Switch to English

వైసీపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్‌.. కంట్రోల్‌ చేయలేకపోతున్న జగన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

అధినేత మెప్పు కోసం చట్ట సభల సాక్షిగా తమ స్థాయిని మర్చిపోతున్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు. ప్రతిపక్ష నేత చంద్రబాబుని వైసీపీ శాసనసభ్యులు తిడుతోంటే, వినడానికి చాలా ‘సొంపు’గా అన్పించవచ్చుగాక వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి. మొదట్లో జగన్‌ కూడా అలాంటి వ్యవహారాలు చూసి పండగ చేసుకున్నారు కూడా. రాను రాను జగన్‌, తమ సభ్యుల తీరుతో కొంత ఆందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి వస్తోంది.

నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబుని తిట్టే క్రమంలో వైసీపీ శాసనసభ్యులు సంయమనం కోల్పోతే, అది వైఎస్సార్సీపీకే ప్రమాదకరం. ప్రజల్లో ఆల్రెడీ వైసీపీ పలచనైపోయింది. చెయ్యాల్సిన పరిపాలన చెయ్యడం చేతకాదుగానీ, చంద్రబాబుని విమర్శించడంలో మాత్రం ఓవరాక్షన్‌ చేస్తున్నారనే అభిప్రాయం జనంలో క్రమంగా బలపడుతోంది. ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ కూడా అలాగే వస్తున్నాయట వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి.

ఎప్పటికప్పుడు అందుకుంటున్న ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌లో తమ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతున్నట్లు తేలడంతో జగన్‌ సందిగ్ధంలో పడిపోయారని సమాచారం. ముఖ్యంగా, చట్ట సభల వేదికగా పార్టీ సభ్యులు చూపుతున్న అత్యుత్సాహం, ప్రజల్లో పార్టీ ఇమేజ్‌ని దారుణంగా డ్యామేజ్‌ చేసిందని ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌తో తేటతెల్లమయ్యిందట. ఇదే విషయం బీజేపీ నేతల మాటల్లోనూ కన్పిస్తోంది.

రెండు నెలలు తిరగకుండానే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందంటూ బీజేపీ నేతలు చేసిన విమర్శల్ని అధికార పార్టీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వుంది. కానీ, దాదాపు పదేళ్ళపాటు జగన్‌ మీద చంద్రబాబు అండ్‌ టీమ్‌ చేసిన విమర్శల్ని భరించి వున్న కొందరు వైసీపీ నేతలు, ఆ ఫ్రస్ట్రేషన్‌ని తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి.. దాన్ని ఆపడం జగన్‌కీ సాధ్యం కావడంలేదని ఆఫ్‌ ది రికార్డ్‌గా కొందరు వైసీపీ నేతలే తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

కంట్రోల్‌ చేయగలిగితేనే నాయకుడు.. అంతే తప్ప, అధినేత మెప్పు కోసం అడ్డగోలుగా వ్యవహరించే నాయకుల్ని అలాగే వదిలేస్తే.. కొంప (అధికారం) మునిగిపోయే ప్రమాదముంది జగన్‌ సారూ!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...