నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారతో సూపర్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈరోజు కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ అమిగోస్ ఈరోజు విడుదలైంది. ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్ చేసిన ఈ చిత్రం మొదటి నుండి ఆసక్తి కలిగించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.
కథ:
సిద్ధూ హైదరాబాద్ లో నివసించే ఒక సాధారణ కుర్రాడు. తన స్నేహితుడు ద్వారా డోపుల్ గ్యాంగర్స్ గురించి ఒక వెబ్ సైట్ ఉందని, వారితో కనెక్ట్ కావొచ్చని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో మంజు, కోల్కతాలో మైఖేల్ అచ్చుగుద్దినట్లు తనలాగే ఉంటారని తెలుసుకుంటాడు. ముగ్గురూ కలుసుకుని బాగా ఎంజాయ్ చేస్తారు కూడా.
అయితే ముగ్గురిలో ఒకరి ఉద్దేశాలు మంచిగా లేవని, అతని లక్ష్యం వేరని తర్వాత తెలుస్తుంది. మరి అతని వల్ల మిగిలిన ఇద్దరూ ఎదుర్కొనే సమస్యలు ఎలాంటివి? చివరికి ఏమవుతుంది అన్నది అమిగోస్.
నటీనటులు:
మరోసారి కళ్యాణ్ రామ్ తాను ఎంత మంచి నటుడు అన్నది చూపించాడు. మూడు పాత్రల్లో వేరియేషన్స్ పెర్ఫెక్ట్ గా ఇచ్చాడని చెప్పాలి. లుక్ పరంగా బాడీ లాంగ్వేజ్ పరంగా ఇంప్రెస్ చేసాడు. మూడు పాత్రలకు తాను ఎంత చేయగలడో అంతా చేసాడు. అయితే మూడో పాత్ర అంటే విలన్ పాత్రకు మాత్రం వాయిస్ పరంగా మోడ్యులేషన్ ఇంకొంచెం బెటర్ గా ప్రయత్నించి ఉండాల్సింది.
ఆషిక రంగనాథ్ చూడటానికి బాగుంది. అయితే ఆమె పాత్ర పరంగా పెద్దగా చేయడానికి పెద్దగా స్కోప్ దొరకలేదు. బ్రహ్మాజీ, సప్తగిరి తమ తమ పాత్రల్లో ఎంటర్టైన్ చేసారు. మిగిలినవాళ్లంతా మాములే.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు రాజేంద్ర రెడ్డి చాలా మంచి కాన్సెప్ట్ ను తీసుకున్నాడు. కథనం పరంగా ప్రయోగం చేయడానికి ఈ కథలో చాలా సత్తా ఉంది. అయితే కథ బాగున్నా కానీ కథనం మరీ రొటీన్ వ్యవహారంలా నడిచింది. ఆసక్తికర సన్నివేశాలు రాసుకోవడంలో పూర్తిగా విఫలమై రొటీన్ దారిలోకి మళ్ళాడు.
పాటలు అంతంత మాత్రమే. అటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్థాయికి తగ్గట్లు లేదు. అయితే సినిమాటోగ్రఫీ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ కు ఢోకా లేదు.
ప్లస్ పాయింట్స్:
- కళ్యాణ్ రామ్ పెర్ఫార్మన్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- నరేషన్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- ఫస్ట్ హాఫ్
విశ్లేషణ:
కథ పరంగా అత్యంత ఆసక్తికరంగా అనిపించిన అమిగోస్ నరేషన్ విషయంలో పూర్తిగా తడబడింది. కళ్యాణ్ రామ్ పెర్ఫార్మన్స్ బాగున్నా మూడు పాత్రల్లో కనిపించినా, ఈ అమిగోస్ మూడు రెట్ల నిరాశ కలిగించడం తథ్యం.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5