Switch to English

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.! ఈ స్నేహం అన్‌స్టాపబుల్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

అన్‌స్టాపబుల్ రియాల్టీ షో.. ఈసారి చాలా చాలా ఆసక్తికరంగా ముగిసింది. ఎన్నెన్నో ఎమోషన్స్.! ఓ దశలో నందమూరి బాలకృష్ణ కళ్ళు చెమర్చాయి. ఇంతకు ముందెన్నడూ హోస్ట్ నందమూరి బాలకృష్ణలో కనిపించని పరిస్థితి ఇది.

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి పదే పదే ‘భయ్యా..’ అంటూ బాలయ్య పిలవడం, ఆ జనసేన అధినేత.. పవర్ స్టార్ కాక ముందు ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన మానసిక సంఘర్షణ.. వాట్ నాట్.. ఇవన్నీ, అన్‌స్టాపబుల్ సీజన్ టూ ముగింపుని.. చాలా చాలా ప్రత్యేకంగా మార్చేశాయి.

ఔను, పవన్ కళ్యాణ్‌ని కేవలం సినీ నటుడిగానే కాదు, సంపూర్ణమైన వ్యక్తిగా.. ఓ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చూడటం మరో ప్రత్యేకమైన అంశం. ‘నేను మీ నుంచి తెలుగు పద్యాలు నేర్చుకోవాలి..’ అని పవన్ కళ్యాణ్ చెబితే, ‘మనం ముప్ఫయ్ ఏళ్ళ క్రితం ఈ స్నేహ బంధం ప్రారంభించి వుండాల్సింది..’ అంటూ బాలయ్య హృదయాంతరాల నుంచి వచ్చిన మాటలు వెరీ వెరీ స్పెషల్.

ప్రజాస్వామ్యం అంటే హక్కులే కాదు, బాధ్యతలు కూడా వుంటాయని పవన్ కళ్యాణ్ అత్యంత బాధ్యతాయుతంగా చేసిన వ్యాఖ్యలు.. భారతదేశం అనే ఓ ఘనమైన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినవి.. గుండెలో నింపుకోవాల్సినవి. పవన్ అలా చెబుతున్నప్పుడు బాలకృష్ణ కూడా ఆ ‘పవర్’ని ఫీలయ్యారు.

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ‘పవన్ కళ్యాణ్.. నాకు ఓ కొడుకుతో సమానం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాకనే నేను చచ్చిపోతా..’ అని అన్నారు. అంతే కాదు, ‘పవన్ కళ్యాణ్ చెమటోడ్చి సంపాదించిన సంపాదనను మాకు ఇస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరయ్యా ఇలా రాజకీయాల్లో నడచుకునేది.?’ అని ఆమె చెప్పిన మాటలు.. సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్.

డిప్రెషన్‌కి లోనవ్వద్దనీ.. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడాలనీ.. కష్టమైన క్షణాలు పోయి.. మంచి సమయం ఖచ్చితంగా వస్తుందనీ చెబుతూ, ఆత్మహత్య ఆలోచనలు చేసేవారిలో ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నించారు పవన్ కళ్యాణ్.. అదీ స్వీయ అనుభవాల గురించి ప్రస్తావిస్తూ.

‘చదువుకోవడమంటే, పరీక్షలు.. మార్కులు కాదు.. జీవితాన్ని చదువుకోవాలి..’ అని పవన్ కళ్యాణ్ చెబితే, ‘అదే నిజం’ అని బాలయ్య సైతం ఒప్పుకున్నారు.

కాగా, ‘హరిహర వీరమల్లు’ సినిమా తన కెరీర్‌లోనే చాలా స్పెషల్ ఫిలిం అనీ, పవన్ కళ్యాణ్ పెర్‌ఫెక్షనిస్ట్ అనీ దర్శకుడు క్రిష్ చెప్పాడు. ఈ షోలో ఆయన ఓ స్పెషల్ ఎట్రాక్షన్. ‘నేను బాలయ్య అభిమానిని.. పవన్ కళ్యాణ్ అభిమానిని..’ అని క్రిష్ చెప్పడం గమనార్హం.

‘నువ్వు సినిమాలూ చేయాలి.. రాజకీయాల్లోనూ వుండాలి. నువ్వు రెండు పడవల ప్రయాణం చేయగలవ్.. లక్ష్యాన్ని ముద్దాడే శక్తి నీకుంది.. నీ సంకల్పం గొప్పది..’ అని బాలకృష్ణ ఓ సోదరుడిలా, ఓ స్నేహితుడిలా పవన్ కళ్యాణ్‌ని ఆశీర్వదించడం గమనార్హం.

‘అభిమానులు గొడవ పడొద్దు. బాలకృష్ణ సినిమాలు విజయం సాధించాలని కోరుకున్న కుటుంబం మాది..’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ వుండాలి.. వుంటుంది.. అంతే తప్ప, మేం విరోధులం కాదు. కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయి..’ అని చెప్పారు పవన్ కళ్యాణ్.

‘రాజకీయాల పరంగా కూడా సినీ పరిశ్రమలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఆలోచన వుండొచ్చు. అంతమాత్రాన మేం శతృవులం కాదు..’ అని పవన్ కళ్యాణ్, ‘అన్‌స్టాపబుల్’ వేదికగా ఇచ్చిన సందేశం చాలా చాలా గొప్పది. చాలామంది మూర్ఖులకి ఇది అర్థం కావొచ్చు, కాకపోవచ్చు కూడా.!

‘అధికారం కొంతమందికే పరిమితం కాకూడదు. నేను మాట్లాడుతున్నది కులాల గురించి కాదు. కింది స్థాయి వరకు అధికారం చేరాలి.. అధికారం అందరిదీ అవ్వాలి..’ అని బాలకృష్ణ సాక్షిగా పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టారు. ‘స్వర్గీయ ఎన్టీయార్ హయాంలో టీడీపీ అంతా చేసేసింది.. నువ్వు టీడీపీలో చేరొచ్చు కదా.?’ అన్న బాలయ్య ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పై సమాధానం.. అన్‌స్టాపబుల్.!

– విశ్వ

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...