Switch to English

బ్రాండ్‌ అమరావతి.. బాబు స్పీడ్‌కి జగన్‌ బ్రేకులేయగలరా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ‘బ్రాండ్‌ అమరావతి’ అనే పేరు ప్రముఖంగా విన్పించింది. అదిప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ హయాంలో ‘భ్రమరావతి’గా మారిపోయింది. కొత్తగా తెరపైకి తీసుకొస్తున్న సంక్షేమ పథకాలకీ, పాత పథకాలకీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టడం ద్వారా ‘వైఎస్సార్‌ బ్రాండ్‌’ని ప్రమోట్‌ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అటు అమరావతి గురించిగానీ.. ఇటు పోలవరం ప్రాజెక్టు గురించిగానీ శ్రద్ధ చూపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్‌ జగన్‌ మాట్లాడకపోవడం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి బాగా కలిసొస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎలా మనుగడ సాధిస్తుంది.? అన్న ప్రశ్నకు, ఇదిగో.. వైఎస్‌ జగన్‌ పాలనలోని వైఫల్యాలే తెలుగుదేశం పార్టీకి బలాన్నిస్తున్నాయనే సమాధానం ఖచ్చితంగా దొరికి తీరుతుంది.

అమరావతి విషయంలో వరల్డ్‌ బ్యాంక్‌తోపాటు, మరికొన్ని సంస్థలూ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి షాకులు ఇస్తోన్న విషయం విదితమే. నిజానికి, కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరే ఈ అనర్ధాలకి కారణం. కానీ, ఆ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నమే చేయడం లేదు కాబట్టి, ఆటోమేటిక్‌గా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమ్మీదనే జనంలోనూ వ్యతిరేకత ఏర్పడుతోంది. ఆ వ్యతిరేకతే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ‘ఫ్యూయల్‌’.

గత కొద్ది రోజులుగా చాలా డల్‌ మోడ్‌లో కన్పించిన చంద్రబాబు, ఇప్పుడు చాలా ఆవేశపూరితంగా కన్పిస్తున్నారు. ఆయన సంధిస్తోన్న ఒక్కో ప్రశ్న, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, భారతీయ జనతా పార్టీ కూడా వైసీపీని టార్గెట్‌ చేస్తోంది. ఊహించని ఈ పరిణామంతో వైసీపీ శ్రేణులూ ఆందోళనకు గురవుతున్నాయి.

అటు బీజేపీ, ఇటు టీడీపీ.. ఇలా రెండిటినీ ఏకకాలంలో ఎదుర్కోవాల్సి రావడం కష్టమేనని వైసీపీ ముఖ్య నేతలే కొందరు ఆఫ్‌ ది రికార్డ్‌గా అభిప్రాయపడ్తున్నారట. ఇదిలా వుంటే, చంద్రబాబు వెనుక వుండి బీజేపీ కొత్త గేమ్‌ షురూ చేసిందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారట. అదే నిజమైతే, చంద్రబాబు స్పీడ్‌కి బ్రేకులేయడం వైఎస్‌ జగన్‌కి అంత ఈజీ కాదిప్పుడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....