Switch to English

సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

నటీనటులు: సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, సుధీప్ , సాయి మంజ్రేకర్..
నిర్మాత: సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది
దర్శకత్వం: ప్రభుదేవా
సినిమాటోగ్రఫీ: మహేష్ లిమాయే
మ్యూజిక్: సాజిద్ వాజిద్
ఎడిటర్‌: రితేష్ సోని
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కింగ్ ఖాన్ గా మారిన సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ ప్రాంచైజ్ ‘దబంగ్’. ఇప్పటికే రెండు పార్ట్స్ రిలీజ్ అయ్యాయి, ఈ రోజు దానికి మూడో పార్ట్ గా ‘దబంగ్ 3’ రిలీజయింది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాని హిందీతో పాటు అల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో కూడా రిలీజ్ చేశారు. మరి ఈ క్రేజీ ప్రాంచైజ్ 3వ పార్ట్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ:

స్క్రీన్ ప్లే పక్కన పెట్టి, కథ ప్రకారం ఓపెన్ చేస్తే.. చుల్ బుల్ పాండే(సల్మాన్ ఖాన్) కుర్రతనంలో ఆవారాలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. తన ఫామిలీ పెళ్లి చేయాలని ఫిక్సయ్యి ఖుషి(సైయీ మంజ్రేకర్)తో ఎంగేజ్ మెంట్ చేస్తారు. అదే టైంలో రౌడీ అయిన బలి సింగ్(సుదీప్) ఖుషిని చూసి ఇష్టపడతాడు. కానీ తను చుల్ బుల్ తో ప్రేమలో ఉందని తెలిసి ఖుషిని చంపేసి చుల్ బుల్ మీద నేరం మోపుతాడు. కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటకి వచ్చిన చుల్ బుల్ పాండే పోలీస్ అయ్యి బలి సింగ్ ని చంపేస్తాడు. ఆ తర్వాత ప్రాంతాలు మారుతూ పోస్టింగ్ ఎంజాయ్ చేస్తున్న చుల్ బుల్ పాండే కి ఆ ఏరియా డాన్ గా మళ్ళీ బలి సింగ్ ఎదురవుతాడు. చనిపోయిన బలి సింగ్ ఎలా బతికాడు? చుల్ బుల్ పాండే మళ్ళీ ఎదురైన బలి సింగ్ ని ఏం చేసాడు? బలి సింగ్ చుల్ బుల్ పాండేకి ఎలాంటి అడ్డంకులు తెచ్చాడు? వాటిని చుల్ బుల్ ఎలా ఎదుర్కున్నాడు? అన్నదే ఈ చిత్ర కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

సిల్వర్ స్క్రీన్ మీద ఈ సినిమాని నిలబెట్టింది అంటే ఇద్దరే.. వాళ్ళే సల్మాన్ ఖాన్ – కిచ్చ సుదీప్.. సలీమాన్ ఖాన్ మరోసారి తన చుల్ బుల్ పాండే స్వాగ్ తో అమితంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సారి ఎక్కువగా నవ్వించడం మీదే శ్రద్ధ పెట్టాడు. పాటైనా, ఫైటైనా, ప్రతి చోటా నవ్వించే ప్రయత్నమే చేశారు, అందులో మెజారిటీ పార్ట్ సక్సెస్ అయ్యాడు కూడా.. ఇక పవర్ఫుల్ అండ్ టఫ్ విలన్ పాత్రలో సుదీప్ అదరగొట్టాడు. ఈ పాత్రలో అయినా ఒదిగిపోయే సుదీప్ , ఈగ తర్వాత మరోసారి విలన్ పాత్రలో తన నటవిశ్వరూపం చూపాడని చెప్పాలి. నువ్వా నేనా అంటూ సాగే ఈ సినిమాని వీరిద్దరి పెర్ఫార్మన్స్ లు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. సోనాక్షి సిన్హా ఎప్పటిలానే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపించింది. పాటల్లో కాస్త గ్లామర్ తో కూడా మెప్పించింది. ఇక తొలి పరిచయమైన సైయీ మంజ్రేకర్ ఆన్ స్క్రీన్ బాగుంది. అలాగే సల్మాన్ తో తన కెమిస్ట్రీ కూడా బాగుంది.

ఇక సినిమా పరంగా చెప్పుకోవాలంటే.. సినిమా మొదటి నుంచి ఎక్కువ భాగం నవ్విస్తూనే సినిమాని నడిపించడం పెద్ద ప్లస్ అయ్యింది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ, అందులో వచ్చే షారుఖ్ ఖాన్ కామెడీ ట్రాక్, అలాగే సల్మాన్ ఖాన్ – పనిమనిషి మధ్య వచ్చే ట్రాక్స్ బాగా నవ్విస్తాయి. అలాగే ప్రతి ఫైట్ ని వింటేజ్ స్టైల్లో పూర్తి ఫన్ ఉండేలా చేయడం కూడా బాగా వర్కౌట్ అయ్యింది. కమర్షియల్ గా వన్ ఆన్ వన్ జరిగే క్లైమాక్స్ ఫైట్ డిజైనింగ్ కూడా మాంచి కిక్ ఇస్తుంది. సెకండాఫ్ లో అలీ ఉండేది ఒక్క సీన్ అయినా చాలా బాగా నవ్వించాడు.

