Switch to English

‘ప్రేమ దేశం’ లో.. నా పాత్ర ఎంతో సరదాగా ఉంటుంది- మధుబాల

91,242FansLike
57,291FollowersFollow

త్రిగున్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ దేశం’. ‘శ్రీ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై శిరీష సిద్ధం ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలకు కూడా మంచి మార్కులు పడ్డాయి. డిసెంబర్ 2న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రాముఖ్యమైన పాత్రలో కనిపించనున్న అలనాటి హీరోయిన్ మధుబాల మీడియాతో ముచ్చటించారు…

నేను ఇది వరకు చాలా వరకు తల్లి పాత్రలు పోషించాను. ఇప్పుడు హీరోయిన్‌గా చేయలేను కాబట్టి తల్లి పాత్రలు వస్తాయి. ఈ పాత్రను నా కోసమే రాశానని దర్శకుడు అన్నారు. నేను ముందు నో చెప్పాను. కానీ పదే పదే నన్ను కలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇన్ని సార్లు ప్రయత్నాలు చేస్తున్నారు కదా? నేను చేయాలని ఫిక్స్ అయ్యా. తల్లీకొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించారు. ప్రేమ దేశం అనే టైటిల్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది.

‘ప్రేమ దేశం’ లో.. నా పాత్ర ఎంతో సరదాగా ఉంటుంది- మధుబాల

ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీతత్వం ఉంటుంది. హీరోయిన్‌గా చేసినప్పుడు అంతే.. ఇప్పుడు కూడా అంతే. కానీ దాన్ని నేను కాంపిటీషన్‌లా ఎప్పుడూ చూడను. మనకు ఏ పాత్ర రాసి ఉంటే.. ఆ పాత్రలు వస్తాయి.

సుహాసిని, చారు హాసన్ ఇలా అందరూ కలిసి ఓ వెబ్ సిరీస్ చేశారు. అలా మాకు కూడా ఫ్యామిలీ అంతా కలిసి నటించాలని ఉంది. కానీ సరైన కథ దొరకాలి. అయితే ఆ ప్రాజెక్ట్‌ను మాత్రం మేం నిర్మించం. కేవలం నటించాలని మాత్రమే ఉంది.

ప్రేమ దేశం సినిమాలో నేను కూడా ఒక హీరోయిన్‌లాంటి పాత్రలోనే కనిపిస్తాను. ఈ చిత్రంలో మ్యూజిక్‌ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. పెద్ద సినిమాలు, నెగెటివ్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాను.

నేను బయట చాలా ఫన్నీగా ఉంటాను. ప్రేమ దేశంలో సినిమాలో నా పాత్ర కామెడీ యాంగిల్‌లో ఉండదు. కానీ తమిళ్‌లో నేను స్వీట్ కార్న్ కాఫీ అనే వెబ్ సిరీస్‌లో ఫుల్ కామెడీ రోల్ చేశాను. నేను మామూలుగానే సరదాగా ఉంటాను. ఆ వెబ్ సిరీస్ చూశాక.. అందరూ నా కామెడీ టైమింగ్ బాగుందని అన్నారు. నాకు ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయాలని ఉంది.

‘ప్రేమ దేశం’ లో.. నా పాత్ర ఎంతో సరదాగా ఉంటుంది- మధుబాల

తెలుగు, హిందీ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. తమిళ్, మిగతా భాషల్లో కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది. తెలుగులో అయితే దర్శకులతో చర్చించే అవకాశం ఉంటుంది. తెలుగు భాష నాకు అంతగా తెలియకపోయినా మిగతా భాషల్లో నటించిన దానికంటే బాగా పర్ఫామెన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. నేను దేవాజు అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నాను. తమిళ్ దేజావులో కంటే తెలుగు దేజావులోనే చక్కగా చేసినట్టు అనిపిస్తుంది.

నా కెరీర్ ప్రారంభంలో ఈ భాషలోనే చేయాలి.. ఆ భాషలోనే చేయాలని అనుకోలేదు. అన్ని భాషల్లో సినిమాలు చేశాను. ఈ మధ్యే నేను ఒక తెలుగు సినిమాను పూర్తి చేశాను. గేమ్ ఆన్ అనే చిత్రం అద్భుతమైన కథతో రాబోతోంది. ఇప్పుడు తెలుగులో పని చేస్తేనే ఎక్కువ రీచ్ వస్తుంది. అందుకే నేను తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టాను.

రోజా, జెంటిల్‌మెన్, అల్లరి ప్రియుడు, అన్నయ్య, యోధ ఇలా కొన్ని చిత్రాల్లో నాకు మంచి పేరు వచ్చింది. ఇవన్నీ నాకు నచ్చిన చిత్రాలే. గోవింద, హత్కడి అనే సినిమాలు పెద్దగా ఆడకపోయినా కూడా అవి నాకు ఇష్టం. ఆ సినిమాల్లో నేను ఎక్కువగా కామెడీ రోల్స్ చేశాను. నాకు కామెడీ రోల్స్ అంటే ఇష్టం.

