Switch to English

చిరంజీవికి విశిష్ట పురస్కారం.! వాళ్ళెందుకు చచ్చుబడిపోయారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి అజాత శతృవు.! సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా ఆయనకు శృతృవులు లేరు. కానీ, అక్కసు చాలామందికి వుంది. ప్రత్యేకించి సినీ పరిశ్రమలో చిరంజీవి ఎదుగుదలని చూసి ఓర్వలేనోళ్ళు కొంతమంది వున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ పురస్కారం చిరంజీవికి ప్రకటితమైనప్పుడూ నిస్సిగ్గు రాజకీయాలు సినీ పరిశ్రమలో నడిచాయి.

తాజాగా, ఇండియన్ పిలిం పర్సనాలిటీ 2022 పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేశారు. 150కి పైగా సినిమాల్లో నటించి, దాదాపు నాలుగు దశాబ్దాలుగా నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోయిన చిరంజీవి ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు.

గతంలో రజనీకాంత్ తదితర ప్రముఖులకు ఈ పురస్కారం లభించినప్పుడు తెలుగు మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, వెబ్ మీడియా.. ఇలా ఓ రేంజ్‌లో రచ్చ చేయడం చూశాం. మరి, చిరంజీవి విషయం లో.. ఎందుకు ఆ స్థాయి హంగామా కనిపించడంలేదు.

చిరంజీవి మీడియాకి ఎప్పుడూ దూరంగా వుండరు. మీడియాతో అత్యంత సన్నిహితంగానే మెలుగుతుంటారు. మరి, ఆ మీడియా చిరంజీవిని ఈ విషయంలో ఎందుకు దూరం పెడుతున్నట్టు.? ఏ శక్తులు వీళ్ళని, చిరంజీవికి దూరంగా తీసుకెళ్ళుతున్నట్లు.? ఈ విషయమై సినీ, రాజకీయ వర్గాల్లో ఒకింత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

చిరంజీవికి ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ 2022’ పురస్కారం దక్కడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ ఎంగిలిమెతుకులకు కక్కుర్తిపడే మీడియా సంస్థలనండీ, ఇతరులనండీ.. చిరంజీవికి దక్కిన అరుదైన గౌరవం తాలూకు స్థాయిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారన్నది బహిరంగ రహస్యమిక్కడ.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు సైతం చిరంజీవి ప్రతిభాపాటవాల్ని కొనియాడుతున్న వేళ, తెలుగు సినీ పరిశ్రమ నుంచి స్పందన కొరవడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కొందరు ప్రముఖులకు తోకల్లా మారిపోయిన పీఆర్వోలు, జర్నలిస్టులు, మీడియా సంస్థల కారణంగానే ఇదంతా జరుగుతోందా.? ఈ అంశంపై ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చా కార్యక్రమాలు సైతం జరగకపోవడానికి కారణమేంటి.?

నిజానికి, సినీ పరిశ్రమ తరఫున వివిధ విభాగాలు ఈ పురస్కారం విషయంలో చిరంజీవిని ప్రత్యేకించి అభినందించాలి, సన్మానించాలి. ఎందుకంటే, గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా, పెద్దన్నలా నిలబడి, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు చిరంజీవి. ‘స్థాయి’ విషయంలో తనకన్నా చాలా చిన్న వ్యక్తుల ముందు సైతం ‘చేతులు కట్టుకోవాల్సి వస్తే’ దానికీ చిరంజీవి వెనుకంజ వేయడంలేదు.. అంతిమంగా సినిమా పరిశ్రమకు మేలు జరగాలన్నదే చిరంజీవి ఆలోచన. అంతెందుకు, ‘పరిశ్రమ పెద్దన్న ఆయన కాదు..’ అని కొన్ని మూర్ఖపు నాలుకలు మాట్లాడుతోంటే, ‘ఔను, నాకు పరిశ్రమ పెద్దరికం వద్దు. పరిశ్రమ బిడ్డగా నేనెప్పుడూ పరిశ్రమ బాగు కోసం ప్రయత్నిస్తా..’ అని చెప్పిన గొప్ప వ్యక్తి చిరంజీవి.

ఒక్కమాటలో చెప్పాలంటే, పరిశ్రమలో చాలామందికి నోళ్ళు పడిపోయాయ్.. శరీరాలూ చచ్చుబడిపోయాయ్.! చిరంజీవికి దక్కిన అరుదైన గౌరవాన్ని జీర్ణించుకోలేకపోవడం వల్లనే వాళ్ళకి ఆ సమస్య వచ్చినట్టుంది. మీడియాకి కులజాడ్యం ఎక్కువైపోయింది. ఆ జాడ్యం, చిరంజీవి ఘనతను చాటి చెప్పాలంటే ఒప్పుకోదు మరి.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? ఇదా జర్నలిజం.? ఇదా మెగాస్టార్ చిరంజీవి అనే శిఖరానికి ఇచ్చే గౌరవం.

చిరంజీవి ఎప్పుడూ పొగడ్తల్ని ఆశించరు.. 150 సినిమాలు చేసిన చిరంజీవి, ఇన్నేళ్ళ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, మొక్కవోని ధైర్యంతో శిఖరమంత ఎత్తుకు ఎదిగారు. అభిమానులు ఆ శిఖరానికి తగిన గౌరవం దక్కాలని ఆశించడంలో తప్పు లేదు కదా.? ఆ అభిమానులే– ఇప్పుడు సోకాల్డ్ సినీ వర్గాల్ని, జర్నలిస్టుల్నీ, మీడియా సంస్థల్నీ, పరిశ్రమలో కొన్ని మూర్ఖపు తలకాయల్నీ ఏకిపారేస్తున్నారు.

6 COMMENTS

  1. Everything composed was very reasonable. But, think on this, suppose you
    were to write a awesome headline? I mean, I
    don’t wish to tell you how to run your website, but suppose you added something that makes
    people desire more? I mean చిరంజీవికి విశిష్ట పురస్కారం.!
    వాళ్ళెందుకు చచ్చుబడిపోయారు.?
    – TeluguBulletin.com is kinda plain. You could look at
    Yahoo’s home page and note how they create article
    titles to get people to click. You might add a video or a picture
    or two to get people interested about what you’ve got to say.
    Just my opinion, it might make your posts a little livelier.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....