Switch to English

Operation Ravan: ఆపరేషన్ రావణ్’ మూవీ ఫస్ట్ థ్రిల్ లాంచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

Operation Ravan: ‘పలాస 1978’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం “ఆపరేషన్ రావణ్”. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్ యాక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ ఆపరేషన్ రావణ్ లో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ‘ఫస్ట్ థ్రిల్’ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మారుతి, కళ్యాణ్‌ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గేయ రచయిత ప్రణవం మాట్లాడుతూ.. “నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమ్ కు ధన్యవాదాలు. నేను ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. ఈ గ్లింప్స్ చాలా బాగా వచ్చింది. మొత్తం టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను.. “అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ” ఓ తండ్రి కొడుకును పెట్టి డైరెక్ట్ చేయడం అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన ఘటన ఈ ఆపరేషన్ రావణ్‌ కు జరిగింది.నాకు ప్రసాద్ గారు మంచి ఫ్రెండ్. ఆయనలో చాలా ప్యాషన్ ఉంది. సినిమాను జాగ్రత్తగా తీయించుకునేవారు. అందుకు పలాస, లండన్ బాబులు ఉదాహరణలు. అలాంటి తను ఓ రోజు కథ రాసుకున్నాను. నేనే డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు. ఆశ్చర్యపోయాను. తర్వాత టీజర్ చూపించారు. చూడగానే చాలా ప్రామిసింగ్ గా ఉంది. కథను మాత్రమే నమ్మి సినిమా తీసినట్టు అనిపించింది. అసలు తండ్రి కొడుకుతో ఇలాంటి సినిమా తీయాలన్న ఆలోచనే గొప్పగా ఉంది. మీ ఆలోచనలే మీ శతృవులు అనే క్యాప్షన్ కూడా బావుంది. ఈ ఫస్ట్ థ్రిల్ బావుంది. రక్షిత్ తో పాటు ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్.. “. అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ” రక్షిత్ అంతకు ముందు రెండు సినిమాలు చేశాడు. పలాసలో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ప్రసాద్ గారు డైరెక్షన్ చేస్తా అన్నప్పుడు నవ్వుకున్నా. బట్ ఇప్పుడు ట్రైలర్ చూశాక చాలా బావుంది. అద్భుతంగా ఉంది. రాధిక గారు ఒప్పుకున్నారు అంటే దర్శకుడిలో విషయం ఉందనుకున్నాను. మంచి తండ్రి, మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు, నిర్మాత ప్రసాద్. వెంకట్ సత్య అనే పేరుతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. రక్షిత్, ప్రసాద్ ను అభినందిస్తూ.. ఈ ఫస్ట్ థ్రిల్ చాలా బావుంది. నాకు కథ కూడా తెలుసు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.

దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ .. ” చాలామంది సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వెరైటీ స్టోరీ అని చెబుతున్నారు. హీరో ఎవరు అంటే ఫస్ట్ టూ ఆప్షన్స్ లో రక్షిత్ పేరు ఉంటుంది. అది అతని సక్సెస్ అని నేను అనుకుంటున్నా. రెగ్యులర్ కథల్లో ఎవరైనా చేయొచ్చు. ఓకొత్త కథ అనుకున్న ఓ హీరో మైండ్ లోకి వచ్చాడంటే అతను ఎంత ఇంప్రస్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అతను చేస్తోన్న ఆపరేషన్ రావణ్, నరకాసుర, శశివదనే అన్నీ బావుండాలని కోరుకుంటున్నా. ఇక దర్శకుడు ప్రసాద్ గారు ఏ ఫీల్డ్ లో ఉన్నా సక్సెస్ అవుతారు. ఆయన చాలామంచి వ్యక్తి. ఆయన నిర్మాతగా, దర్శకుడుగా సక్సెస్ కావాలి. రక్షిత్ తోనే కాకుండా వేరే హీరోలతో కూడా చేయాలి. రీ రికార్డింగ్ బావుంది. ఫస్ట్ థ్రిల్ కూడా ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే బావుంది. సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.. ” అన్నారు.

సంగీత దర్శకుడు శ్రావణ వాసుదేవన్ మాట్లాడుతూ.. ” నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి థ్యాంక్యూ. రెగ్యులర్ గా పాటలు చేయడం వేరు. కానీ ఈ మూవీ ప్రాసెస్ లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. ప్రసాద్ గారు నాకు అలాంటి సిట్యుయేషన్స్ ఇచ్చారు. రాధికా మేడమ్ మీకు నేను పెద్ద ఫ్యాన్. పాటలకు సంబంధించి మంచి లిరిక్స్ ఇచ్చారు. అందరికీ ఆల్ ద బెస్ట్.. థ్యాంక్యూ.. ” అన్నారు.

