చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ‘బ్రాండ్ అమరావతి’ అనే పేరు ప్రముఖంగా విన్పించింది. అదిప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో ‘భ్రమరావతి’గా మారిపోయింది. కొత్తగా తెరపైకి తీసుకొస్తున్న సంక్షేమ పథకాలకీ, పాత పథకాలకీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టడం ద్వారా ‘వైఎస్సార్ బ్రాండ్’ని ప్రమోట్ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అటు అమరావతి గురించిగానీ.. ఇటు పోలవరం ప్రాజెక్టు గురించిగానీ శ్రద్ధ చూపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్ జగన్ మాట్లాడకపోవడం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి బాగా కలిసొస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎలా మనుగడ సాధిస్తుంది.? అన్న ప్రశ్నకు, ఇదిగో.. వైఎస్ జగన్ పాలనలోని వైఫల్యాలే తెలుగుదేశం పార్టీకి బలాన్నిస్తున్నాయనే సమాధానం ఖచ్చితంగా దొరికి తీరుతుంది.
అమరావతి విషయంలో వరల్డ్ బ్యాంక్‌తోపాటు, మరికొన్ని సంస్థలూ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్‌కి షాకులు ఇస్తోన్న విషయం విదితమే. నిజానికి, కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరే ఈ అనర్ధాలకి కారణం. కానీ, ఆ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నమే చేయడం లేదు కాబట్టి, ఆటోమేటిక్‌గా వైఎస్ జగన్ ప్రభుత్వమ్మీదనే జనంలోనూ వ్యతిరేకత ఏర్పడుతోంది. ఆ వ్యతిరేకతే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ‘ఫ్యూయల్’.
గత కొద్ది రోజులుగా చాలా డల్ మోడ్‌లో కన్పించిన చంద్రబాబు, ఇప్పుడు చాలా ఆవేశపూరితంగా కన్పిస్తున్నారు. ఆయన సంధిస్తోన్న ఒక్కో ప్రశ్న, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, భారతీయ జనతా పార్టీ కూడా వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఊహించని ఈ పరిణామంతో వైసీపీ శ్రేణులూ ఆందోళనకు గురవుతున్నాయి.
అటు బీజేపీ, ఇటు టీడీపీ.. ఇలా రెండిటినీ ఏకకాలంలో ఎదుర్కోవాల్సి రావడం కష్టమేనని వైసీపీ ముఖ్య నేతలే కొందరు ఆఫ్ ది రికార్డ్‌గా అభిప్రాయపడ్తున్నారట. ఇదిలా వుంటే, చంద్రబాబు వెనుక వుండి బీజేపీ కొత్త గేమ్ షురూ చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారట. అదే నిజమైతే, చంద్రబాబు స్పీడ్‌కి బ్రేకులేయడం వైఎస్ జగన్‌కి అంత ఈజీ కాదిప్పుడు.
448432 139518Hey! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 937059
912937 55287New York Travel Tips […]below you will uncover the link to some sites that we think you need to visit[…] 940044
62462 187060Some truly great information , Gladiola I located this. 493656