Switch to English

‘రాజా వారు రాణి గారు’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

నటీనటులు: కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం..
నిర్మాత: మనోవికాస్.డి
దర్శకత్వం: రవికిరణ్ కోలా
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత – అమర్ దీప్ గుత్తుల
మ్యూజిక్: జయ్ క్రిష్
ఎడిటర్‌: విప్లవ్ నైషధం
విడుదల తేదీ: నవంబర్ 29, 2019

యంగ్ టాలెంట్స్ అంతా కలిసి టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘రాజా వారు రాణి గారు’. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ర‌హ‌స్య గోరఖ్, యజుర్వేద గుర్రం, రాజ్ కుమార్ కేశిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా రవికిరణ్ కోలా అనే యంగ్ డైరెక్టర్ కూడా పరిచయం అయ్యాడు. టీజర్, ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ‘రాజా వారు రాణి గారు’ సినిమాగా ఏ మేరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

ఇంటర్మీడియట్ రోజుల్లో రాజా(కిరణ్ అబ్బవరం) తన క్లాస్ మేట్ అయిన రాణి(రహస్య గోరఖ్)ని ప్రేమిస్తాడు. కానీ చెప్పడానికి భయపడి చెప్పడు. రాణి ఇంటర్ అయ్యాక పై చదువుల కోసం తన అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్లిపోద్ది. దాంతో రాణి ఏ ఊర్లో, ఏ కాలేజ్ లో చదువుతుంది అని తెలుసుకోవాలని రాజా తెగ ట్రై చేసినా ఒక్క మార్గం కూడా దొరకదు. దాంతో రాజా లైఫ్ లో డల్ అయిపోతాడు. అలా మూడున్నరేళ్ల తర్వాత రాణి ఏ పరిస్థితుల్లో మళ్లీ ఊరొచ్చింది? అప్పుడైనా రాజా తన ప్రేమని రాణిని చెప్పాడా? లేదా? ప్రేమ విషయంలో రాజాకి ఫ్రెండ్స్ అయిన నాయుడు(యజుర్వేద్ గుర్రం)-చౌదరి( రాజ్ కుమార్ కసిరెడ్డి)లు ఎలా సహాయ పడ్డారు? చిరవికి రాజా – రాణి కలిసారా? లేదా?అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

‘రాజా వారు రాణి గారు’ సినిమాకి ప్రధాన బలం నటీనటుల పెర్ఫార్మన్స్ అనే చెప్పాలి. నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకి ప్రాణం పోశారని చెప్పాలి. హీరో రాజా పాత్రలో చేసిన కిరణ్ అబ్బవరం లవ్, కోపం, బాధ ఇలా ఎమోషన్ ఏదైనా సూపర్బ్ గా చేసాడు. రాణిగా చేసిన రహస్య గోరఖ్ కి స్క్రీన్ స్పేస్ తక్కువైనప్పటికీ ఉంన్నంతలో బాగా చేసింది. ఇక ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ పిల్లర్స్ అయిన రాజ్ కుమార్ కసిరెడ్డి – యజుర్వేద్ గుర్రంల గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ లో వీరు మనల్ని బాగా నవ్విస్తారు. నవ్వించడమే కాకుండా మనం ఆ ఏజ్ లో పల్లెటూరిలో, కాలేజ్ లో చేసిన ఎన్నో అనుభూతుల్ని గుర్తు చేసేలా వారి పాత్రలని డిజైన్ చేశారు. ముఖ్యంగా చౌదరి పాత్ర చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి చాలా రోజులు గుర్తుండిపోతాడు. నటులుగా వీరందరికీ మంచి మంచి అవకాశాలు వస్తాయని పక్కాగా చెప్పచ్చు.

హీరోయిన్ ఫ్రెండ్స్ గా చేసిన దివ్య నార్ని, స్నేహ మాధురి శర్మలు కూడా బాగా చేసారు. ఇక ప్రధాన పత్రాలు పోషించిన కేదార్ శంకర్, కిట్టయ్య, భోగిరెడ్డి శ్రీనివాస్, బాంబే పద్మ, చోటు చెర్రీలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమా పరంగా చూసుకుంటే ఆన్ స్క్రీన్ ఫస్ట్ హాఫ్ ప్రెజంటేషన్ పరంగా చాలా అంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే ప్రపోజల్ సీన్స్, ఫ్రెండ్స్ హెల్పింగ్ సీన్స్, కండోమ్ అండ్ తుప్పల్లోకి తీసుకెళ్లే సీన్, ఇద్దరు ఫ్రెండ్స్ ఐడియా వేసే సీన్స్, ఇంటర్వల్ సీన్ బాగా నవ్విస్తాయి. సెకండాఫ్ లో ఒకటి రెండు సీన్స్ బాగుంటాయి. అలాగే వన్ లైనర్స్ బాగా పేలాయి.