శశివదనే నిర్మాత అహితేజ మాట్లాడుతూ.. ” ఈ గ్లింప్స్ చూశాను. చాలా చాలా నచ్చింది నాకు. ముందుగా డెబ్యూ డైరెక్టర్ గారి కంగ్రాట్స్. నా అక్షర సినిమా తర్వాత ప్రసాద్ గారు కాల్ చేశారు. కొంత గ్యాప్ తర్వాత నేను ఓ కథ చెప్పాను. అప్పటికే రావణ్‌, నరకాసుర కథలు డిఫరెంట్ గా ఉన్నాయి. మా సినిమా మంచి లవ్ స్టోరీగా వస్తోంది. నిర్మాతల గురించి ఆలోచించే వ్యక్తి రక్షిత్ గారు. నేను చూసిన హీరోలకు భిన్నమైన క్యారెక్టర్ రక్షిత్ గారిది. ఇలాంటి హీరోలు ఉండరు. ఆయన మార్కెట్ పెరిగినా.. అందులో సగంలోనే సినిమా చేద్దాం అంటారు రక్షిత్ గారు. క్యారవాన్ కూడా అడగరు. ఇలాంటి హీరోలుంటే నిర్మాతలకు మేలు జరుగుతుంది. పెద్ద బ్యానర్స్ కూడా రక్షిత్ లాంటి హీరోలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.

అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ .. “45డేస్ లో షూటింగ్ చేశాం అని ప్రసాద్ గారు చెబితే షాక్ అయ్యాను. చాలా చాలా బాగా చేశారు. విజువల్స్, ఆర్ఆర్ అదిరిపోయాయి. గ్లింప్స్ చూస్తోంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది. రక్షిత్ లాంటి హీరో ఉంటే ఏ ప్రొడ్యూసర్ అయినా హ్యాపీగా ఉంటారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ .. ” అన్నారు.

స్వామి మాట్లాడుతూ.. ” ఈ చిత్ర దర్శకుడు సత్య గారు నాకు ఐదేళ్లుగా పరిచయం. ఎప్పుడు కలిసినా సినిమా గురించే మాట్లాడతారు. మంచి బిజినెస్ మేన్ అయినా గొప్ప సాహిత్యాభిలాషి. ఎన్నోపుస్తకాలు చదివారు. అప్పుడే ఆయన ఓ మంచి ఆలోచనతో సినిమా చేస్తారు అనుకున్నా. అలాగే మీ ఆలోచనలే మీ శతృవులు అనే మంచి పాయింట్ తో ఆపరేషన్ రావణ్ తీశారు. ఈ ఫస్ట్ థ్రిల్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇది చూసిన తర్వాత ఆయన ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడు అనిపించింది. ఈ చిత్రం తండ్రి కొడుకులకు చాలా పెద్ద పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.

చిత్ర రచయిత లోహిత్ మాట్లాడుతూ.. ” రాధికా మేడమ్ గారి ముందు మీతోమాట్లాతున్నా అందుకు కారణం ప్రసాద్ గారే. ఎందరో మహానుభావులు.. శ్రీ రంగం శ్రీనివాసరావు గారి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వరకూ నేను రచయిత కావడానికి స్ఫూర్తినిచ్చిన అందరికీ వందనాలు.. ” అన్నారు.

జర్నలిస్ట్ మూర్తి మాట్లాడుతూ.. “ఇప్పటి వరకూ మీ అందరికీ స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు తెలుసు. వాళ్లబ్బాయి రక్షిత్ తెలుసు. కానీ ఈ సినిమా తర్వాత ఆయన స్క్రీన్ మ్యాజిక్ ప్రసాద్ అవుతారు. ఆపరేషన్ రావణ్ టీమ్ అందరికీ కాంగ్రాట్యులేషన్స్.. ఆల్ ద బెస్ట్.. థ్యాంక్యూ.. ” అన్నారు .

నటుడు రఘు కుంచె మాట్లాడుతూ.. ” పలాస మూవీ స్టోరీ డిస్కషన్స్ లో .. ప్రసాద్ గారి ఇన్వాల్వ్ మెంట్ చూసినప్పుడల్లా నాకో డౌట్ వచ్చేది. ఈయనకి చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలని ఉందేమో అనిపించేది. అదే టైమ్ లో ఆయనలో మంచి రైటర్ కూడా ఉన్నాడు. పలాస టైమ్ లో ఆయన రైజ్ చేసిన క్వశ్చన్స్ చూస్తే ఆయన డైరెక్టర్ అవుతాడు అనుకున్నా. చూస్తే చాలా కామ్ గా ఉండే ప్రసాద్ గారు ఈ రేంజ్ వయొలెన్స్ తోసినిమా తీయడం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. రక్షిత్ చాలా డీసెంట్ పర్సన్. గోల్డెన్ స్పూన్ తో పుట్టినా.. చాలా మర్యాదస్తుడు. బాలీవుడ్ లో రాకేష్‌ రోషన్, హృతిక్ రోషన్ లా మీ తండ్రి కొడుకులు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రాధిక మేడమ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.

