Switch to English

Rangamarthanda: ‘రంగమార్తాండ’: కృష్ణవంశీ ఆవిష్కరించిన ‘జీవితం’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

Rangamarthanda: ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’ అంటాడో సినీ కవి.! ఆ పాట ‘చక్రం’ సినిమాలోనిది.! కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఆ సినిమాలోని ‘జగమంత కుటుంబం నాది..’ పాట అప్పట్లో ఓ సంచలనం.

ఆ పాట ప్రస్తావన ఇప్పుడెందుకు.? అంటే, కృష్ణవంశీ గురించే బహుశా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆ పాట రాశారేమో.! తన కోసం ‘గురూజీ’ రాసిన ఆ పాటని ఓ సినిమా కోసం కృష్ణవంశీ వాడేశారేమో.!

ఔను, కృష్ణవంశీకి చాలామంది అభిమానులున్నారు. జగమంత అభిమానమది.! ఆయన దర్శకత్వ ప్రతిభకు అభిమానులు వాళ్ళంతా. కృష్ణవంశీ సినిమాలు కొన్ని ఫెయిల్ అయి వుండొచ్చుగాక. కానీ, ‘క్రియేటివ్ డైరెక్టర్’ కృష్ణవంశీ అన్న గుర్తింపు ఆయన్నుంచి ఎప్పుడూ దూరం కాలేదు. కృష్ణవంశీ అంటే ఇదీ.. అని ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లోని సీన్స్ చూసినప్పుడు అర్థమవుతుంటుంది. భావోద్వేగాలు ఆయన సినిమాల్లో చాలాబాగా పండుతాయ్.!

చాలాకాలం తర్వాత కృష్ణవంశీ నుంచి ఓ సినిమా వస్తోంది. అదే ‘రంగమార్తాండ’. మరాఠీ సినిమా ‘నట సమ్రాట్’కి ఇది తెలుగు రీమేక్.! అక్కడ నానా పటేకర్ పోషించిన పాత్రని తెలుగులో ప్రకాష్ రాజ్ పోషించారు. కాదు కాదు, జీవించేశారు. నానా పటేకర్ లాంటి నటుడు చేసేశాక, ఆ పాత్ర ఇంకెవరైనా చేస్తే.? ప్చ్.. కష్టమే అనుకుంటాం. కానీ, ‘జాతీయ ఉత్తమ నటుడు’ పురస్కారాన్ని గతంలోనే అందుకున్న ప్రకాష్ రాజ్, తన అనుభవాన్నంతా ఈ సినిమా కోసం రంగరించేశారు.

ఇక, ఈ సినిమాలో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే, అది ముమ్మాటికీ బ్రహ్మానందం అనే చెప్పాలి. బ్రహ్మానందం అనగానే కామెడీ గుర్తుకొస్తుంది. కానీ, ఇకపై బ్రహ్మానందం గురించి దర్శకులు ఆలోచించే విధానం కూడా మారుతుంది. బలమైన పాత్రలకి అంతకన్నా బలమైన నటనా ప్రతిభతో ప్రాణ ప్రతిష్ట చేయగలరు బ్రహ్మానందం. కొన్ని సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్‌ని బ్రహ్మానందం తన నటనా ప్రతిభతో డామినేట్ చేశారనడం అతిశయోక్తి కాదేమో. రమ్యకృష్ణ కావొచ్చు, అనసూయ కావొచ్చు.. ఇంకో పాత్ర కావొచ్చు.. ఆయా పాత్రల్లో ఆయా నటీనటులు కాదు, ఆయా పాత్రల స్వభావమే కనిపిస్తుంది. శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ పాత్రలు సైతం ఆకట్టుకుంటాయి. ఆయా పాత్రల్లో నటీనటులంతా చక్కగా, అందంగా ఒదిగిపోయారు.

నటీనటుల నుంచి ఉత్తమ ప్రతిభను రాబట్టుకోవడంలో కృష్ణవంశీ తర్వాతే ఎవరైనా. అందుకే, కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తే, నటన పరంగా రాటుదేలినట్లేనని చాలామంది భావిస్తారు. ఆ విషయం ఈ సినిమాతో ఇంకోసారి ప్రూవ్ అయ్యిందంతే. నిజానికి, ‘రంగమార్తాండ’ లాంటి సినిమా తీయాలంటే ఎన్ని గట్స్ కావాలి.?