ఆఫ్ స్క్రీన్:

గిరిగీసుకొని మరీ చేసిన పక్కా కమర్షియల్ ఫార్మాట్ సినిమాని ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యేలా చెప్పడమంత ఈజీ కాదు కానీ ప్రభుదేవా ఆ విషయంలో విజయం సాధించాడు. కెప్టెన్ అఫ్ ది షిప్ గా ప్రభువేవా విన్నర్ అవడం వలన సినిమా కూడా విన్నింగ్ ఫిల్మ్ గా మారనుంది. రాజశ్రీ సుధాకర్ తెలుగు పంచ్ డైలాగ్స్ కూడా ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. మహేష్ లిమాయే విజువల్స్ కమర్షియల్ సినిమాకి సరిపోయేలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అనల్ అరసు స్టంట్స్ చాలా స్టైలిష్ గా మరియు అంటే ఫన్నీగా కూడా ఉన్నాయి. సాజిద్ వాజిద్ నేపధ్య సంగీతం సినిమాకి బాగానే హెల్ప్ అయ్యింది. సల్మాన్ ఖాన్ స్వాగ్ ని రిపీట్ చేసేలా చేసిన కొరియోగ్రఫీ కూడా సూపర్బ్. ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ కి అసలు సిసలైన క్రెడిట్ అంటా ఇవ్వాలి. ప్రొడక్షన్ వ్లయోస్ టాప్ లెవల్ లో ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

కథ పరంగా గొప్ప కథ కాకపోవడం వలన, మనకు తెలిసిన పలుసార్లు చూసేసిన కథ కావడం వలన కథ పరంగా పెద్దగా లేదే అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఎగ్జైట్ మెంట్ కూడా ఏమీ లేకపోవడం వలన చాలా చోట్ల బోర్ ఫీలవుతాం. కమర్షియల్ ఫార్మటు అనగా పాట, ఫైటు, సీను, కామెడీ బిట్.. మళ్ళీ రిపీట్ అనేలా చేయడం వలన అన్నీ మనకి ముందే తెలిసిపోతుంటాయి. అలాగే ఇంటర్వల్ బాంగ్ చాలా లైట్ గా, సడన్ గా కట్ చేసేసినట్టు ఉంటుంది. సో ఇంటర్వల్ ఎపిసోడ్ ఇలాంటి సినిమాలకి బెటర్ గా ఉండాల్సింది. అలాగే సెకండాఫ్ లో శ్రీను వైట్ల ఫార్మాట్ లో వచ్చే ఒక ఎపిసోడ్ బోరింగ్ గా ఉంటుంది. అలాగే విలన్ పాత్ర ‘మగధీర’ సినిమాల్ని విలన్ పాత్రకి, ఆ క్వాలిటీస్ కి చాలా దగ్గరగా ఉంటుంది.

ఆఫ్ స్క్రీన్:

సల్మాన్ ఖాన్ హీరోగానే కాకుండా ఈ కథ కూడా ఆయనే రాశారు. కానీ ఆయన ఏదైనా ఫ్రెష్ గా రాసారా అంటే అదీ లేదు. తన కెరీర్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రోజుల్లో వచ్చే కథనే మళ్ళీ రాసాడు. అలాగే కథ కంటే కథనం ఇంకా వీక్ గా, ఊహాజనితంగా ఉంది. ఎంగేజ్ అండ్ ఎగ్జైట్ అయ్యే మోమెంట్ ఒక్కటీ లేదు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా, క్రిస్ప్ గా ఉండాల్సింది.

విశ్లేషణ:

గత రెండు ‘దబంగ్’ పార్ట్ లలానే ‘దబంగ్ 3’ కూడా సల్మాన్ ఖాన్ మానియా, స్వాగ్ నిమయం హైలైట్ చేస్తూ చేసిన సినిమా. ఇందులోనూ తన మ్యానరిజమ్స్, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ మరియు పంచ్ డైలాగ్స్ తో సూపర్బ్ అనిపించుకున్నాడు. నెగటివ్ షేడ్స్ లో కిచ్చ సుదీప్ కూడా అదరగొట్టాడు. ఓవరాల్ గా అన్నీ సమపాళ్లలో మిక్స్ చేసి చేసిన రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. కానీ 150 నిమిషాలు మిమ్మల్ని కూర్చోబెడతారు అక్కడ డైరెక్టర్ ప్రభుదేవా మార్క్స్ కొట్టేసాడు. ఓవరాల్ గా సల్మాన్ ఖాన్ హిందీ ఫాన్స్ కి సూపర్బ్ గా నచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఒకసారి చూసేలా ఉంది. కమర్షియల్ సినిమా అనేదానికి పెద్ద పీట వేసే మన తెలుగులో వచ్చే ఎన్నో కమర్షియల్ సినిమాల కన్నా బెటర్ ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ మూవీ మరియు సల్మాన్ ఖాన్ కి తెలుగులో హిట్ ఇచ్చే సినిమా ‘దబంగ్ 3’.

ఫైనల్ పంచ్: దబంగ్ 3 – సేమ్ టు సేమ్ ఫార్మాట్ కానీ ఎంటర్టైనింగ్ బొమ్మ.!

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Lokesh Kanagaraj: రొమాంటిక్ సాంగ్ లో లోకేశ్ కనగరాజ్.. వీడియో వైరల్

Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ప్రస్తుతం ఆయన నటుడిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...
నటీనటులు: సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, సుధీప్ , సాయి మంజ్రేకర్.. నిర్మాత: సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది దర్శకత్వం: ప్రభుదేవా సినిమాటోగ్రఫీ: మహేష్ లిమాయే మ్యూజిక్: సాజిద్ వాజిద్ ఎడిటర్‌: రితేష్ సోని విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కింగ్ ఖాన్ గా మారిన సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ ప్రాంచైజ్ 'దబంగ్'. ఇప్పటికే రెండు పార్ట్స్...సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' మూవీ రివ్యూ