారి అసలేం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడతారు. మాట్లాడే మాటలకు, చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఇలాంటి రాజకీయాలే ఇప్పుడు విశాఖలో మొదలయ్యాయి. ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాస రావు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియకుండా ఉన్నది. ఎన్నికలకు ముందు బాబుకు జై కొట్టిన గంట… ఎన్నికలు అయ్యి పార్టీ ఓడిపోయాక సైలెంట్ అయ్యాడు.

అసెంబ్లీకి రావడం కూడా మానేశాడు. పార్టీ మారడమే ఆలస్యం అనుకున్నాడు. జగన్ గేట్లు తీస్తాడేమో ముందుగా దూరేద్దాం అనుకున్నాడు. వైకాపా పడవ అప్పటికే 151 మంది ఎమ్మెల్యేలతో ఫుల్ అయ్యింది. ఇంక ఎక్కించుకుని అవకాశం లేదు. ఒకవేళ ఎక్కితే ఏమౌతుందో తెలియదు. అందుకే జగన్ లంగరు వేయకుండా లాంగిచేస్తున్నాడు. అయినా గంట వదలకుండా వెంటపడుతూనే ఉన్నాడు. ఇటీవల విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయబోతున్నారు అని తెలిసిన తరువాత విశాఖ టీడీపీ నాయకులతో కలిసి మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ లో అనేక విషయాలు చర్చించారు. చివరిగా విశాఖకు కార్యనిర్వాహక రాజధాని ఇస్తామని చెప్తున్న జగన్ కు జై అన్నాడు.

మరి ఇంతలోనే ఏమైందో తెలియదు. విశాఖ రాజధానిగా చేస్తే ఇక్కడ భద్రతా పరమైన ఇబ్బందులు వస్తాయని ప్రజలు భయపడుతున్నారు. ఆ భద్రతకు సబంధించిన క్లారిటీ ఇవ్వాలని వైకాపాను డిమాండ్ చేయడమే కాకుండా, తెలుగుదేశం పార్టీ నిర్దేశించిన విధంగా ఈ కొత్త సంవత్సరం వేడుకలకు దూరంగా ఉండాలని గంటా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, అమరావతి రైతులకు టిడిపి ఇస్తున్న మద్దతు బాబుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అటు విశాఖకు కార్యనిర్వాహక రాజధాని ఇస్తామని చెప్పిన జగన్ కు జైకొడుతూనే ఇటు అమరావతి జై కొట్టడంతో జగన్ వర్గం షాక్ అయ్యింది. గంట రాజకీయాలు ఏంటో తెలియక ఖంగు తిన్నది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబుకే గంట అర్ధం కాలేదు. ఇక జగన్ కు ఏం అర్ధం అవుతాడు చెప్పండి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...