Switch to English

ఆర్జీవీ ‘బ్యూటిఫుల్’ మూవీ రివ్యూ 

Movieబ్యూటిఫుల్
Star Castనైనా గంగూలీ, సూరి
Directorఅగస్త్య మంజు
Musicరవి శంకర్
Releaseజనవరి 1, 2020

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ రూపొందించిన మరో రొమాంటిక్ లవ్ స్టోరీ ‘బ్యూటిఫుల్’. దీనికి ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది ఉప శీర్షిక. ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ కథానాయికగా, సూరి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి అగస్త్య మంజు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారు. బ్లాక్ బస్టర్ ‘రంగీలా’ సినిమాకి ట్రిబ్యూట్ గా రూపొందిన ఈ బ్యూటిఫుల్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ: 

ఫస్ట్ ఇదొక డబ్బింగ్ సినిమా.. ఇక్కడ స్ట్రెయిట్ సినిమాలే కొన్ని తల పట్టుకునేలా చేసున్న టైంలో మరో రొట్ట కథతో వచ్చిన డబ్బింగ్ సినిమానే ‘బ్యూటిఫుల్’.. ఇక కథలోకి వెళితే.. ముంబైలోని ధారావి.. అక్కడ ఉన్నంతలో హ్యాపీ గా ఉండే అమ్మాయి రిన్నీ(నైనా గంగూలీ). అదే కాలనీలో అన్నీ ఉన్నా ఇంకా ఎదో కావాలనుకునే కుర్రాడు మయాంక్ నాయుడు(సూరి). వీళ్ళిద్దరూ ప్రేమలో ఉంటారు. కానీ అనుకోకుండా రిన్నీకి సినిమా అవకాశం వస్తుంది. దాంతో రిన్నీ సూపర్ స్టార్ అవుతుంది. ఆ టైంలో రిన్నీ మేనేజర్ వలన మయాంక్ – రిన్నీల మధ్య దూరం పెరుగుతుంది. కొన్ని కారణాల వల్ల మయాంక్ రిన్నీకి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. మరి వీరి ప్రేమ ఆ అవాంతరాలను దాటుకొని చివరికి విజయాన్ని అందుకుందా? లేక స్టేటస్ వేరియేషన్ వలన విడిడిపోయారా? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఆర్జీవీ రొమాంటిక్ సినిమాలలో ఉండే స్కిన్ షో ఇందులో కూడా విచ్చల విడిగా ఉంది. కథకి అవసరం లేకపోయినా నైనా గంగూలీ చేత ఎక్కువ ఎక్స్ పోజింగే చేయించారు. అది మరీ స్కిన్ షో అంటే నోరు తెరుచుకునే చూసే వారికి నచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నైనా గంగూలీ నటన క్లైమాక్స్ లో కాస్త పరవాలేధనిపిస్తుంది. సూరి కొన్ని కొన్ని సీన్స్ లో బాగానే చేసాడు. ఇక సినిమా పరంగా చెప్పుకోవాలంటే ఓవర్ స్కిన్ షో చేసిన పాటలు, ఒక మాదిరి క్లైమాక్స్ తప్ప చెప్పుకోదగినవి ఏం లేవు.

ఆఫ్ స్క్రీన్:  

అక్కడక్కడా రవి శంకర్ నేపధ్య సంగీతం బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా సిరాశ్రీ సాహిత్యం బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఫస్ట్ హాఫ్ లో కథ కంటే సొల్లు సీన్లు, ఎక్స్పోజింగ్ పాటలు తప్ప ఏం లేకపోవడం వలన ఆడియన్స్ కి చిరాకేస్తుంది. సరే సెకండాఫ్ లో ఎదో కథ చెప్పారుగా అని చూస్తే అదేమో మన తాతల కాలం నాటి కథయ్యింది. దానికి తోడు ప్రతి సీన్ అండ్ డైలాగ్ ఊహించేదే తప్ప కొత్తగా ఏం లేకపోవడం వారిని నిద్రపోయేలా చేసింది. ఆన్ స్క్రీన్ మీద ప్రేక్షకులకి నచ్చే సీన్ ఒక్కటి కూడా లేని సినిమా ఇది, ఇంతకన్నా ఏం చెప్పలేను.

ఆఫ్ స్క్రీన్:  

రామ్ గోపాల్ వర్మ – అగస్త్య మంజు మిగతా చాలా మంది మేధావులు కలిసి రాసిన కథ – కథనాల కంటే ఈ మధ్య కాలంలో వస్తున్న టిక్ టాక్ వీడియోస్ లోనే ఎక్కువ క్రియేటివిటీ అండ్ కంటెంట్ ఉంటోందంటే మీరే అర్థం చేస్కోండి, ఎంత వరస్ట్ కథ – కథనాలు రాసారో.. ఇక అగస్త్య మంజు డైరెక్షన్ బాగుంటే చూసే ఆడియన్స్ కి తలనొప్పెందుకు వస్తుంది. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసి ఎలాంటి సినిమాలు తీయాలో అందరికీ స్ఫూర్తి అనిపించుకున్న ఆర్జీవీ ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీయకూడదు అనే బ్రాండ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు అంటే ఎంత చెత్త సినిమాలు చేస్తున్నారో మీ ఊహకే వదిలేస్తున్నా.. కంటెంట్ వదిలేసి వలం స్కిన్ షో ఉపయోగించి క్యాష్ చేసుకోవాలి అనే స్థాయికి దిగజారిపోవడం బాధాకరం. ఈయన బాటలోనే డైరెక్టర్ అగస్త్య మంజు కూడా అదే సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మీద దాడి చేసి ప్రేక్షకులకి పిచ్చెక్కిస్తున్నారు. చేతకాకపోతే తీయకండి, కాస్టింగ్ ద్వారా బెస్ట్ ఆర్టిస్టులని సెలక్ట్ చేసినట్టు బెటర్ టీంని సెలక్ట్ చేస్కోండి. లేదా ఖాళీగా కూర్చోండి అంతేకానీ ఇప్పుడిప్పుడే బెటర్ కంటెంట్ వైపు అడుగులేస్తున్న తెలుగు చిత్ర సీమలో ఇలాంటి డబ్బింగ్ సినిమాలని విడుదలచేయకండి.