ఔను కదా.? నిజమే కదా.! కమర్షియల్ పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమాని కృష్ణవంశీ కాస్సేపు తనవైపుకు బలంగా తిప్పేసుకున్నాడనిపిస్తుంది. నాటక రంగం ప్రధానంగా సినిమా సాగుతుందేమో అనుకుంటారంతా. కానీ, ఇది జీవితం. మన నిజ జీవితంలోని పాత్రలే చాలావరకు కనిపిస్తాయ్.. ప్రధాన పాత్రధారులు తెరపై కనిపిస్తోంటే. మన ఇంట్లోని సంఘటనల్నే మనం అనుభూతి చెందుతుంటాం.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం.. ఈ ఇద్దర్నీ తెరపై చూస్తున్నప్పుడు, ‘మనకీ అలాంటి స్నేహితుడుంటే..’ అనిపించకమానదు. తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం దగ్గర్నుంచి, పలు కీలక అంశాలపై సినిమాలో చర్చకు పెట్టారు దర్శకుడు కృష్ణవంశీ. ‘నిగ్గదీసి అడుగు.. అగ్గితోటి కడుగు..’ అన్నట్లుగానే వుంటుంది ‘రంగమార్తాండ’ సినిమా.

సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక సమాచారం లేదు. కానీ, సినిమాని కొంతమంది సినీ పాత్రికేయులకు, అత్యంత సన్నిహితులకు ప్రత్యేకంగా చూపించారు కృష్ణవంశీ. కాదు కాదు, ఓ గొప్ప అనుభూతిని అందించారాయన. అదే భావన, సినిమా చూసిన ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. సినిమా చూస్తున్నంతసేపూ, చూసినవాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మనసుల్లోని ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగాయి. ‘ఇది కదా సినిమా అంటే..’ అనుకున్నారు సినిమా చూసినవాళ్ళంతా.

ప్రదర్శన పూర్తయ్యాక.. ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోకుండా, సినిమాని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన, ఆయా పాత్రల జీవితాల్ని వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించిన, జీవిత సత్యాల్ని నేర్పించిన కృష్ణవంశీకి కృతజ్ఞతలు చెప్పకుండా వుండలేకపోయారంటే ‘రంగమార్తాండ’ సినిమాని చూసినవారెంతటి భావోద్వేగానికి లోనయ్యారో అర్థం చేసుకోవచ్చు.

ఆసుపత్రి సన్నివేశంలో బ్రహ్మానందం ప్రదర్శించిన నటన ఈ సినిమా మొత్తానికి హైలైట్‌గా చెప్పుకోవచ్చు.! వాట్ నాట్.. ఇలాంటివి చాలానే వున్నాయ్. కృష్ణవంశీ టేకింగ్, పాత్రల్లోని భావోద్వేగాల్ని ఆయన ఆవిష్కరించిన తీరు, ఇళయరాజా సంగీతం.. అందునా నేపథ్య సంగీతం.. వీటికి తోడు, మెగాస్టార్ చిరంజీవి షాయరీ.. ‘రంగమార్తాండ’ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్ళాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.

సిరివెన్నెల సాహిత్యం, ఆకెళ్ళ శ్రీనివాస్ మాటలు.. సినిమా చూశాక కూడా మనల్ని వెంటాడతాయి. తల్లిదండ్రుల వెతల్ని, పిల్లల బాధ్యతారాహిత్యాన్ని దర్శకుడు కృష్ణవంశీ ప్రశ్నించిన తీరు, సమాజానికి ఓ భావోద్వేగపూరిత హెచ్చరిక.

ఇదీ సినిమా అంటే.! ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించాలి. అలా ఆదరించాలంటే, సినిమా కూడా బలంగా జనాల్లోకి వెళ్ళాలి. విలవల వలువలూడ్చేసిన ప్రస్తుత మోడ్రన్ ట్రెండ్‌లో.. ఈ తరహా సినిమాల్ని జనం ఎంతవరకు ‘ఓన్’ చేసుకుంటారు.? అన్నది ముందు ముందు తేలుతుంది.

సినిమాపై ఎంత నమ్మకం వుండి వుంటే, కృష్ణవంశీ సినిమా రిలీజ్ డేట్ ఖరారు కాకపోయినా, సినిమాని ముందే ప్రత్యేక ప్రదర్శన చేయించగలుగుతారు.! చూసిన ఆ వందా నూట యాభై మంది నుంచే కృష్ణవంశీ తాను కోరుకున్న గౌరవాన్ని పొందారు. ఇక, లక్షలాది.. కోట్లాదిమంది సినీ అభిమానుల ముందుకు ఈ సినిమా వస్తే.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...