హను రాఘవపూడి .. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన హను ఆ తరువాత హీరో నానితో కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత నితిన్ తో లై, శర్వానంద్ తో పడిపడి లేచే మనసు సినిమాలు చేసాడు .. అవి తీవ్రంగా నిరాశ పరచడంతో పాపం హను పరిస్థితి మరి దారుణంగా మారింది.
ఆ తరువాత హను రాఘవపూడి తరువాత సినిమా ఇప్పటి వరకు ఏది సెట్ కాలేదు .. ఆయనతో సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు రావడం లేదట, దాంతో అయన మరోసారి హీరో నాని కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అందాల రాక్షసి సినిమా నుండి హను రాఘవపూడి అంటే నాని కి ప్రత్యేక అభిమానం .. దాంతో రెండో సినిమా ఛాన్స్ ఇచ్చాడు.
నాని ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకున్న హను .. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందులో భాగంగా హీరో నానికోసం ఓ సూపర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట. ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు ఇంద్రగంటి మోహన కృష్ణ తో వి సినిమా కూడా చేస్తున్నాడు. మరి ఈ సినిమాల తరువాత నాని ఈ ప్లాప్ దర్శకుడికి అవకాశం ఇస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
485946 416157Sweet internet site , super layout, genuinely clean and utilize genial . 896999
699804 483357Terrific paintings! That could be the type of info that are meant to be shared around the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on more than and consult with my web site . Thank you =) 512741