అగస్త్య మంజు అండ్ మరో నలుగురు కలిసి చేసిన సినిమాటోగ్రఫీ కూడా బాలేదు. ఎన్నో ఫ్రెన్స్ లో ఫోకస్ లేదు, విజువల్స్ ఎలా పడితే అలా తీశారు. అభిషేక్ ఓజా ఎడిటింగ్ అయితే మారీ స్లో అండ్ బోర్ ని కలిగిస్తుంది. ఇలాంటి సినిమాకి పెట్టుబడే దండగ.. ఇది సరిపోదన్నట్టు ఆర్జీవీ ది బెస్ట్ వర్క్స్ లో ఒకటైన ‘రంగీలా’ సినిమాకి ‘బ్యూటిఫుల్’ ట్రిబ్యూట్ అనడం మరో దారుణమైన స్టేట్మెంట్ గా చెప్పుకోవాలి.

విశ్లేషణ: 

‘రాను రాను రాజుగారి గుఱ్ఱం గాడిదయ్యిందట’.. ఎప్పుడో విన్న ఈ సామెతలానే ఒకప్పుడు ది బెస్ట్ ఫిలిం మేకర్ అనిపించుకున్న ఆర్జీవీ ఇప్పుడు ది వరస్ట్ ఫిలిం మేకర్ గా మారుతున్నాడు. అదే బాటలో ఇతని శిష్యుడు అగస్త్య మంజు కూడా.. కంటెంట్ ని వదిలేసి హీరోయిన్స్ అంగాంగ అందాల ప్రదర్శన మీద పడ్డారు. ‘బ్యూటిఫుల్’ అనే సినిమా చూసాక గురు శిష్యులిద్దరూ థియేటర్స్ లో జనం మెచ్చే సినిమా తీయడం కన్నా, ఇంకేదో టైపు వీడియోలు తీయడానికి ఇలాంటి సినిమాలు ట్రయిల్ రన్ లా అనిపిస్తున్నాయి. ఆర్జీవీ అలాంటిది ఆల్రెడీ ట్రై చేశారు అది వేరే విషయంలే.. ‘బ్యూటిఫుల్’ అనే సినిమాలో నైనా గంగూలీ అంగాంగ ప్రదర్శన తప్ప ఏం లేదు. దానికోసమే అయితే మీరు థియేటర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాటల్లో మాత్రమే నైనా అందాలు ఆరబోసింది. అవన్నీ ఇప్పటికే మీకు యు ట్యూబ్ లో ఉన్నాయి. సో మీరు అంగాంగ ప్రదర్శనికి పిపాసి అయితే హ్యాపీ గా యు ట్యూబ్ లో ఫ్రీగా చూస్కోండి. మీ టైం అండ్ మనీ రెండూ సేవ్ అవుతాయి. అలా కాదని సినిమాకి వెళితే న్యూ ఇయర్ కాస్తా మీకో పీడకలలా మారుద్ది..

ఫైనల్ పంచ్: బ్యూటిఫుల్ – వెరీ అగ్లీ.!

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 0.5/5  

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

గడిపింది బాయ్ ఫ్రెండ్ తో.. గర్భానికి కారణమని డెలివరీ బాయ్ పై కేసు

ఇదో విచిత్రమైన కేసు. చైనాకు చెందిన ఓ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపింది. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే, అందుకు కారణం డెలివరీ బాయ్ అని, అతడు ఎనిమిది...

రంజాన్‌ ‘నైట్‌ మార్కెట్‌’కి కరోనా చీకట్లు.!

హైద్రాబాద్‌ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బిర్యానీ.. దాంతోపాటే, రంజాన్‌ స్పెషల్‌ అయిన హలీం. ఇంకో స్పెషల్‌ కూడా వుంది రంజాన్‌ సందర్భంలో. అదే నైట్‌ బజార్‌. హైద్రాబాద్‌లోని పాత బస్తీలోగల చార్మినార్‌ ప్రాంతంలోని...

ఇప్పుడా భారమంతా జక్కన్నపైనే

షూటింగ్ లు ఆగిపోయి దాదాపు రెండు నెలలు దాటింది. సినిమా మీదే ఆధారపడి జీవించే దాదాపు 12 వేల మందికి ఇప్పుడు పూట గడవడం కూడా కష్టంగానే ఉంటోంది. అందుకే చిరంజీవి, నాగార్జున...

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...

కుమారుడి మృతితో సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం.!

తమిళ, కన్నడ, మళయాళ భాషలలో అలనాటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన సీనియర్ నటి, కళాభినేత్రి వాణీశ్రీ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది. వాణీశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తీక్...