Switch to English

నా మనసుకు ఎంతో దగ్గరైన కథ ఇది : హన్సిక

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

దేశ‌ముదురు సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అరంగేట్రం చేసిన హ‌న్సిక అన‌తికాలంలోనే అగ్ర‌క‌థానాయిక‌గా గుర్తింపును సొంతం చేసుకున్న‌ది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నాయికగా నటించిన ఆమె క‌థానాయికగా న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం మై నేమ్ ఈజ్ శృతి శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..”కథలో కొత్తదనం ఉన్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.

భాగమతి, పిల్ల జమిందార్ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన అశోక్ మరో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..”వర్క్ పట్ల హన్సిక చాలా డెడికేటెడ్ గా ఉంటుంది. మంచి పెర్ఫార్మెన్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం హన్సికతో పాటు దర్శనిర్మాతలకు మంచి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

హన్సిక మాట్లాడుతూ..”ఇదొక గ్రేట్ సబ్జెక్ట్ థ్రిల్లర్. నా మనసుకు ఎంతో దగ్గరైనా కథ. డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. వైష్ణవి ఆర్ట్స్ సంస్థ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాకర్ గారు ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా” అని చెప్పారు.

దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ..”ఎంతో డెడికేషన్ తో కథ విని.. కొత్త దర్శకుడినైనా నన్ను ఎంకరేజ్ చేసిన హన్సిక గారికి ధన్యవాదాలు. ఆమె కథను బలంగా నమ్మారు.అలాగే స్క్రిప్ట్ తో పాటు నన్ను అర్థం చేసుకున్న టెక్నీషియన్స్ దొరకడం నా అదృష్టం. ఇందులోని సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాబిన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రొడ్యూసర్ గారు చేసిన సపోర్టును మర్చిపోలేను” అని చెప్పారు.

నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ..”సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన హన్సిక గారికి ధన్యవాదాలు” అని అన్నారు.

నటుడు ప్రవీణ్, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కిషోర్, కో ప్రొడ్యూసర్ బండి పవన్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...