దర్శకుడు వెంకట్ సత్య మాట్లాడుతూ.. ” పిలవగానే వచ్చిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం రాధిక మాడమ్ గారు. ఎన్నో సినిమాలు చేసి, ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేసిన రాధిక గారు ఈ సినిమా చేయడం దైవానుగ్రహంగా భావిస్తున్నాను.. ” అన్నారు.

నటి రాధిక మాట్లాడుతూ.. “అందరూ వచ్చి ఈ ఫస్ట్ థ్రిల్ లాంచ్ ను బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. దర్శకుడు, హీరో తండ్రి కొడుకులు అని నాకు ఇప్పుడే తెలిసింది.నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరూ అంటే రక్షిత్ అన్నారు. అతనెవరు అంటే పలాస చూడండి అన్నారు. నేను పలాస చూశాను. కానీ మరోసారి చూశాను. ఇక ఈ మూవీ షూటింగ్ లో కూర్చున్నప్పుడు నాకు ఆ ఫిల్మ్ బాగా నచ్చింది. పలాస రైటింగ్ ఎవరూ అంటే నేనే అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను. ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ చాలా కామ్ గా పనిచేసుకుంటూ వెళ్లారు. కామ్ గా ఉన్నా.. అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. చాలా ఎఫర్ట్ పెట్టారు. నా ఎక్స్ పీరియన్స్ ప్రకారం ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్. హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. ఈ పిక్చర్ లో ఉన్న అందరు ఆర్టిస్టులు, హీరోయిన్, మాస్క్ విలన్ అంతా బాగా చేశారు. వాళ్లంతా సీజన్డ్ ఆర్టిస్టులు. వాళ్ల టాలెంట్ బయటకు తీసుకు రావడమే దర్శకుడి పని. నాకు ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ చేయాలనే కోరుకుంటాను. ఇలాంటి తెలుగు సినిమాలు వస్తే డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని మరీ చేస్తాను. రక్షిత్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్ పర్సన్. అతని కళ్లు చాలా బావుంటాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఆపరేషన్ రావణ్ హిట్ కావాలి.. థ్యాంక్యూ..” అన్నారు.

హీరో రక్షిత్ మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం.. ఇక్కడికి వచ్చిన మారుతి గారు, భరద్వాజ గారికి, కళ్యాణ్‌ కృష్ణ గారికి థ్యాంక్యూ. ఈ మూవీ టెక్నీషియన్స్ గురించి తర్వాత ఈవెంట్స్ లోమాట్లాడతాను. మా సినిమా ఫస్ట్ సక్సెస్ రాధిక గారు ఒప్పుకున్నప్పుడే జరిగింది. వెంకట సత్య వర ప్రసాద్ .. మా నాన్నగారు.. నా ప్రాణం.. ఈ చిత్రానికి దర్శకుడు. 1995లో స్వీట్ మ్యాజిక్ స్థాపించారు. అప్పుడు ఏం లేదు. కానీ ఇప్పుడు కొన్ని వేలమందికి ఉద్యోగం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోస్వీట్ మ్యాజిక్ తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆపరేషన్ రావణ్ తీశారు. ఈ మూవీ దేశం అంతా తెలుస్తుందనుకుంటున్నా. ఏదో డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేశారు అని కాకుండా.. అన్ని విషయాలు చాలా క్షుణ్నంగా పరిశీలించి నేర్చుకుని చేశారు. ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందే సెట్స్ లో ఉండేవారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా ఈ కాన్ఫిడెంట్ కు కారణం అదే. పలాస గురించి ఓ కాలేజ్ ఈవెంట్ లో చెప్పాను. ఈ సినిమా చూడండి.. చూశాక నచ్చకపోతే నా కాలర్ పట్టుకోండి అని. ఇప్పుడు అంతకు మించిన కాన్ఫిడెన్స్ తో చెబుతున్నాను. నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందీ సినిమా. చాలా పెద్ద దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తారో అలా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రయాణంలో మా తమ్ముడు, మా అమ్మ సపోర్ట్ మరలవలేనిది.. థ్యాంక్యూ.. ” అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....