Switch to English

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను మొత్తంగా 175 సీట్లనూ గెలిచేస్తామనే ధీమా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో వుంది.

నిజానికి, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాగే ఆలోచిస్తుంటుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పార్టీ శ్రేణుల్ని ఆ స్థాయిలో ఉత్సాహపరచని రాజకీయ పార్టీ ఏదైనా వుంటుందా.? కాకపోతే, ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి చుట్టూనే చాలా ప్రశ్నలు, అనుమానాలు, విమర్శలూ వస్తుంటాయ్.

2019 అసెంబ్లీ ఎన్నికల్ని పక్కన పెడితే, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వంటివాటిని ఓ ‘సబ్జెక్ట్’లా తీసుకున్నప్పుడు, ప్రతి ఎన్నికనీ గెలిచేందుకు వైసీపీ పడుతున్న ఆపోసాపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు వేరు.. సార్వత్రిక ఎన్నికలు వేరు.!

మూడ్ ఆఫ్ ది స్టేట్ లేదా మూడ్ ఆఫ్ ది నేషన్ ఎప్పుడెలా వుంటుందో ఎవరూ ఊహించలేరు. స్థానిక ఎన్నికలనేవి పూర్తిగా అధికార పార్టీ చేతిలో వుంటాయ్. పోలీసు యంత్రాంగాన్ని, ఇతర విభాగాల్ని పూర్తిగా ఆయా ఎన్నికల్లో ప్రభుత్వంలో వున్నవారే కంట్రోల్ చేస్తుంటారు. విపక్షాలకు చెందిన అభ్యర్థుల తలలు పగలగొట్టి మరీ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేసిన ఘనత వైసీపీది స్థానిక ఎన్నికలకు సంబంధించి. సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయ్.

ఏమో, వైసపీ ఆలోచనల్లో.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని కూడా స్థానిక ఎన్నికల్లా మార్చేసి, రాజకీయ ప్రత్యర్థులెవరూ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయగలమన్న గట్టి నమ్మకం వుందేమో.! అలా వున్నప్పుడే, నూట డెబ్భయ్ ఐదు అసెంబ్లీ సీట్లలో మొత్తంగా అన్ని సీట్లూ గెలిచేస్తామనే ధీమా కలుగుతుంది.

ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ‘అధికారంలోకి వచ్చాం.. రాజధానిని అయోమయంలో పడేశాం.. అభివృద్ధి గురించి మాట్లాడటం మానేశాం.. అడ్డగోలుగా అప్పులు చేసేశాం.. రోడ్లను నాశనం చేశాం.. ఇదే మా ‘బులుగు’ అభివృద్ధి. దీనినే జనం అభివృద్ధిగా భావించి ఓట్లేస్తారు, వేసేలా చేస్తాం..’ అని వైసీపీ ఘీంకరిస్తే, దానికి జనం కూడా ఆమోద ముద్ర వేస్తే.. ఇక, మాట్లాడుకోవడానికేముంటుంది.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...