Switch to English

కాపు సామాజికవర్గమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ వర్సెస్ రెడ్డి తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కాలన్న దిశగా అసలు చర్చ జరగడంలేదా.? జరగనివ్వడంలేదా.?

మంత్రి అంటి రాంబాబు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సొంత సామాజిక వర్గం ‘మాకు రాజ్యాధికారం కావాలి’ అనడంపై సెటైర్లు వేశారు. ‘పిచ్చి కాపు యువత..’ అంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, ‘సీఎం సీఎం.. అంటూ పవన్ కళ్యాణ్‌ని చూసి నినదించే కాపు యువత’ మీద ఆయన వేసిన సెటైర్లపై, ప్రముఖ న్యాయవాది, జనసేన సానుభూతిపరుడు కళ్యాణ్ దిలీప్ సుంకర తన ‘కామనర్ లైబ్రరీ’ అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు, ప్రస్తుత రాజకీయాల్ని విశ్లేషించారు.

ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి మీద కాపు ముద్ర వేసి, చిరంజీవికి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే వెన్నుపోటు పొడిచిన వైనం దగ్గర్నుంచి, పవన్ కళ్యాణ్‌కి దూరంగా వుండాలంటూ కాపు సామాజిక వర్గంపై వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలే చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం వరకు.. వివిధ అంశాల గురించి మాట్లాడారు కళ్యాణ్ దిలీప్ సుంకర.

పవన్ కళ్యాణ్ విశ్వసనీయతను అంబటి రాంబాబు ప్రశ్నించడంపై కళ్యాణ్ దిలీప్ సుంకర తనదైన స్టయిల్లో విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అంబానీనే చంపేయించాడంటూ రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అదే అంబానీ సూచనతో ఏపీకి సంబంధించిన రాజ్యసభ సీటుని సమర్పించేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు కళ్యాణ్ దిలీప్ సుంకర.

కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడ్డ ధీశాలి.. అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలు చెబుతుంటారనీ, అదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసి, బెయిల్ తెచ్చుకున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదా.? అని కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించారు.

‘వీరుడెక్కడ.? శూరుడెక్కడ.? గడచిన మూడేళ్ళలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు మాట తప్పారు.? ఎన్నిసార్లు మడమ తిప్పారు.? రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహాలుంటాయ్.. జనసేనకీ కొన్ని వ్యూహాలంటాయి. బీజేపీ తెరవెనుక అంటకాగుతున్న వైసీపీది రాజకీయమా.? జనసేనది రాజకీయం కాదా.?’ అంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర, అంబటి రాంబాబుపై మండిపడ్డారు.

‘మిమ్మల్ని మీరు జంతువులతో పోల్చుకుంటున్నారు.. మీ యజమానికి బానిసలుగా వుంటున్నారు.. మీరు మళ్ళీ కాపు యువత, పవన్ కళ్యాణ్ వైపు చూడొద్దు..’ అంటున్నారు. ఏది మీ విశ్వసనీయత.? అని నిలదీశారు కళ్యాణ్ దిలీప్ సుంకర. ‘చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళను చూసి కాపు యువత స్ఫూర్తి పొందుతోంది.. అందులో మేం కూడా వున్నాం.. మిమ్మల్ని చూసి ఏం స్ఫూర్తి పొందాలి.? మీ బానిసత్వమే మాకు వారసత్వమా.?’ అంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర అసహనం వ్యక్తం చేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...