‘ప్రేమ దేశం’ లో.. నా పాత్ర ఎంతో సరదాగా ఉంటుంది- మధుబాల

నా వద్దకు వచ్చిన వాటిల్లో నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటాను. నెగెటివ్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా నేను చేసేందుకు రెడీగా ఉన్నాను. ప్రస్తుతం నన్ను ఎవ్వరూ కూడా ముంబై అమ్మాయిగా చూడటం లేదు. రకుల్ ప్రీత్ వంటి హీరోయిన్లు ఇక్కడకు వచ్చి తెలుగు నేర్చుకున్నారు. ఏ భాషలో సినిమాలు చేస్తే ఆ భాషకు చెందిన అమ్మాయిగా కనిపించేందుకు ప్రయత్నిస్తాను. నేను అయితే ఎక్కువగా నార్త్ ఇండియన్‌లా కనిపించను. సౌత్ ఇండియన్‌లా కనిపించను. అదే నాకు ప్లస్.

  నేను ప్రస్తుతం హిందీలో కర్తమ్ హుక్తమ్ అనే సినిమాను సోనమ్ షాతో కలిసి చేస్తున్నాను. మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. జీ5లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. వివేక్ శర్మ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాను. ఈ మధ్యే కలిబలి అనే సినిమా వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

హీరోగా తొలి ప్రీమియర్ షో, ధియేటర్ రిలీజ్..! ఎమోషనల్ అయిన హీరో

యూట్యూబర్ నుంచి కలర్ ఫొటోతో హీరోగా మారిన సుహాస్ పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకడిగా నటించాడు. తాను హీరోగా వస్తున్న రైటర్...

కోలీవుడ్‌కి విక్రమ్.. టాలీవుడ్‌కి మైఖేల్.. పాన్ ఇండియా రేంజ్‌లో సందీప్ కిషన్...

యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ హీరో చేసిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కోసం...

మంత్రి కిషన్ రెడ్డి లాంచ్ చేసిన NTh Hour మూవీ పోస్టర్!

టాలీవుడ్‌లో ఇప్పటివరకు చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఓ...

పిక్ టాక్.. నలుపు చీరలో మనసుల్ని దోచేస్తున్న దొరసాని!

టాలీవుడ్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవితాల కుమార్తె‌గా శివాత్మిక రాజశేఖర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ నటించిన సినిమాలు ఆమెకు...

పవన్ కల్యాణ్ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’..! ప్రారంభమైన కొత్త సినిమా ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే కొత్త సినిమా ప్రారంభమైంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్...

రాజకీయం

మార్పు మొదలైంది.! పవన్ దెబ్బకి దిగొచ్చిన జగన్.?

సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - పవన్ కళ్యాణ్ విషయమై ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...

ప్రభుత్వం-రాజ్ భవన్ మధ్య కుదిరిన సయోధ్య..! హైకోర్టు ఏమన్నదంటే..?

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆమోదంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించలేదని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పటిషన్ దాఖలు చేసింది....

మళ్ళీ పోటీ చేసేది ఎలా.? వైసీపీ మంత్రుల బిక్క మొహం.!

మీడియా ముందుకొచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని తూలనాడటంలో వైసీపీ నేతలు.. అందునా మంత్రులు చూపిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు.! ‘పవన్ కళ్యాణ్‌కి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు అయినా తెలుసా.?’ అని ప్రశ్నిస్తారో మంత్రి.!...

హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం..! బడ్జెట్ కు ఇంకా లభించని గవర్నర్ ఆమోదం

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూండగా.. ఇందుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడం కాక రేపుతోంది. దీంతో...

జనసేన, టీడీపీ, బీజేపీ.. ఉమ్మడి సీఎం అభ్యర్థి ఎవరంటే?!..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ‘సీఎం అభ్యర్థి’గా బరిలోకి దిగబోతున్నారు.! జనసేన పార్టీ నుంచి ఆయనే సీఎం అభ్యర్థి. జనసేన - బీజేపీ కూటమి నుంచి అయినా...

ఎక్కువ చదివినవి

‘కొత్త భవనాలు.. ఫామ్ హౌస్ లు కాదు ముఖ్యం..’ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు

హైదరాబాద్లోని రాజ్ భవన్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని’ అనే వ్యాఖ్యలు...

తుది శ్వాస విడిచిన పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి

ఈరోజు ఉదయమే సీనియర్ నటి జమున గారి మరణవార్త అందరినీ కలచివేసింది. ఆ బాధ సరిపోదు అన్నట్లుగా పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏ శ్రీనివాస మూర్తి ఇకలేరు అన్న వార్త అందరికీ షాక్...

బాలయ్యను కాపీ కొట్టిన రణబీర్..! అభిమాని కోపం తెప్పించడంతో..

స్టార్స్ తో అభిమానులు సెల్ఫీలు తీసుకోవడం సాధారణ విషయం. ఇలానే తన అభిమాన హీరో రణబీర్ కపూర్ తో సెల్ఫీ తీసుకోబోయాడు ఓ అభిమాని. అయితే.. అతని ఫోన్ అడిగి తీసుకున్న రణబీర్...

‘వారాహి’ రాకతో బెజవాడలో పోటెత్తిన ‘జన’ సంద్రం.! ఆ మంత్రులెక్కడ.?

‘ఆంద్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టనీయం..’ అంటూ మీడియా మైకుల ముందు పోజులు కొట్టిన మంత్రులెక్కడ.? ‘వారాహి’ రాకతో బెజవాడ జనసంద్రంగా మారిన దరిమిలా, వైసీపీ నేతలు ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. సాయంత్రానికి ఒకరొకరుగా మళ్ళీ...