నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘జనసేన పార్టీని రౌడీ సేన’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. అక్కడికి అదేదో గొప్ప ‘సెటైర్’లాగా వైసీపీ అనుకూల మీడియా, ‘స్వకుచమర్ధనం’ చేసేసుకుంటోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించలేదనీ, స్పందించడానికి కాల్షీట్లు లేవనీ, తెలుగుదేశం పార్టీ నుంచి ప్యాకేజీ అందితే తప్ప పవన్ కళ్యాణ్ స్పందించడనీ.. వైసీపీ అను‘కుల’ మీడియా ఓ రేంజ్లో వెర్రి కేకలు పెడుతోంది.
పదే పదే ‘దత్త పుత్రుడు’ అని పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు విమర్శలు చేస్తోంటే, కాస్త సమయం తీసుకుని, ‘చంచల్ గూడా జైలు పుత్రుడు.. సీబీఐ దత్త పుత్రుడు..’ అని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఎటాక్ చేశారా.? లేదా.? దానికి మళ్ళీ వైసీపీ ఏ స్థాయిలో ఏడ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
‘ప్యాకేజీ.. ప్యాకేజీ..’ అని ‘బులుగు నాయకులు’ మొరుగుతూ వుంటే, ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ అన్న చందాన, జనసేన అధినేత మొన్నీమధ్యనే ‘చెప్పు’ చూపించారు, ‘చెప్పుతో కొడతా కొడకల్లారా..’ అంటూ ఏకిపారేశారు. మళ్ళీ అలాంటి స్పందనని బహుశా వైసీపీ అను‘కుల’ మీడియా కోరుకుంటున్నట్టుంది.
అదేంటే, వైసీపీని జనసేనానితో తిట్టిస్తే, వైసీపీ అను‘కుల’ మీడియాకి అదో టైపు ఆనందం.. బహుశా దీన్ని శునకానందం అనాలేమో.! ఆ శునకానందంతోనే, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గట్టిగా తిట్టేయాలని వైసీపీ అను‘కుల’ మీడియా అనుకుంటున్నట్టుంది.
విమర్శకు ప్రతి విమర్శ చేయడమెంతసేపు.? తాను నటిస్తోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’కి జస్ట్ కొన్ని నిమిషాల బ్రేక్ ఇచ్చి, ఆ సమయంలో ముఖ్యమంత్రిని నానా రకాలుగా తిట్టి, ఆ వీడియోను విడుదల చేయడం పెద్ద పనేం కాదు పవన్ కళ్యాణ్‌కి.
అయినా, ఇదేం శాడిజం.? ప్రతినెలా ‘బిస్కెట్లు’ వేసి మరీ ‘కుల’ మీడియాని బులుగు పార్టీ పెంచి పోషిస్తోంటే, యజమాని మేలు కోరాల్సిన, శునకాలు.. ఆ యజమానిని ఇంకొకరితో తిట్టించాలనుకోవడమేంటి.? ప్చ్.. వైసీపీ అధినాయకత్వానికి ‘కుక్క బిస్కెట్ల’ ఖర్చు దండగయ్యేలా వుంది.. కాస్తంత ఆ అధినాయకత్వం ఈ విషయంలో జాగ్రత్త పడితే మంచిది.
ఇలా స్పందిస్తున్నారు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా.. నిన్నటి ముఖ్యమంత్రి ‘రౌడీ సేన’ విమర్శలు, ఆ విమర్శలపై వైసీపీ అను‘కుల’ మీడియా పైత్యం గురించి.
781278 183135Oh my goodness! an superb post dude. Several thanks Nevertheless We are experiencing dilemma with ur rss . Dont know why Not able to sign up to it. Could there be anybody acquiring identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 583024