ఆఫ్ స్క్రీన్:

ఇక్కడ ముందుగా చెప్పాల్సింది.. విద్యాసాగర్ చింత – అమర్ దీప్ గుత్తుల సినిమాటోగ్రఫీ గురించి.. ప్రతి విజువల్, ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉండేలా చూసుకున్నారు. అలాగే రెగ్యులర్ షాట్స్ పెద్దగా తీయలేదు. ఉదాహరణకి సాడ్ సాంగ్ అన్ని సినిమాల్లో ఉంటుంది, ఒకేలా ఉంటుంది కానీ వీరు ఆ మొనాటనీ రాకూడదని విజువల్ గా ప్రెజంటేషన్ ని చాలా డిఫరెంట్ గా షూట్ చేశారు. ఈ విషయంలో వీరికి ఎడిటర్ విప్లవ్ హెల్ప్ కూడా ఎంతో ఉందని చెప్పాలి. విజువల్స్ వల్ల సినిమా చూస్తున్నంత సేపు మనం మన పల్లెటూళ్ళకి వెళ్లి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. టెక్నికల్ గా ఫస్ట్ క్రెడిట్ డిఓపి వెళ్తే సెకండ్ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ జయ్ క్రిష్ కి వెళ్తుంది. ఈయన కూడా రెగ్యులర్ గా కాకూండా డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. చాలా కంటెంట్ లేని సీన్స్ లో ఎదో ఉందని చెప్పడానికి ఇతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. క్లైమాక్స్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే సందర్భానుసారంగా వచ్చే పాటలు కూడా చాలా బాగున్నాయి.

డైరెక్టర్ గా రవికిరణ్ కోలా డిస్టింక్షన్ మార్క్స్ కొట్టేశాడని చెప్పాలి. తను అనుకున్నదాన్ని విజువల్ గా తెరపైకి తీసుకురావడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. విజువల్స్ తో ఆడియన్స్ కి ఒక ఫీల్ కనెక్ట్ చేయడం అనేది చాలా కష్టం కానీ ఇతను కనెక్ట్ చేయగలిగాడు. అందుకే డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. అలాగే తను రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి, వన్ లైనర్స్ అయితే చాలా అంటే చాలా బాగా పేలాయి. అలాగే కొన్ని చోట్ల సందర్భానుసారంగా కామెడీ వచ్చేలా రాసిన సీన్స్ లో అతని టాలెంట్ మరో సారి కనిపిస్తుంది. సౌండ్ డిజైన్ అండ్ సౌండ్ మిక్సింగ్ అదిరింది. ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

చాలా మంది దర్శకులు చేసిన తప్పే ఇక్కడ రవికిరణ్ కూడా చేసాడు అనిపిస్తుంది.. ఫస్ట్ హాఫ్ ని స్పీడ్ అండ్ ఎంటర్టైనింగ్ గా రాసుకుని, సెకండాఫ్ లో మాత్రం స్లో అయిపోయి, వీక్ కథతో, ప్రేక్షకులని పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాడని పక్కాగా చెప్పచ్చు. సెకండాఫ్ లో నవ్వుకునే మోమెంట్స్ లేవు, పోనీ ఎమోషనల్ కంటెంట్ అయినా స్ట్రాంగ్ గా ఉందనుకుందాం అన్నా అంత స్ట్రాంగ్ ఎమోషన్ లేదు. ఇలాంటి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ లో వర్కౌట్ అవ్వాల్సిందే ఎమోషన్, కానీ అది అంత వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ లైన్ ఎంత సింపుల్ గా ఉంటుందో, ఎమోషన్ కూడా అంతే సింపుల్ గా ఉండడం వలన ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేదు. రాను రాను సెకండాఫ్ గ్రాఫ్ కంప్లీట్ గా పడిపోతుంది. క్లైమాక్స్ లో వర్షం పెట్టేసి ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేయలేదని చెప్పాలి, అందుకే అస్సలు కనెక్ట్ అవ్వరు. అలాగే ‘తొలిప్రేమ’ క్లైమాక్స్ కి మరొక వెర్షన్ లా ఉంటుంది ఈ మూవీ సెకండాఫ్.

ఆఫ్ స్క్రీన్:

