Switch to English

‘కృష్ణా – గుంటూరు’ ఎందుకు విభజించినట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ని మొత్తం నాలుగు ప్రాంతాలుగా జీఎన్‌ రావు కమిటీ విభజించింది. కమిటీ విభజిస్తే మాత్రం.. ఆ ప్రాంతాలు విడిపోతాయా.? కానీ, అసలు విభజన ఎందుకు జరిగింది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలున్నాయి. ఇది ఎప్పటినుంచో ఇలాగే వుంది. ఉభయ గోదావరి జల్లాల్ని ఒక యూనిట్‌గా చూస్తుంటాం. దానికి అదనంగా కృష్ణా జిల్లాని కలిపారు. మామూలుగా అయితే, కృష్ణా – గుంటూరు జిల్లాలు ఓ యూనిట్‌.

గుంటూరు జిల్లాకి ప్రకాశం, నెల్లూరుతో కలిపి ఓ యూనిట్‌గా మార్చారు. రాయలసీమ.. ముఖ్యమంత్రి సొంత ప్రాంతం గనుక.. అందులో నాలుగు జిల్లాలున్నా, దాన్ని విభజించలేదన్నమాట జీఎన్‌ రావు కమిటీ. మూడేసి ప్రాంతాల్లో మూడేసి జిల్లాలు, ఓ ప్రాంతంలో మాత్రం నాలుగు జిల్లాలు.. ఇదీ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ని జీఎన్‌ రావు కమిటీ విభజించిన తీరు.

ఈ విభజన ఇప్పుడు కృష్ణా – గుంటూరు జిల్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ‘అసలు అలా విభజన చేయాల్సిన అవసరం ఏంటి.?’ అని కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు మండిపడుతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కుట్రపూరితంగానే ఈ ఆలోచనను తెరపైకి తెచ్చిందన్నది వారి అభిప్రాయం.

అసలు, నాలుగు ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించినా.. ఆ లెక్కన ప్రజలు భావిస్తారని అనుకోవడానికి వీల్లేదు. కానీ, ప్రజల మధ్య ప్రాంతాల వారీగా విభజన రేఖను గీయడం అనేది కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రాంతాల మధ్య విభజనే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని రెండుగా విడదీసేసింది. ఒకానొక దశలో మూడు ముక్కలు చేయాలన్న ప్రతిపాదన వచ్చినా.. చివరికది రెండు ముక్కలకే పరిమితమయ్యింది.

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమవుతుంది.? పాలకుల్లో అడ్డగోలు ఆలోచనలు వుంటే.. నాలుగు ముక్కలేం ఖర్మ.. నలభై ముక్కలైనా అవ్వొచ్చు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు కదా.. మూడు కాదు, ముప్ఫయ్‌ రాజధానులైనా పెడతాం.. అని. అది రాజధానికే కాదు.. రాష్ట్ర ప్రజల మధ్య విభజనకీ వర్తించాలనే ఆలోచన అధికార పార్టీలో లేదని ఎలా అనుకోగలం.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...