ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పాగా వేయాలని ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ.. ఆ దిశగా తన కసరత్తు ముమ్మరం చేసింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచి, తద్వారా బలోపేతం కావాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు సమాచారం. వాస్తవానికి రాష్ట్ర పునర్విభజన చట్టంలో సైతం అసెంబ్లీ సీట్ల పెంపు గురించి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెంచాలని అందులో సూచించారు. ఈ నేపథ్యంలో గతంలో రెండు రాష్ట్రాల సీఎంలు పలుమార్లు ప్రధాని మోదీని కలిసి సీట్ల పెంపు గురించి విన్నవించారు. అయినప్పటికీ అప్పటి పరిణామాలను బట్టి సీట్ల పెంపునకు కేంద్రం సుముఖత వ్యక్తంచేయలేదు. ఇదే విషయాన్ని అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లకు స్పష్టంచేశారు.
తమకు అవసరమైన సమయంలోనే సీట్ల పెంపు గురించి ఆలోచిద్దామనే భావనతో అప్పడు దాన్ని పక్కనపెట్టారు. ప్రస్తుతం ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా లబ్ధి పొందాలన్నది కమలనాథుల ప్రణాళికగా తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ద్వారా ఆయా చోట్ల రాజకీయంగా లాభం పొందాలని యోచిస్తోంది. జమ్మూకాశ్మీర్, సిక్కింతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సీట్ల పెంపునకు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం.
వీలైనంత త్వరగా ఆయా రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పూర్తి చేసే దిశగా కదులుతోంది. ఇందుకు సంబంధించిన బిల్లు కూడా తయారుచేసినట్టు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాలకు కలిపి డీలిమిటేషన్ పై ఒకే కమిషన్ వేసి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అనంతరం వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలన్నది కాషాయదళం ప్రణాళికగా ఉందని చెబుతున్నారు.
ఇందులో భాగంగానే ప్రస్తుతం బీజేపీ నేతలు దూకుడు పెంచారని అంటున్నారు. నిన్నటి వరకు జగన్ తో స్నేహంగా ఉన్న కమలనాథులు.. గత కొన్ని రోజులుగా విమర్శల వాడి పెంచడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఎప్పటినుంచో అందని ద్రాక్షగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని, త్వరలోనే ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమని అంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
547840 420267Aw, this became an really nice post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a quite good article but exactly what do I say I procrastinate alot and by no indicates discover a approach to get something completed. 522437
3725 417780Disgrace on the seek Google for no longer positioning this post higher! Come on over and visit my website. 745381
52474 955982You ought to join in a contest for starters of the highest quality blogs online. I will recommend this page! 785855
510280 521150Its hard to find knowledgeable individuals on this subject, but you sound like you know what you are talking about! Thanks 194201
705634 612831Very exceptional details can be found on weblog . 364370
163928 737116oh effectively, Alicia silverstone is matured nowadays but when she was still younger, she is the sex symbol of hollywood` 157822