ఓ స్ట్రాంగ్ కథకి పైన ప్లస్ లో చెప్పిన అన్ని పాయింట్స్ తోడైతే సినిమా బ్లాక్ బస్టర్ అందులో తిరుగే లేదు, కానీ ఈ సినిమా విషయంలో అన్నీ కుదిరాయి కానీ కథ మాత్రం కుదరలేదని చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ రవికిరణ్ కోలా సినిమా కోసం ఎంచుకున్న స్టోరీ లైన్ చాలా అంటే చాలా చిన్నది. చెప్పాలంటే ఒక షార్ట్ ఫిలిం చేయగలిగే లైన్. ఆ లైన్ తో కథ మొత్తం బిల్డ్ చేస్కోవడం వలన చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథ లేకపోయినా కొన్ని మోమెంట్స్ వలన హ్యాపీగా నడిచిపోతుంది, కానీ సెకండాఫ్ మాత్రం చాలా స్లోగా నడుస్తుంది. అలాగే చూసే ఆడియన్స్ ఇక చెప్పెయ్ రా బాబు అని ఫీలవుతున్న కథ మాత్రం ముందుకెళ్లదు. ఒకటే కంటెంట్ ని పలు రకాల సీన్స్ లో రిపీట్ చేస్తుండడం చాలా బోర్ కొట్టిస్తుంది. విజువల్ నేరేషన్ కి కాస్త బెటర్ కథని, బెటర్ స్క్రీన్ ప్లే ని రాసుకోలేకపోవడం రవికిరణ్ మైనస్. ఈయనకి పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ ఎక్కువ ఇష్టం అనుకుంటా అందుకే సెకండాఫ్ మొత్తం మాగ్జిమమ్ అదే ఫ్లేవర్ ఫాలో అయిపోయాడు. అలాగే మలయాళ ‘ప్రేమమ్’ సినిమా కూడా రవికిరణ్ ని ఎక్కువ ప్రభావితం చేసినట్టు ఉంది. అనుకూ నేటివిటీ మనది కనపడ్డా మేకింగ్ స్టైల్, క్యారెక్టర్ ఆర్క్స్, సీన్స్ ఫ్లేవర్, విజువల్స్ డిజైనింగ్ అంతా ఆ సినిమాకి దగ్గర పోలికలు ఉంటాయి.

ఇక విప్లవ్ ఎడిటింగ్ డిఫరెంట్ విజువల్స్ కట్స్ విషయంలో సూపర్బ్ అనిపిస్తుంది. కానీ లెంగ్త్ విషయంలో ఇంకా కట్ చేయాల్సింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కంటెంట్ నే సెకండాఫ్ లో మల్లె మళ్ళీ చూస్తున్నాము అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే లాజికల్ పరంగా హీరోయిన్ ఎక్కడ ఎప్పుడు ఎలా కనెక్ట్ అయ్యిందనేది ఉండదు, అలాగే క్లైమాక్త్స్ లో రాణి అంత చేస్తున్నా పక్కనున్న అమ్మమ్మ పాత్ర ఎక్కడికిపోయిందో తెలియదు, అదే సీన్ లో రాణి తన ప్రేమని చెప్పినా రాజా ఎందుకు నో అన్నట్టు వెళ్ళిపోతాడో అర్థం కాదు. అలాగే క్లైమాక్స్ కి వచ్చేసాం కలిపేయాలి కాబట్టి కలిపేశాం అన్నట్టే ఉంటుంది తప్ప ఒక పెయిన్ తో వీళ్ళు కలవాలి అనే ఫీలింగ్ ని ఆడియన్స్ కి కలిగించి, ఆ తర్వాత కలపాలి.

విశ్లేషణ:

‘రాజా వారు రాణి గారు’ టీజర్ కట్ లానే, విజువల్ నేరేషన్ పరంగా చాలా ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తుంది, అందులో డౌట్ లేదు. కానీ విజువల్ గా ఎంత కనెక్ట్ చేసినా, అది అలానే నిలిచిపోవాలి అంటే దానికి సరైన కథ, ఎమోషన్ తోడవ్వాలి. కానీ ఈ చిత్రానికి అవే మైనస్ లు కావడం వలన చాల వరకూ ప్రేక్షకులు పూర్తిగా సంతృప్తి చెందరు. విజువల్ గా, టెక్నికల్ గా మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా అయితే మాత్రం ది బెస్ట్ ప్రోడక్ట్ ‘రాజా వారు రాణి గారు’. ఫస్ట్ హాఫ్ లో చిన్న చిన్న హ్యాపీ మోమెంట్స్ తో నవ్వుకుంటూ చూసేయగలరు, కానీ సెకండాఫ్ లో కథ లేకపోవడం వలన సాగదీసి తీయడం వలన బోర్ కొట్టేస్తుంది. స్లో ఉన్న పర్లేదు మంచి రిఫ్రెషింగ్ ఫిల్మ్ చూడాలనుకునే వారు మాత్రం తప్పకుండా చూడచ్చు, మిగిలిన వారు కూడా మీ లైఫ్ లో వెళ్లిపోయిన కొన్ని మధురానుభూతుల్ని గుర్తు చేసుకోవడం కోసం ‘రాజా వారు రాణి గారు’ చూడచ్చు.

ఫైనల్ పంచ్: రాజా వారు రాణి గారు – ‘తొలిప్రేమ’కి పల్లెటూరి వెర్షన్, కానీ ఆ రేంజ్ కాదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...
నటీనటులు: కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం.. నిర్మాత: మనోవికాస్.డి దర్శకత్వం: రవికిరణ్ కోలా సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత - అమర్ దీప్ గుత్తుల మ్యూజిక్: జయ్ క్రిష్ ఎడిటర్‌: విప్లవ్ నైషధం విడుదల తేదీ: నవంబర్ 29, 2019 యంగ్ టాలెంట్స్ అంతా కలిసి టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 'రాజా వారు రాణి గారు'. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు...'రాజా వారు రాణి గారు' మూవీ రివ్యూ